breaking news
Indian Institute of Management (Kolkata)
-
కలకత్తా ఐఐఎంలో అఘాయిత్యం
కోల్‌కతా: ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) కలకత్తా క్యాంపస్‌లో ఘోరం జరిగింది. ఓ మహిళపై విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తు మందు కలిపిన పానీయం తాగించాడని, తాను అపస్మారక స్థితిలోకి చేరుకున్న తర్వాత అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించారు. కోల్‌కతాలోని హరిదేవ్‌పూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిందితుడు మహావీర్ తొప్పాన్నవర్ అలియాస్ పరమానంద జైన్‌ను అదుపులోకి తీసుకున్నారు. శనివారం నగరంలోని అలీపూర్ కోర్టులో ప్రవేశపెట్టగా, నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం ఏడు రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 19వ తేదీన అతడిని మళ్లీ తమ ఎదుట ప్రవేశపెట్టాలని పోలీసులకు సూచించారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని నిందితుడు కోరగా మేజిస్ట్రేట్ తిరస్కరించారు. ఆన్లైన్ ద్వారా సంప్రదింపులు కోల్‌కతాకు చెందిన మహిళ క్లినికల్ సైకాలజిస్ట్‌గా పని చేస్తున్నారు. విద్యార్థులకు, యువతకు కౌన్సిలింగ్ ఇస్తుంటారు. ఐఐఎం క్యాంపస్‌లో చదువుకుంటున్న విద్యార్థి కౌన్సిలింగ్ తీసుకుంటానని ఆన్లైన్ ద్వారా ఆమెను సంప్రదించాడు. శుక్రవారం సదరు మహిళను తమ హాస్టల్‌కు రప్పించాడు. హాస్టల్ గదికి చేరుకున్న తర్వాత ఆమెకు డ్రగ్స్ కలిపిన పానీయం అందజేశాడు. అది సేవించి ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్ని గంటల తర్వాత తేరుకున్న బాధితురాలు తనపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. అతడిని గట్టిగా నిలదీయడంలో బెదిరింపులకు గురి చేశాడు. ఈ విషయం బయటపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. బాధితురాలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిన ఘోరాన్ని వివరించారు. పోలీసులు రంగంలోకి దిగి, శుక్రవారం రాత్రి నిందితుడు పరమానంద జైన్‌ను అరెస్టు చేశారు. ఈ ఉదంతంపై ఐఐఎం–కలకత్తా యాజమాన్యం స్పందించింది. తమ విద్యార్థిపై ఒక మహిళ ఫిర్యాదు చేసినట్లు తెలిసిందని వెల్లడించింది. ఆమె తమ సంస్థకు చెందిన మహిళ కాదని స్పష్టంచేసింది. కోల్‌కతాలో వరుస ఘటనలు పశి్చమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మహిళలపై అత్యాచార ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గత ఏడాది ఆగస్టు 9న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం జరగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అలాగే 15 రోజుల క్రితం కోల్‌కతాలోని న్యాయ కళాశాలలో 24 ఏళ్ల విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ముగ్గురు వ్యక్తులు సెక్యూరిటీ గార్డుతో కలిసి ఆమెను రేప్ చేసినట్లు కేసు నమోదైంది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అత్యాచారం జరగలేదు.. ఆటో నుంచి కింద పడిపోయింది ఐఐఎం–కలకత్తా క్యాంపస్ హాస్టల్లో అత్యాచారానికి గురైన మహిళ తండ్రి భిన్నంగా స్పందించారు. తన కుమార్తెపై అత్యాచారం జరగలేదని, ఆటోలో ప్రయాణిస్తూ కింద పడిపోవడంతో స్వల్పంగా గాయాల పాలైందని శనివారం చెప్పారు. శుక్రవారం రాత్రి 9.34 గంటల సమయంలో తనకు ఫోన్ వచ్చిందని, తన బిడ్డ ఆటో నుంచి పడిపోవడంతో అపస్మారక స్థితికి చేరినట్లు తెలిసిందని అన్నారు. పోలీసులు అమెను ఆసుపత్రికి చేర్చారని తెలిపారు. రేప్ జరగలేదని తన కుమార్తె తనతో స్వయంగా చెప్పిందని వెల్లడించారు. -
