breaking news
Houston Court
-
కారులో ఎలుగుబంటి.. ప్రాణాలు కాపాడిన కుక్క!
హ్యూస్టన్ కౌంటీ: సాధారణంగా కార్‌ను పార్కింగ్ చేసే తొందరలో.. ఒక్కొసారి దాని డోర్‌ని లాక్‌చేయడం మరిచిపోవడం లేదా లాక్ వేసిన కూడా సరిగ్గా పడక పోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కొన్ని ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటాయి. అయితే, జార్జియాలోని హ్యూస్టన్ కౌంటీలో ఒక మహిళకు ఇలాగే అనుకోని వింత సంఘటన ఎదురైంది. వివరాలు.. హ్యూస్టన్ కౌంటీకి చెందిన మేరీజేన్ అనే మహిళ వార్నర్ రాబిన్స్ స్కూల్లో ఆర్ట్ టీచర్‌గా పని చేస్తుంది. ఆ స్కూల్ గాట్టిన్బర్గ్లోని టెనస్సీలో ఉంది. ప్రతిరోజు కార్లో అక్కడికి వెళ్లి క్లాస్‌లు తీసుకొని రాత్రి వరకు తన గమ్యస్థలానికి చేరుకుంటుంది. అయితే, ఆ టీచర్ ఉన్న అపార్ట్మెంట్ అడవికి దగ్గరగా ఉంటుంది. అక్కడ జన సంచారం కూడ తక్కువగా ఉంటుంది. అందుకే ఆమె రక్షణ కోసం ఒక కుక్కను కూడా పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఒకరోజు క్లాసులు పూర్తిచేసుకొని అర్ధరాత్రి హ్యూస్టన్ కౌంటీకి చేరుకుంది. అయితే, ఆరోజు రాత్రి ఒక నల్లని ఎలుగు బంటి ఆమె కారు డోరును తెరిచి దానిలో ప్రవేశించింది. అంతటితో ఆగకుండా, సీట్లను , ఆక్సిజన్ బెలూన్ను చింపేసింది. కార్లోపలి భాగాలను, ఇతర వస్తువులను చిందర వందర చేసేసింది. పాపం.. కార్లోపలికి వెళ్లిన ఎలుగు బంటికి , బయటకు వెళ్లటానికి డోర్లు తెరుచుకోలేదు. దాంతో అలాగే కార్లో ఉండిపోయింది. మేరీజేన్ ప్రతిరోజులాగే ఉదయాన్నే 6 గంటలకు స్కూల్‌కు వెళదామని కార్ దగ్గరకు వెళ్లింది. అయితే, తన పెంపుడు కుక్క .. కారును చూసి భయంతో వణికిపోతూ.. వింతగా అరవడాన్ని మేరీ గమనించింది. దీంతో , ఆమె కార్‌ను పరీక్షించి చూసింది. మొదట కార్లో ఏవరో వ్యక్తి ఉన్నట్లు భావించింది. కాస్త దగ్గరకు వెళ్లి చూడగానే ఆమె నోటి వెంట మాట రాలేదు. కార్లో ఉంది మనిషికాదు... ఎలుగు బంటి అని షాక్‌కు గురయ్యింది. వెంటనే.. అక్కడి పోలీసు అధికారులకు సమాచారం అందించింది. కాసేపటికి వారు అక్కడికి చేరుకున్న పోలీసులు కార్ దగ్గరకు వెళ్లి పెద్ద శబ్దాలు చేశారు. దీంతో కారు లోపల ఉన్న ఎలుగు బంటి అద్దాలను పగలకొట్టుకుని అక్కడి నుంచి అడవిలోకి పారిపోయింది. ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ పాపం.. ఎలుగు బంటికి మీ కారులో తినడానికి ఏం దోరకలేదు’, ‘ ఇంకా నయ్యం మీపై దాడిచేయలేదు’, ‘ మీ అదృష్టం బావుంది ’ , ‘ మీ పెంపుడు కుక్కే మీ ప్రాణాలను కాపాడింది ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల ఒక మహిళ తన ఇంటి గోడపై వచ్చిన ఒక ఎలుగు.. తన పెంపుడు కుక్కలపై దాడి చేస్తుందని వట్టి చేతులతోనే ఎలుగుతో పోరాడిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. చదవండి: బ్రేవ్‌గర్ల్ వర్సెస్ బియర్ : ఎలుగుబంటికే ఎదురెళ్లి -
కూచిభొట్ల హత్య కేసు: కోర్టుకు నిందితుడు
విచారణ మే 9కి వాయిదా హూస్టన్: హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్‌ను కాల్చిచంపిన నౌకాదళ విభాగం మాజీ ఉద్యోగి ఆడం పూరింటన్ గురువారం స్థానిక న్యాయస్థానం ఎదుట హాజరయ్యాడు. నారింజ రంగుతో కూడిన జంప్‌సూట్ ధరించిన పూరింటన్ విచారవదనంతో కనిపించాడు. అయితే ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలను పరిశీలించాల్సి ఉన్నందువల్ల మరికొంత సమయం కావాలని హంతకుడి తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో ఈ కేçసు తదుపరి విచారణను కోర్టు మే నెల తొమ్మిదో తేదీకి వాయిదావేసింది. శ్రీనివాస్, అతని స్నేహితుడు మేడసాని అలోక్.ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి కన్సాస్‌లోని ఓ బార్‌కు వెళ్లడం. అక్కడ నిందితుడు పూరింటన్ వీరికి తారసపడడం తెలిసిందే. ‘మీరు మధ్యప్రాచ్యానికి చెందినవారు కదా. మా దేశం విడిచివెళ్లిపోండి’ అంటూ తొలుత శ్రీనివాస్, అలోక్‌లతో గొడవకు దిగాడు. ఆ తర్వాత బార్ నిర్వాహకులు అతనిని అక్కడి నుంచి బలవంతంగా బయటికి పంపగా కొద్దిసేపటి తర్వాత మళ్లీ అక్కడకు చేరుకుని ఆకస్మికంగా వీరిరువురిపై కాల్పులు జరపగా శ్రీనివాస్ చనిపోవడం తెలిసిందే.