Intestine
-
దేశంలోనే తొలిసారిగా పేగుమార్పిడి శస్త్ర చికిత్స
అఫ్జల్గంజ్ (హైదరాబాద్): దేశంలోనే తొలిసారిగా ఉస్మానియా ఆసుపత్రిలో పేగు మార్పిడి (కాలేయానికి ఆనుకుని ఉండే పేగు) శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తిచేశామని వైద్యు లు ప్రకటించారు. 40 ఏళ్ల వయసున్న వ్యక్తి కాలేయ తదితర సమ స్యలతో బాధపడుతూ చికిత్స నిమిత్తం ఉస్మానియాలో చేరాడు. అతడు కాలేయ జబ్బులతో పాటు కుడివైపు కడుపులో గాంగ్రీన్ సెంట్రల్ లైన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో పేగు మార్పిడి చేయాలని సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ మధుసూదన్ నిర్ధారించారు. ఈనెల 19న పేగు మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. శస్త్ర చికిత్స అనంతరం 7వ రోజు ప్రొ టోకాల్ ఎండోస్కోపి నిర్వహించి రోగి సాధారణ స్థితికి చేరుకున్న ట్లు నిర్ధారించారు. దేశంలోనే తొలిసారిగా పేగుమార్పిడి శస్త్రచికిత్స చేయడంపై ముఖ్యమంత్రి వైద్యులను అభినందించారు. -
అరవైల్లో ఇరవైలా ఉండాలంటే...
సాక్షి, హైదరాబాద్: కొంతమంది 60 ఏళ్లలోనూ ఇరవై ఏళ్ల మాదిరిగానే ఉంటారు. ఇదేలా సాధ్యమో తెలుసుకునేందుకు లాసన్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, తియనీ హెల్త్ సైన్స్ ఇన్స్టిట్యూట్ (చైనా) అధ్యయనం జరిపింది. పేగుల్లో ఉండే కొన్ని బ్యాక్టీరియా రకాలు వయసుతోపాటు వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను నియంత్రిస్తున్నట్లు స్పష్టమైంది. వెయ్యి మంది చైనీయులను పరిశీలించిన తర్వాత ఈ అంచనాకు రాగలిగామని, వీరిలో మూడేళ్ల నుంచి వందేళ్ల వయసు వారు ఉన్నారని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త గ్రెగర్ రీడ్ తెలిపారు. శరీరంలోని సూక్ష్మజీవులను బట్టి ఆరోగ్య సమస్యలను గుర్తించేందుకు ఈ అధ్యయనం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వందేళ్ల వయసున్న వారి పేగుల్లోని సూక్ష్మజీవులు, 30 ఏళ్ల వయసులోని వారి సూక్ష్మజీవులు దాదాపు ఒకేలా ఉన్నాయని చెప్పారు. చిత్రంగా 19–24 మధ్య వయసు వారిలోని సూక్ష్మజీవులు మిగిలిన వారందరి కంటే భిన్నంగా ఉన్నాయని మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసుకుంటామని రీడ్ చెప్పారు. -
సికింద్రాబాద్లో అమ్మకానికి కన్న పేగు
-
పేగుబంధమే ప్రాణం పోసింది!
కళ్లు తెరవగానే బిడ్డ తల్లి ముఖమే చూస్తాడు. తన తల్లి పొత్తిళ్లలోనే సేదదీరుతాడు. కానీ చైనాకి చెందిన గావో కియాంబోకి అంత అదృష్టం లేకపోయింది. ఎందుకంటే... ఆ బాబు కడుపులో ఉన్నప్పుడు అతడి తల్లి ఝాంగ్ రాంగ్జియాంగ్కి ఓ పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లిపోయింది. ఆమె ఇక కోలుకోలేదని, ఏ క్షణాన్నయినా మరణించవచ్చని తేల్చేశారు వైద్యులు. సరిగ్గా అప్పుడే తెలిసింది వారికి... ఆమె కడుపులో ఓ బిడ్డ పెరుగుతోందని. దాంతో ఏవేవో ప్రయత్నాలు చేసి ఆమె ప్రాణాలు నిలబెట్టారు. నెలలు నిండగానే సిజేరియన్ చేసి బుజ్జి కియాంబోని ఈ లోకంలోకి తీసుకొచ్చారు. తల్లి పరిస్థితి తెలియక గుక్కపెట్టి ఏడ్చే కియాంబోని చూసి తండ్రి కలత చెందేవాడు. వాడి ఏడుపును ఆపడం కోసం తల్లి పక్కన పడుకోబెట్టేవాడు. తల్లి స్పర్శ సోకగానే ఏడుపు ఆపేసేవాడు కియాంబో. రెండేళ్లు వచ్చాకయితే... తల్లి పక్కనే కూర్చుని, తల్లిని పట్టి కుదుపుతూ ‘‘అమ్మా లేమ్మా’’ అంటూ ఏడ్చేవాడు. వాడి పిలుపుకి ఆ తల్లి మనసు స్పందించిందో లేక తన బిడ్డ వేదన చూసి... అచేతనమైపోయిన ఆమె నరనరమూ చలించిందో తెలియదు కానీ... ఝాంగ్ ఇటీవలే కళ్లు తెరిచింది. నలభై రెండేళ్ల ఆ తల్లి... తన రెండేళ్ల కొడుకుని తొలిసారి చూసుకుని మురిసిపోయింది. ఈ అద్భుతాన్ని చూసి వైద్యులు సైతం విస్తుపోయారు. ఝాంగ్ కోలుకుంటోంది. కానీ ఇంకా ఘనాహారం తీసుకోలేకపోతోంది. దాంతో అమ్మ కడుపు నింపే బాధ్యతను కూడా బుజ్జి కియాంబోనే తలకెత్తుకున్నాడు. తన చిన్ని నోటితో ఆహారాన్ని నమిలి తన తల్లి నోటికి అందిస్తాడు. ఝాంగ్ దాన్ని ఆనందంగా ఆరగిస్తుంది. తల్లీబిడ్డల అనుబంధానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ మరోటి ఉంటుందా!