breaking news
ICET 2015
-
ఐసెట్ కౌన్సెలింగ్ ఎప్పుడో!
* ఇప్పటివరకూ విడుదల కాని నోటిఫికేషన్ * కొనసాగుతున్న వాయిదాల పర్వం * విద్యాసంవత్సరం ప్రారంభమై వారం గడిచినా రాని స్పష్టత * పట్టించుకోని ఉన్నత విద్యా మండలి * ఆందోళనలో వేల మంది విద్యార్థులు సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్-2015 కౌన్సెలింగ్ కోసం విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ ఏడాది మే 22న ప్రవేశ పరీక్ష నిర్వహించినా కౌన్సెలింగ్ నిర్వహణపై ఉన్నత విద్యా మండలి ఇప్పటివరకూ చర్యలు చేపట్టలేదు. కాలేజీల అనుబంధ గుర్తింపు విషయంలో యూనివర్సిటీలతో చర్చించడంలో విద్యామండలి అలసత్వం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వస్తున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై వారం రోజులు గడిచినా ఐసెట్ కౌన్సెలింగ్‌పై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ఐసెట్‌లో అర్హత సాధించిన 58,037 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ కోసం నిరీక్షణ తప్పేలా లేదు. జూలైలోనే జరగాల్సింది.. మేలో జరిగిన ఐసెట్ ఫలితాలు జూన్‌లోనే వెలువడ్డాయి. పరీక్షకు 63,490 మంది విద్యార్థులు హాజరుకాగా 58,037 మంది అర్హత సాధించారు. జూలై 11న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఐసెట్ ఫలితాల విడుదల సందర్భంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి ప్రకటించారు. 17న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 18 నుంచి 22 వరకు ఆప్షన్లు ఇచ్చుకోవాలని, 25న సీట్లు కేటాయిస్తామన్నారు. అయితే ఇప్పటి వరకు ఆచరణకు నోచుకోలేదు. కాలేజీలకు అనుబంధ గుర్తింపు రాకపోవడంతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడింది. కాగా, ఆగస్టు 3 నుంచి కౌన్సెలింగ్ చేపడతామని విద్యా శాఖ గతంలో పేర్కొనగా, అదీ ఆచరణలోకి రాలేదు. ఇప్పటివరకు ప్రవేశాల కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వెలువడకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత విద్యా మండలి త్వరగా ప్రవేశాలకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల
విశాఖ: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఐసెట్ -2015 ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. ఎంపీ అవంతి శ్రీనివాస్ ఐసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో కాకినాడకు చెందిన కొడాలి భార్గవ్ 163 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించగా, విశాఖపట్నానికి చెందిన ప్రశాంత్ 160 మార్కులతో ద్వితీయ స్థానం పొందాడు. నెల్లూరుకు చెందిన రాఘవేంద్ర 157 మార్కులు సాధించి తృతీయ స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. ఫలితాల కోసం క్లిక్ చేయండి: -
26న ఐసెట్ ఫలితాలు
ఏయూక్యాంపస్ (విశాఖపట్నం): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ 2015 ఫలితాలను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు కన్వీనర్ రామచంద్రమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను www. apicet15. org, www.apsche.org, www.andhrauniversity.edu.in వెబ్సైట్లలో ఉంచుతారని తెలిపారు.