breaking news
Hyper Market
-
NielsenIQ: ‘మాల్స్’ విక్రయాల్లో భారత్ టాప్
న్యూఢిల్లీ: ఆధునిక వాణిజ్య ఛానళ్ల ద్వారా విక్రయాల్లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే భారత్ అగ్రస్థానంలో ఉన్నట్టు నీల్సన్ఐక్యూ నివేదిక తెలిపింది. ఆధునిక అంగళ్లలో ఎఫ్ఎంసీజీ, టెక్నాలజీ డ్యూరబుల్స్ విక్రయాల పరంగా రెండంకెల వృద్ధి చూపిస్తున్న ఏకైక దేశం భారత్ అని.. ప్రీమియం ఉత్పత్తులకు ఆదరణ, పండుగల విక్రయాలు ఇందుకు సాయపడుతున్నట్టు పేర్కొంది. 40 శాతం ఎఫ్ఎంసీజీ అమ్మకాలు, 30 శాతం టెక్నాలజీ డ్యూరబుల్స్ విక్రయాలు ఆధునిక వాణిజ్య ఛానళ్ల ద్వారానే నమోదవుతున్నట్టు వెల్లడించింది. ఇది భారత వినియోగదారుల ప్రాధాన్యతలను తెలియజేస్తున్నట్టు నీల్సన్ ఐక్యూ నివేదిక పేర్కొంది. ఆన్లైన్ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నా కానీ, భారత వినియోగదారులకు ఆధునిక అంగళ్లు (సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లు, డిపార్ట్మెంట్ స్టోర్లు) ప్రాధాన్య మార్గాలుగా ఉన్నట్టు తెలిపింది. ‘‘ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆధునిక వాణిజ్యం బలంగానే నమోదైంది. ధరల అస్థిరతలు ఉన్నప్పటికీ రండంకెల వృద్ధి నమోదైంది. ప్రీమియం ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది’’అని ఈ నివేదిక వివరించింది. ఎఫ్ఎంసీజీ, టెక్ డ్యూరబుల్స్ విక్రయాలకు పండగల సీజన్ కీలకమని పేర్కొంది. ఈ కాలంలోనే ఎఫ్ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో 20 శాతం, టెక్నాలజీ డ్యూరబుల్స్ అమ్మక్లాలో 60 శాతం నమోదవుతున్నట్టు తెలిపింది. ఆహారోత్పత్తుల కంటే వీటి అమ్మకాలే ఆయా సీజన్లలో 1.8 రెట్లు అధికంగా ఉంటున్నట్టు పేర్కొంది. చిన్న తయారీ సంస్థల ఉత్పత్తులతోపాటు, రిటైలర్లు సొంతంగా నిర్వహించే ప్రైవేటు లేబుల్స్ రూపంలో పెద్ద కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. ప్రైవేటు లేబుళ్ల అమ్మకాలు పెద్ద తయారీ సంస్థల ఉత్పత్తులతో పోలి్చతే ప్రవేటు లేబుళ్ల అమ్మకాలు (రిటైల్ సంస్థల సొంత ఉత్పత్తులు) 1.5 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక చిన్న తయారీ సంస్థలు కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలో 70 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి’’అని నీల్సన్ ఐక్యూ నివేదిక తెలిపింది. ఆధునిక చానళ్లలో సంప్రదాయంగా ఎఫ్ఎంసీజీలకు సంబంధించి పెద్ద ప్యాక్‌లకు ఆదరణ ఉంటుండగా, ఇది క్రమంగా చిన్న ప్యాక్‌ల వైపు మళ్లుతున్నట్టు వివరించింది. -
స్టాక్స్ వ్యూ
షాపర్స్ స్టాప్ బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.373 టార్గెట్ ధర: రూ.520 ఎందుకంటే: డిపార్ట్మెంటల్ స్టోర్స్, స్పెషాల్టీ ఫార్మాట్ స్టోర్స్, హైపర్ మార్కెట్ సెగ్మెంట్లలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత రిటైల్ రంగ దిగ్గజాల్లో ఒకటి. గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి క్వార్టర్ అమ్మకాలు 10% వృద్ధితో రూ.1,179 కోట్లకు పెరిగాయి. హైపర్సిటీ ఫార్మాట్ బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయినప్పటికీ, ఈవిభాగం పనితీరు బాగానే మెరుగుపడుతోంది. ఆన్లైన్ రిటైల్ కంపెనీలు భారీ డిస్కౌంట్లనివ్వడంతో డిపార్ట్మెంటల్ స్టోర్ ఆదాయాలు పడిపోయాయి. దీనిని నివారించడానికి తన ప్రైవేట్ లేబుల్స్ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లోనూ, ఇతర ఈ కామర్స్ వెబ్సైట్లలలోనూ ఆఫర్ చేస్తోంది. ఇటీవలే ఐస్టాప్ పేరుతో లెన్స్, ఫ్రేమ్‌ల వ్యాపారంలోకి ప్రవేశించింది. త్వరలో రేసన్ బ్రాండ్‌తో మహిళల దుస్తులను అందించనున్నది. క్రికెటర్ విరాట్ కోహ్లి బ్రాండ్ అంబాసిడర్‌గా యువ వినియోగదారులే లక్ష్యంగా రాన్ బ్రాండ్‌ను త్వరలో అందుబాటులోకి తేనున్నది. కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రెండేళ్లలో 12 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించి రూ.5,473 కోట్లకు పెరుగుతుందని అంచనా. మంగళం సిమెంట్ బ్రోకరేజ్ సంస్థ: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.238 టార్గెట్ ధర: రూ.450 ఎందుకంటే: బికే బిర్లా గ్రూప్ కంపెనీకి చెందిన సిమెంట్ తయారీ కంపెనీ ఇది. కంపెనీ వ్యవస్థాపిత ఉత్పాదక సామర్థ్యం ఏడాదికి 3.25 మిలియన్ టన్నులు. ఇటీవలనే 1.25 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కొత్తగా జత అయిం ది. బిర్లా ఉత్తమ్ బ్రాండ్ పేరుతో రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్‌ల్లో సిమెంట్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. 3,500 కు పైగా రిటైలర్లు, 1,100 కు పైగా డీలర్లతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గత ఏడాది నాలుగో త్రైమాసిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. కంపెనీ ఇబిటా టన్నుకు రూ.262గా ఉంది. అమ్మకాలు(టన్నుల్లో) ఏడాది ప్రాతిపదికన 20%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 13% చొప్పున పెరిగాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన వ్యయాలు 5% తగ్గాయి. లాభదాయకత తగ్గినా, వ్యయాలు కూడా తగ్గుతుండడం కంపెనీకి కలసి వచ్చే అంశం. ఆలీఘర్ ప్లాంట్ విస్తరణ పూర్తికానుండడంతో పశ్చిమ ఉత్తర ప్రదేశ్ మార్కెట్ అవసరాలను తీర్చగలుగుతుంది. రాజస్థాన్‌లోని మోరాక్ ప్లాంట్‌కు లభించిన వ్యాట్ మినహాయింపు ప్రయోజనం ఈ క్వార్టర్ నుంచి కనిపిస్తుంది. ధరలు, డిమాండ్ పెరిగితే ప్రయోజనం పొందగలిగే సిమెంట్ కంపెనీల్లో మొదటి వరుసలో ఉంటుంది.