breaking news
Indian courts
-
‘మిస్టర్ గాంధీ కేసును గమనిస్తున్నాం’
రాహుల్ గాంధీపై కోర్టు కేసు, అనర్హతవేటు తదితర పరిణామాలపై అమెరికా స్పందించింది. రాహుల్ గాంధీ కేసును తమ దేశం గమనిస్తోందని, భావప్రకటనా స్వేచ్ఛతో సహా ప్రజాస్వామ్య విలువలకు భాగస్వామ్య నిబద్ధత విషయంలో భారత ప్రభుత్వంతో అమెరికా ఎప్పుడూ నిమగ్నమై ఉంటుందని పేర్కొంది. రాహుల్ గాంధీని అనర్హత వేటు పరిణామంపై అమెరికా అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్‌కు సోమవారం(అక్కడి కాలమానం ప్రకారం) మీడియా నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. చట్టబద్ధమైన పాలన, న్యాయ స్వాతంత్ర్యం పట్ల గౌరవం ఏ ప్రజాస్వామ్యానికైనా మూలస్తంభం. భారత దేశంలోని కోర్టులలో మిస్టర్ గాంధీ (రాహుల్ గాంధీని ఉద్దేశించి) కేసును మేము గమనిస్తూనే ఉన్నాం.. భావ స్వేచ్ఛ ప్రకటన సహా ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు భారత్‌తో కలిసి మేం ముందుకు నడుస్తాం. ఇరు దేశాల ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేసేందుకు.. కీలకమైన మానవ హక్కుల పరిరక్షణను(భావ స్వేచ్ఛ ప్రకటనసహా), ప్రజాస్వామ్య విలువల ప్రాముఖ్యతను ఎప్పటికప్పుడు హైలెట్ చేస్తూనే వస్తున్నాం అని తెలిపారాయన. అయితే.. ఈ విషయంలో భారత ప్రభుత్వంతో గానీ, రాహుల్ గాంధీతో గానీ అమెరికా ఏమైనా సంప్రదింపులు జరిపిందా? అని ప్రశ్నించగా.. అలాంటిదేం జరగలేదని ఆయన బదులిచ్చారు. కాగా, కాగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘మోదీ ఇంటి పేరు’(2019లో చేసినవి) వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో దోషిగా తేలిడంతో.. రెండేళ్ల జైలు శిక్ష విధించింది సూరత్ కోర్టు. ఆపై ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఆయనపై లోక్‌సభ సభ్యునిగా అనర్హత వేటు పడింది. బీజేపీ మినహా దాదాపు అన్ని పార్టీలు ఈ నిర్ణయాన్ని ఖండించాయి. ఈ విషయమై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్.. విపక్షాలన్నింటిని ఏకం చేసుకుని కేంద్రంపై తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శిస్తోంది. (చదవండి: యూఎస్ టేనస్సీ: స్కూల్లో పూర్వ విద్యార్థి కాల్పులు.. చిన్నారులు, సిబ్బంది మృతి) -
న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల లేమి!