ఉండనివ్వరేల ఘనాఘనులు
అరవై ఏళ్ల చరిత్ర కలిగిన కలకత్తా ఐ.ఐ.ఎం. (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) కు సుమారు రెండున్నరేళ్ల క్రితం అంజు సేథ్ డైరెక్టర్‌గా వచ్చినప్పుడు కలకత్తా ఐ.ఐ.ఎం.కు తొలి మహిళా డైరెక్టరుగా ఆమె గుర్తింపు పొందారు. అయితే డైరెక్టరుగా మాత్రం ఆమె నిర్ణయాలకు, నిర్దేశాలకు, చివరికి ఆదేశాలకు కూడా గుర్తింపు గౌరవం లభించలేదన్న విషయం సోమవారం ఆమె రాజీనామా చేసి బయటికి వస్తున్నప్పుడు మాత్రమే ఆమెతో పాటు బయటపడింది! పురుషుడు స్త్రీని అధికారంలోకి రానివ్వడా! రానివ్వక తప్పనప్పుడు ఉండనివ్వడా!. ఉండనివ్వక తప్పనప్పుడు బాధ్యతలన్నీ సగౌరవగా ఆమెపై కుమ్మరించి అధికారాలన్నీ తన దగ్గరే ఉంచేసుకుంటాడా! అధికారం లేకుండా బాధ్యతలు ఎలా నెరవేర్చడం?! స్త్రీ సాధికారత అని మాటలు చెబుతుండే.. చదువు, వివేకం గల పెద్దపెద్ద సంస్థలలో కూడా ఇంతేనా! స్త్రీ.. పేరుకేనా ‘పదవి’లో ఉండటం. అంజూ సేథ్ విషయంలోనూ ఇదే జరిగింది. పురుషాధిక్య ‘పోరు’ పడలేక ఆమె తన డైరెక్టర్ పదవికి రాజీనామా చేసి ఐఐఎం (కలకత్తా) మెట్లు దిగి వెళ్లిపోయారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆ ఐఐఎం కి తొలి మహిళా డైరెక్టర్ ఆమె. అంజూ సేథ్ వెళ్లిపోతుంటే చైర్మన్ ముఖం చాటేశారు. బోర్డ్ చూస్తూ నిలబడింది. ఫ్యాకల్టీ మౌనంగా ఉండి పోయింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నేడూ రేపట్లో ఏమైనా మాట్లాడుతుందేమో చూడాలి. మేనేజ్మెంట్ రంగంలో అంజూ సేథ్ అత్యంత సమర్థురాలని పేరు. ఐఐఎమ్‌కి 2018లో డైరెక్టర్‌గా వచ్చే ముందువరకు యూఎస్‌లో ఆమె పెద్ద పొజిషన్లో ఉన్నారు. ఐఐఎమ్‌లో చేరినప్పటి నుంచీ డైరెక్టర్ హోదాలో ఆమె నిర్ణయాలను చైర్మన్ రెస్పెక్ట్ చేయడం లేదని ప్రధాన ఆరోపణ. ఆమెతో అతడి సమస్య ఏంటి? ఒక నిస్సహాయురాలిలా ఈ ఉన్నత విద్యావంతురాలు ఎందుకు వెళ్లిపోవలసి వచ్చింది? గ్లాస్ సీలింగ్ ని బ్రేక్ చేసిన మహిళను అసలే నిలవనివ్వరా ఈ ఘనాఘనులు?! అరవై ఏళ్ల చరిత్ర కలిగిన కలకత్తా ఐ.ఐ.ఎం. కు సుమారు రెండున్నరేళ్ల క్రితం అంజు సేథ్ డైరెక్టర్‌గా వచ్చినప్పుడు కలకత్తా ఐ.ఐ.ఎం.కు తొలి మహిళా డైరెక్టరుగా ఆమె గుర్తింపు పొందారు. అయితే డైరెక్టరుగా మాత్రం ఆమెకు గుర్తింపు గౌరవం లభించలేదన్న విషయం ఆమె రాజీనామా చేసి బయటికి వస్తున్నప్పుడు మాత్రమే ఆమెతో పాటు బయటపడింది! వర్జీనియాలోని ‘పంప్లిన్ కాలేజ్ ఆఫ్ బిజినెస్’లో ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ ఇండియా వచ్చి 2018 నవంబరులో కలకత్తా ఐ.ఐ.ఎం.లో డైరెక్టర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించారు అంజు సేథ్. అయితే తనను ఏనాడూ ఇక్కడివాళ్లు ‘లోపలి మనిషి’ చూడలేదని, ఐ.ఐ.ఎం.