breaking news
injures leg
-
అమితాబ్ బచ్చన్‌కు గాయం.. విపరీతమైన రక్తస్రావం.. కుట్లు
ముంబై: ఇటీవల తన ఎడమ కాలికి గాయమైందని బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ తెలిపారు. ఇనుప ముక్క కాలిపిక్కను చీల్చడంతో విపరీతంగా రక్తస్రావమైందని, కుట్లు కూడా పడ్డాయని ఆదివారం తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నడవొద్దని డాక్టర్లు గట్టి సలహా ఇచ్చినా గాయం కట్టుతోనే కౌన్ బనేగా కరోడ్‌పతి చిత్రీకరణలో పాల్గొన్నట్లు చెప్పారు. ఎడమ కాలి పిక్కకు బ్యాండేజీతో కౌన్ బనేగా కరోడ్‌పతి సెట్స్‌లో పరుగెత్తుతున్న ఫొటోలను శనివారం ఆయన పోస్ట్ చేశారు. -
షూటింగ్లో కమలహాసన్‌కు గాయాలు
ప్రముఖ నటుడు కమలహాసన్ షూటింగ్లో ప్రమదం కారణంగా గాయాలకు గురయ్యారు. దీంతో ఉత్తమ విలన్ షూటింగ్ రద్దయిం ది. కమలహాసన్ తాజాగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఉత్తమవిలన్ చిత్రా న్ని తిరుపతి బ్రదర్స్ పతాకంపై దర్శకుడు లింగుస్వామి నిర్మిస్తున్నారు. కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆండ్రియ, పూజాకుమార్, పార్వతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే మూడు రోజుల క్రితం చిత్రంలో కమలహాసన్ పోరాట దృశ్యాలను చిత్రీకరిస్తుండగా చిన్న ప్రమా దం జరిగి ఆయన కాలుకు గాయాలయ్యాయి. దీంతో ఆయన్ని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారని, దీంతో షూటింగ్ రద్దు అయినట్లు దర్శకుడు రమేష్ అరవింద్ తెలిపారు. కమల్‌కు పూర్తిగా ఆర్యోగం చేకూరిన తరువాత ఉత్తమ విలన్ షూటింగ్ చేస్తామని ఆయన తెలిపారు.