అలహాబాద్: భారతీయ కోర్టులు ఇప్పటికీ అసంపూర్ణ మౌలిక సదుపాయాలతో పనిచేస్తున్నాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటి‹Ùపాలన అనంతరం న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం రాజ్యమేలిందన్నారు. పరిష్కారానికే జాతీయ జ్యుడీíÙయల్ ఇన్ఫ్రా కార్పొరేషన్(ఎన్‌జేఐసీ) ఏర్పాటుతోనే ఈసమస్యకు పరిష్కారమని సూచించారు. ఉత్తరప్రదేశ్జాతీయ లా యూనివర్సిటీ, అలహాబాద్ హైకోర్టు నూతన భవన సదుపాయం శంకుస్థాపనలో రాష్ట్రపతితో పాటు ఆయన పాల్గొన్నారు. దేశీయ కోర్టుల్లో మెరుగైన వసతులు లేకపోవడం విచారకరమని, దీనివల్ల న్యాయసిబ్బంది పనితీరుపై ప్రభావం కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారం ఎన్‌జేఐసీ ఏర్పాటేనని అభిప్రాయపడ్డారు. దేశంలోని జాతీయ ఆస్తుల నిర్మాణ సంస్థలతో కలిసి ఎన్‌జేఐసీ పనిచేస్తుందని, జాతీయ కోర్టు డెవలప్మెంట్ ప్రాజెక్టుకు నమూనాలను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. సరైన మౌలికవసతుల కల్పనతో న్యాయం పొందే మార్గం మరింత సుగమం అవుతుందన్నారు. అలహాబాద్ హైకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడాన్ని ప్రస్తావిస్తూ, నూతన భవనంతో జ్యుడీషియరీ మరింత చురుగ్గా పనిచేసి పెండింగులను తగ్గిస్తుందని ఆశించారు. తీర్పులను వ్యవహారిక భాషలోకి అనువదించాన్న సూచన రాష్ట్రపతి కోవింద్దేనని ఆయన ప్రశంసించారు. ఆ తీర్పు సాహసోపేతం 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి జగ్మోహన్లాల్ సిన్హా ఇచి్చన తీర్పు అత్యంత సాహసోపేతమైనదని సీజేఐ రమణ ప్రశంసించారు. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఇందిర ఎన్నికను చెల్లకుండా చేసిన ఈ తీర్పు దేశంలో ఒక కుదుపు తెచ్చిందన్నారు. దీనికారణంగానే చివరకు ఇందిర ఎమర్జెన్సీ విధించారని గుర్తు చేశారు. అలహాబాద్ హైకోర్టుకు 150 సంవత్సరాల చరిత్రుందని కొనియాడారు. ఇక్కడనుంచి అనేకమంది గొప్ప న్యాయవాదులు, న్యాయమూర్తులు వచ్చారన్నారు. దీంతో పాటు అలహాబాద్ నగర ప్రాశస్త్యాన్ని కూడా ఆయన ప్రస్తుతించారు. -
ఆలూమగల రాజీలో ఆర్టీఐ చెల్లదు
విశ్లేషణ అత్యధిక శాతం భార్యాభర్తలకు రాజీ పరిష్కారం అత్యుత్తమం. సలహా సంప్రదింపులలో ఇరుపక్షాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ప్రతిపాదనలు తదితర అంశాలను మరే వివాదంలోకీ తీసుకువెళ్లకూడదు. ఈ గోప్యతే మధ్యవర్తిత్వ రాజీ పరిష్కారానికి ప్రాణం. శ్రీమతి అగర్వాల్, భర్తతో తనకున్న వివాదం విషయమై ఢిల్లీ న్యాయ సహాయ కేంద్రంలో మధ్యవర్తి ద్వారా ప్రత్యా మ్నాయ పరిష్కారం కోసమని రాజీ చర్చలు జరిపారు. 