–సి ఛైర్మన్ శ్రీకృష్ణ కులకర్ణిని ఉద్దేశించి ఆమె ఎప్పటి నుంచో అంటూనే ఉన్నారు. సిబ్బంది చెబుతున్న దానిని బట్టి కూడా డైరెక్టర్ పరిధిని అతిక్రమించి వచ్చి మరీ ఛైర్మన్ ఆమె విధులకు ఆటంకాలు కలిగించారు. అనేక కమిటీల నుంచి ఆమెను ఉద్దేశపూర్వకంగా తొలగించారు! నిధుల సమీకరణ కమిటీ నుంచి తప్పించారు. ఆమెకున్న నియామక అధికారాలను నామమాత్రం చేశారు. ఆమెపై క్రమశిక్షణ చర్యలకు బోర్డు సభ్యులను ప్రేరేపించారు. పైపెచ్చు తిరిగి ఆమె మీదే గత డిసెంబరులో విద్యామంత్రిత్వశాఖ కార్యదర్శి అమిత్‌ఖేర్‌కు ఆమె పనితీరు సవ్యంగా ఉండటం లేదని, వివక్షతో కూడిన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫ్యాకల్టీ చేత లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయించారు. ఇవన్నీ కూడా అంజు సేథ్ తనకై తను బయటపెట్టినవి కాదు. బోర్డు సభ్యులలో, ఫ్యాకల్టీ విభాగంలో నిజానిజాలు తెలిసినవారు మీడియాకు వెల్లడించినవి. అంజు సేథ్ కూడా కలకత్తా ఐ.ఐ.ఎం.లోనే (1978) చదివారు. 1988లో మిషిగాన్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేశారు. 2008లో వర్జీనియా టెక్ (పంప్లిన్ కాలేజ్ ఆఫ్ బిజినెస్) లో ప్రొఫెసర్‌గా చేరారు. తిరిగి పదేళ్ల తర్వాత ఇండియా వచ్చారు. తనొక మహిళ కాబట్టి వివక్షకు గురయ్యానని ఆమె బలంగా నమ్ముతున్నారు. -
క్యాంపస్ న్యూస్
ఐఐఎం -కోల్‌కతా www.iimcal.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(కోల్‌కతా).. వచ్చే నెల 7, 8 తేదీల్లో ఫైనాన్షియల్ రీసెర్చ్ వర్క్‌షాప్‌ను నిర్వహించనుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిధులతో 2011లో ఐఐఎం-సీలో ఫైనాన్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్ ఆర్థిక రంగంలో పరిశోధనలను ప్రోత్సహిస్తుంది. ఇందుకోసం రీసెర్చ్ వర్క్‌షాప్స్‌ను నిర్వహిస్తుంది. వచ్చే నెలలో జరిగే ఈ వర్క్‌షాప్‌కు దేశవిదేశాల నుంచి ప్రముఖ విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు. అదేవిధంగా ఐవీ బిజినెస్ స్కూల్‌తో కలిసి కేస్ మెథడ్స్‌పై నవంబర్ 25 నుంచి 28 వరకు మూడున్నర రోజులపాటు వర్క్‌షాపును జరపనుంది. ఇందులో భాగంగా కేస్ రైటింగ్, కేస్ టీచింగ్‌పై ఐవీ బిజినెస్ స్కూల్ ఫ్యాకల్టీ సూచనలు, సలహాలు అందిస్తారు. యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా www.news.uwa.edu.au యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా ‘ద మాస్టర్ ఆఫ్ హెరిటేజ్ స్టడీస్’ పేరుతో కొత్త పీజీ డిగ్రీ కోర్సును నిర్వహిస్తోంది. రెండేళ్ల కాలపరిమితి ఉండే ఈ కోర్సు తరగతులను 2015 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నారు. దేశీయ, అంతర్జాతీయ వారసత్వంతోపాటు హెరిటేజ్ మేనేజ్మెంట్కు సంబంధించిన కల్చరల్ సస్టెయినబిలిటీ, ప్లానింగ్ అండ్ డిజైన్, రిప్రజెంటేషన్ అండ్ ఎథిక్స్ వంటి అనేక అంశాలు ఈ కోర్సు కరికులమ్‌లో చేర్చారు. స్కూల్ ఆఫ్ ఇండీజీనియస్ స్టడీస్ అండ్ ఫ్యాకల్టీస్ ఆఫ్ ఆర్ట్స్, లా, ఆర్కిటెక్చర్, ల్యాండ్‌స్కేప్ అండ్ విజువల్ ఆర్ట్స్‌కు చెందిన ఫ్యాకల్టీ ఈ కోర్సు నిర్వహణలో పాలుపంచుకుంటారు. ఈ కోర్సు పూర్తి చేసినవారికి నేషనల్ పార్కులు, కన్జర్వేషన్ రిజర్వ్‌లు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో ఉపాధి లభించే అవకాశం ఉంది.