breaking news
Investigation Committee
-
శశికళకు జైల్లో ప్రత్యేక మర్యాదలు
-
ఐదు గదులు... ప్రత్యేక కిచెన్
బెంగళూరు: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న అన్నా డీఎంకే మాజీ నాయకురాలు శశికళకు జైలులో ప్రత్యేక మర్యాదలు, సౌకర్యాలు కల్పించారని విచారణ కమిటీ తేల్చింది. ఆర్టీఐ కార్యకర్త నరసింహ మూర్తి దాఖలుచేసిన అర్జీకి ఈ మేరకు సమాధానం లభించింది. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శశికళకు ప్రత్యేక కిచెన్‌తో పాటు, ఐదు గదులు కల్పించారని అప్పటి డీఐజీ(జైళ్లు) డి. రూప ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు నిజమేనని విచారణ జరిపిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ కమిటీ నివేదిక ధ్రువీకరించింది. ఆర్టీఐ అర్జీ ద్వారా ఆ కమిటీ నివేదికను సంపాదించానని, శశికళకు ప్రత్యేక మర్యాదలు జరిగిన సంగతి నిజమేనని దీని ద్వారా తెలుస్తోందని నరసింహ మూర్తి చెప్పారు. కాగా ఈ పరిమాణంపై రూప స్పందిస్తూ..తాను ఆనాడు చెప్పిన విషయాల్నే విచారణ కమిటీ ధ్రువీకరించిందని పేర్కొన్నారు. వినయ్ కుమార్ తన నివేదికను 2017లో ప్రభుత్వానికి సమర్పించారు. జైలులో శశికళ తనకు నచ్చిన దుస్తులు ధరించి వంట చేసుకునేవారని, ఆమె సెల్లో సుగంధ ద్రవ్యాలు లభించాయని ఆ నివేదిక పేర్కొంది. జైలులో ఆమె స్వేచ్ఛగా సంచరించేవారని, తన సహచరిణి ఇళవరసితో కలసి బయటికి వెళ్తున్నట్లు వీడియోలో కనిపించిందని తెలిపింది. 2017 జూన్ 11న తెలుపు రంగు చొక్కా, ప్యాంటు ధరించిన ఓ వ్యక్తితో శశికళ సుమారు నాలుగు గంటలు మాట్లాడినట్లు పేర్కొంది. కానీ, ఆ వ్యక్తితో శశికళ 45 నిమిషాలే మాట్లాడినట్లు రిజిస్టర్లో నమోదైంది. -
గుర్గావ్ బాలుడి హత్యపై సీబీఎస్ఈ కమిటీ
న్యూఢిల్లీ : గుర్గావ్లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో రెండో తరగతి విద్యార్థి ప్రద్యుమన్ ఠాకూర్(7) దారుణ హత్యపై విచారణ కమిటీని నియమించినట్లు సీబీఎస్ఈ తెలిపింది. ప్రీత్‌విహార్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ అరుణ్‌కుమార్, డిప్యూటీ కమిషనర్ కైలాశ్‌తో నియమించిన కమిటీ 30 రోజుల్లోగా నివేదిక సమర్పిస్తుందని సీబీఎస్ఈ ఉన్నతాధికారి చెప్పారు. బాలుడి మృతికి బాధ్యునిగా చేస్తూ పాఠశాల తాత్కాలిక ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయడంతో పాటు మొత్తం భద్రతా సిబ్బందిని విధుల నుంచి తొలగించినట్లు జిల్లా ప్రజా సంబంధాల అధికారి తెలిపారు. కేసు విచారణను 7 రోజుల్లోగా పూర్తి చేస్తామని గుర్గావ్ పోలీస్ కమిషనర్ తెలిపారు. -
మద్యంపై ఉన్న ధ్యాస.. విద్యపై లేదు
ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం విఫలం ఇదే తీరు కొనసాగితే మరో ఉద్యమమే అధిక ఫీజు వసూళ్లపై హెచ్ఎస్పీఏ మండిపాటు శ్రీనగర్‌కాలనీ: పైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ఇన్వెస్టిగేషన్ కమిటీ వేసి విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు విక్రాంత్, ప్రతినిధులు సుబ్రహ్మణ్యం, ఆశిష్‌లు మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఏడేళ్లుగా 225 శాతం ఫీజులు పెరిగాయని చెప్పారు. పాఠశాల యాజమన్యాలు ఇష్టారీతిన ఫీజులు పెంచుతూ తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థికభారాన్ని మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక ఫీజుల వసూళ్లపై మంత్రి కడియం శ్రీహరికి, అధికారులకు నివేదికలు ఇచ్చినా చర్యలు శూన్యమని ఆరోపించారు. మద్యంపై ఉన్న ధ్యాస విద్యావ్యవస్థపై ఉంటే... మూడు రోజుల్లో సమగ్ర చట్టాలను రూపొందించవ్చని అభిప్రాయపడ్డారు. మద్యం విధివిధానాలపై చర్చలు, సమావేశాలు జరుపుతున్న ప్రభుత్వం.. విద్యా చట్టాల విధానాల్ని మార్చలేక పోతోందని మండిపడ్డారు. తమిళనాడు, మహారాష్ట్ర తరహా విద్యా చట్టాన్ని రూపొందించి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఫీజుల నియంత్రణ చేపట్టకపోతే మరో ఉద్యమానికి తెరలేపుతామని హెచ్చరించారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు. తల్లిదండ్రులు కూడా ప్రతి పాఠశాలలో అసోసియేషన్‌గా ఏర్పడి ఫీజుల నియంత్రణపై పోరాడాలని పిలుపు నిచ్చారు. ఆ చిత్తశుద్ధి ఏది..? దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జీఓ నెంబర్ 91ని సమగ్రంగా అమలు చేస్తూ చిత్తశుద్ధితో ఫీజుల నియంత్రణ చేపట్టారని ప్రశంసించారు. ఆయన మరణానంతరం జీఓను తుంగలో తొక్కారని, మూడేళ్లలో కోల్పోయిన ఫీజులను ముక్కుపిండి వసూలు చేశారని ధ్వజమెత్తారు. దీంతో ప్రస్తుతం చదువు కొనుకునే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలలు ఏటా ఐదు శాతానికి మించి ఫీజులు పెంచకూడదన్న నిబంధనలకు విరుద్ధంగా... 20, 30 శాతం పెంచేశారని మండిపడ్డారు. ఫలితంగా తల్లిదండ్రులు వ్యక్తిగత రుణాలు తీసుకుని పిల్లల ఫీజులు చెల్లించాల్సిన దౌర్భాగ్యం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు రవి, కమల్, సాయిరాజ్ పాల్గొన్నారు. చట్టబద్ధత అవసరం విద్యావ్యవస్థలో చట్టబద్దత అవసరం. నేటి విద్యావ్యస్థ వ్యాపారంగా తయారైంది. వేలు, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై తీవ్ర భారాన్ని మోపుతున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. విద్యాహక్కు చట్టం తీసుకువచ్చి ఏడేళ్లు అవుతున్నా ఎక్కడా అమలు కావడం లేదు. ప్రభుత్వాలు భాద్యత వహించి విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. - విక్రాంత్, హెచ్ఎస్పీఏ అధ్యక్షుడు ప్రభుత్వాలు మారినా ఫలితం లేదు... ప్రభుత్వాలు మారినా విద్యావ్యస్థలో ఎలాంటి మార్పులు రావడం లేదు. ఇష్టం వచ్చినట్లు ఫీజులు దండుకుంటున్నారు. వైఎస్సార్ హయాంలో జీఓ 91 సమగ్రంగా అమలు పరిచి ఫీజుల నియంత్రణను చేపట్టారు. రాజకీయం రంగులు మారుతుందే తప్ప విద్యావ్యస్థ, విధానాల్లో మార్పులు రావడం లేదు. - సుబ్రహ్మణ్యం, హెచ్ఎస్పీఏ సభ్యులు