1983 లో పెళ్లయిన తనను ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత బల వంతంగా మానసిక చికిత్సాలయానికి తీసుకువెళ్లారని ఆమె ఆరోపించారు. ఈ వివాదాన్ని సలహా సంప్రదింపులకు పంపారు. అవీ విఫలమైనాక కోర్టులో విడాకులు, గృహహింస కేసులు వేశారు. కోర్టులో తన వాదానికి సాక్ష్యాలుగా మధ్యవర్తిత్వ సలహా సంప్రదింపుల వివరాలు కావాలని ఆమె సమాచార హక్కు (సహ) చట్టం కింద కోరారు. అవి గోప్యమై నవని ఇవ్వజాలమని ప్రజా సమాచార అధికారి, ఆపై అధికారి తీర్మానించారు. అప్పీలు సమాచార కమిషన్ ముందుకువచ్చింది. ఈ వివరాలను ధ్రువీకరణ పత్రాలుగా ఇవ్వవచ్చా? ఇది సంక్లిష్ట న్యాయ ప్రశ్న. వివాహ, తదితర వివాదాలు కోర్టుల్లో పరిష్కారం కావడం కష్టం. నిపుణుల సలహాలు, పెద్ద మనిషి మధ్య వర్తిత్వంతో రాజీ కుదుర్చుకోవడం, ఇద్దరూ కూచుని సమస్యల పరిష్కారానికి మాట్లాడుకోవడం వంటి ప్రక్రియలన్నీ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార (ఏడీఆర్) సంస్థల సమ్మతిపై ఆధారపడ్డవి. జాతీయ న్యాయ సలహా సహాయ చట్టం ఇచ్చిన అధికారంతో న్యాయ సహాయ కేంద్రాలలో, మధ్యవర్తిత్వ కేంద్రాల్లో రాజీ ఒప్పందాలు జరుగుతున్నాయి. అయితే ఆర్బిట్రేషన్‌లో కోర్ట్టు తీర్పులా అమలు చేసుకోదగిన అవార్డు లభిస్తుంది. రాజీ చర్చల్లో తీర్పులు, అవార్డులు ఉండవు. మధ్యవ ర్తులు, సలహాదారులు మార్గదర్శనలో కుదిరే రాజీ అంగీకారాలు మాత్రమే ఉంటాయి. ఫలానా విధంగా ఉండా లని భార్యాభర్తలను వారు నిర్దేశించలేరు. ఇలా కుదిరే రాజీ పరిష్కారం కోర్టుల్లో అమలు చేయదగినది కాదు. మధ్యవర్తిత్వ పరిష్కారాన్ని కోర్ట్టు తీర్పులకు సరైన ప్రత్యామ్నాయంగా అన్ని దేశాల్లోనూ వాడుతున్నారు. అయితే సలహా సంప్రదింపుల క్రమంలో ఇరుపక్షాల నుంచి వచ్చిన అభిప్రాయాలు, ప్రతిపాదనలు తదితర అంశాలన్నీ అక్కడే ముగిసిపోవాలి. వాటిని మరే వివా దంలోకీ తీసుకు వెళ్లకూడదు. ఈ గోప్యతే మధ్యవర్తిత్వ రాజీ పరిష్కారానికి ప్రాణం. ఆర్బిట్రేషన్ అండ్ కన్సీలి యేషన్ చట్టం, 1996’లో ఈ గోపనీయతా సూత్రాన్ని చేర్చారు. దానిలో 70, 75, 81 సెక్షన్లు కీలకమైనవి. గోప నీయతే కాదు, ఇక్కడి ప్రతిపాదనలను, కాగితాలను కోర్టుల్లో సాక్ష్యాలుగా అనుమతించరు. మధ్యవర్తిని, పార్టీలను సాక్షులుగా పిలవరాదు. 