ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న అన్నా డీఎంకే మాజీ నాయకురాలు శశికళకు జైలులో ప్రత్యేక మర్యాదలు, సౌకర్యాలు కల్పించారని విచారణ కమిటీ తేల్చింది. ఆర్టీఐ కార్యకర్త నరసింహ మూర్తి దాఖలుచేసిన అర్జీకి ఈ మేరకు సమాధానం లభించింది. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శశికళకు ప్రత్యేక కిచెన్‌తో పాటు, ఐదు గదులు కల్పించారని అప్పటి డీఐజీ(జైళ్లు) డి. రూప ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు నిజమేనని విచారణ జరిపిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ కమిటీ నివేదిక ధ్రువీకరించింది.