breaking news
ICET notification
-
తెలంగాణలో ఐసెట్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఐసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు తెలంగాణలో ఐసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 7 నుంచి జూన్ 15 వరకు దరఖాస్తుల స్వీకరిస్తారు. రూ. 250 అపరాధ రుసుముతో జూన్ 30 వరకు, రూ. 500 అపరాధ రుసుముతో జులై 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 13 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం ఇచ్చారు. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు 8 ఆగస్టు నుండి 11 ఆగస్టు వరకు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 17న ఐసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. చదవండి: భక్తుల అనుమతిపై టీటీడీ కీలక నిర్ణయం.. నోముల భగత్‌పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు -
ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల
యూనివర్సిటీ క్యాంపస్: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఐసెట్–2020 నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఐసెట్ కన్వీనర్ ఎం.శ్రీనివాసులురెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఏప్రిల్ 3వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఏప్రిల్ 27న ఐసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. -
ఫిబ్రవరి 3న ఐసెట్ నోటిఫికేషన్
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఐసెట్)కు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 6 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. అపరాధ రుసుము లేకుండా దరఖాస్తుల స్వీకరణకు దాదాపు నెలరోజులపాటు గడువు ఇవ్వనున్నారు. గురువారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఏపీఐసెట్ కమిటీ సమావేశం జరిగింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాలరెడ్డి, వైస్ఛైర్మన్లు ప్రొఫెసర్ విజయప్రకాశ్, ప్రొఫెసర్ నరసింహారావు, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ బి.ఉదయలక్ష్మి, ఐసెట్ కమిటీ ఛైర్మన్, ఏయూ వీసీ ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు, కన్వీనర్ ప్రొఫెసర్ కె.రామ్మోహనరావు, మండలి కార్యదర్శి ప్రొఫెసర్ వరదరాజన్, క్యాంపుఆఫీస్ ఇన్‌ఛార్జి కె.రఘునాధ్ తదితరులు పాల్గొన్నారు. ఐసెట్ షెడ్యూల్‌ను సమావేశంలో కమిటీ ఖరారు చేసింది. ఐసెట్ షెడ్యూల్ : నోటిఫికేషన్ - ఫిబ్రవరి 3 ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం - ఫిబ్రవరి 6 అపరాధ రుసుము లేకుండా గడువు - మార్చి 5 రూ.500 రుసుముతో - మార్చి 15 ఆన్లైన్ దరఖాస్తుల్లో తప్పులుంటే సవరణ - మార్చి 19 రూ.2వేల రుసుముతో - మార్చి 24 రూ.5వేల రుసుముతో - మార్చి 31 హాల్టిక్కెట్ల డౌన్లోడ్ ప్రారంభం - ఏప్రిల్ 20 రూ.10వేల రుసుముతో దరఖాస్తు స్వీకరణ - మే 9 ఐసెట్ పరీక్ష - మే 16 ప్రాధమిక కీ విడుదల - మే 19 అభ్యంతరాలకు గడువు - మే 23 ర్యాంకుల ప్రకటన - మే 27