2004 మధ్యవర్తి త్వం, రాజీ నిబంధనలలోని 20, 21 గోపనీయతను పాటించాలని చెబుతున్నాయి. సుప్రీం, మోతీరాం వర్సె స్ అశోక్ కుమార్ (2010 (14) అడిషనల్ ఎస్సీఆర్ 809), హరేశ్ దయారాం ఠాకూర్ వర్సెస్ మహారాష్ర్ట ఏఐఆర్ 2000 ఎస్సీ 2281 తీర్పుల్లో పేర్కొంది. ఇంటి తగాదాలు తదితర తగాదాల్లో కక్షిదారులు కోర్ట్టుకు వెళితే సీపీసీ ఆర్డర్ 32ఎ కింద రాజీకి ప్రయత్నిం చవచ్చు. సెక్షన్ 89ని సవరించి ప్రత్యా మ్నాయ పరిష్కా రాలకు చట్టబద్ధత కల్పించారు. న్యాయాధికారి పరిష్కా రం సాధ్యమనుకునే అంశాలలో కక్షిదారులను ప్రత్యా మ్నాయ పరిష్కారాల కోసం పంపవచ్చు. ఆ ప్రక్రియను ఎంచుకుంటే... సాక్ష్యాల తలనొప్పులు, క్రాస్ ఎగ్జామినే షన్ హింస, లాయర్ల క్రూరమైన ప్రశ్నలకు ఆస్కారం ఉండదు. తిక్క నియమాలు వీర విహారం చేయవు. కేసు చదవలేదనే సాకుతో వాయిదాలు వేసే దుర్మార్గాలు సాగవు. కుటుంబంలో హింస భరించలేక కోర్టుకు వచ్చి, అక్కడ కూడా హింసను భరించలేని వారికి ఈ ప్రత్యా మ్నాయం పెద్ద ఊరట. అలాంటి పరిష్కారాలను ప్రోత్సహించడం కోసమే ఈ వివరాలను కోర్ట్టుకు ఈడ్చేందుకు ఒప్పుకోరు. తగాదా పడే కక్షిదారులు పగబట్టిన వారైనా, ససేమిరా దేనికీ అంగీకరించని ధన దురహంకారులైనా రాజీకిరారు. వచ్చినా పరిష్కారానికి ఒప్పుకోరు. అలాంటివారే కోర్టుకు ఈడ్చే ప్రయత్నం చేస్తారు. సామరస్య పరిష్కారం కోరుకునే కోట్లాది సామాన్యులకు గృహహింస కోర్టుల్లో అనుభవించాల్సి వచ్చే హింసల నుంచి రాజీ పరిష్కారం గొప్ప విముక్తి. సీపీసీ, ఆర్బిట్రేషన్ చట్టాలలో ఏ నియమాలున్నా సహ చట్ట నియమాలదే ప్రాథమ్యత. సమాచారం ఇవ్వా లని చెప్పే సహ చట్టం వర్తించినా... సెక్షన్ 8(1) (ఇ), (జె) కింద వ్యక్తిగతమైన, నమ్మి ఇచ్చిన సమాచారం ఇవ్వకూడదు. బహళ ప్రజా ప్రయోజనాలు ఇమిడి ఉం టే మాత్రం ఆ సమాచారాన్ని కూడా ఇవ్వవచ్చు. శ్రీమతి అగర్వాల్ కేసులో బహుళ ప్రజా ప్రయోజనమేదీ లేదు. కోర్ట్టులో తమ హక్కులను కాపాడుకోకుండా వారిని ఎవ రూ ఆపరు. సెక్షన్ 8(1) ప్రకారం వెల్లడించడం కన్నా మధ్యవర్తిత్వ సమాచారాన్ని దాచడమే ప్రయోజనకరం అనుకుంటే వెల్లడించనవసరం లేదు. రాజీ చర్చల సమా చారం సాక్ష్యమనడానికి వీల్లేదు. రాజీలో పెద్ద మనిషి ముందు పరిష్కారం మీది నమ్మకంతో చెప్పిన విషయా లను రచ్చకు ఈడ్చడానికి వీల్లేదు. నిజానికి ప్రత్యామ్నా య పరిష్కారమైన రాజీ ప్రయత్నాలు మనగలగడం వివాహ, వివాహేతర వివాదాలకు చాలా అవసరం. అవి సజీవంగా మిగిలేలా రక్షణ కల్పించడంలో ప్రజాప్రయో జనం ఉంది. (రాజీ సలహాసంప్రదింపుల సమాచారం ఇవ్వడానికి వీల్లేదని రమా అగ్రవాస్ వర్సెస్ ఢిల్లీ న్యాయ సహాయాధికార సంస్థ కేసు (సీఐసీ/ఎస్ఏ/ఏ/2015/ 000305)లో నిర్ణయం ఆధారంగా). (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com -మాడభూషి శ్రీధర్