breaking news
Hip Hop dance
-
డ్యాన్సింగ్ సిటీ.. హిప్హాప్ స్టెప్స్..
సాక్షి, సిటీబ్యూరో: అధునాతన జీవన శైలి, మోడ్రన్ ఫ్యాషన్ హంగులను అందిపుచ్చుకోవడంలో నగరం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిసిందే.. ముఖ్యంగా మోడ్రన్ ఆర్ట్స్‌కు నగరంలో విపరీతంగా క్రేజ్ పెరిగిపోతోంది. ఇందులో భాగంగానే సిటీలో ట్రెండీ డ్యాన్స్ స్టెప్పులను ఆహ్వానిస్తున్నారు.. ఆస్వాదిస్తున్నారు. దశాబ్ద కాలం క్రితంతో పోలిస్తే ప్రస్తుతం నగరంలో డ్యాన్సింగ్‌లో ఎన్నో మార్పులు, విభిన్న టెక్నిక్స్ రూపుదిద్దుకున్నాయి. డ్యాన్స్‌లో వెస్ట్రన్ స్టైల్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ప్రస్తుత తరుణంలో వేడుక ఏదైనా సరే.., అందులో స్టెప్పు లేనిదే కిక్కు రాదు. కార్పొరేట్ ఈవెంట్స్ మొదలు సినిమా ఫంక్షన్ల వరకు హిప్హాప్, జాజ్ వంటి ట్రెండీ స్టెప్పులతో నగరం నృత్యం చేస్తోంది. నృత్యాన్నే కెరీర్‌గా మార్చుకున్న ఎంతో మంది డ్యాన్సర్లకు ఈవెంట్స్ ఉపాధిగా మారాయి. ప్రైవేటు పార్టీలు మొదలు కొత్త సంవత్సర వేడుకల వరకు ఈ డ్యాన్స్ బృందాలకు డిమాండ్ పెరిగిపోయింది.టాలీవుడ్ టూ బాలీవుడ్..నగరం వేదికగా నిర్వహించే పలు ఈవెంట్లలో వెస్ట్రన్, బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు ఎలక్ట్రిక్ జాజ్, లాకింగ్ వంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కావాలని నిర్వాహకులు కోరుకుంటున్నారు. ఈ డ్యాన్స్ స్టెప్పులకు నగరవాసుల నుంచి వస్తున్న ఆదరణ అలా పెరిగిపోతుండటం విశేషం. ఇలాంటి డ్యాన్స్ నేరి్పంచడానికి నగరంలో ప్రత్యేకంగా డ్యాన్సింగ్ స్టూడియోలు సైతం నిర్వహిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలు, హోలీ వంటి సంబరాల్లో భాగంగా పలు క్లబ్స్‌లో నిర్వహించే వేడుకల్లో, మ్యూజిక్ కన్సర్ట్స్ ముఖ్యంగా సినిమా ఆడియో ఫంక్షన్లు ఇతర కార్పొరేట్ కార్యక్రమాలకు ఈ డ్యాన్సర్లను ఆహా్వనిస్తున్నారు. స్థానికంగానే కాకుండా సీజన్లలో ముంబై, ఢిల్లీ వంటి నగరాల నుంచి ప్రత్యేకంగా ఈ నృత్యకారులను నగరానికి ఆహా్వనిస్తున్నారు. అంతేగాకుండా ఈ మధ్యకాలంలో ప్లాష్ మాబ్ కల్చర్ బాగా పెరిగిపోయింది. నగరంలోని పెద్ద పెద్ద మాల్స్‌లో విరివిగా ప్లాష్మాబ్స్ నిర్వహిస్తూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నారు. పేజ్ త్రీ పీపుల్ నిర్వహించే ప్రైవేట్ పార్టీల్లో సాల్సా వంటి డ్యాన్సులను ఆస్వాదిస్తున్నారు. సిటీ నుంచి.. గోవా ఫెస్టివల్స్‌కు..సినిమాల్లో సైడ్ డ్యాన్సర్లుగా చేస్తూనే మిగతా సమయాల్లో ఇలాంటి ఈవెంట్స్‌లో బిజీగా ఉంటున్నారు డ్యాన్స్ ప్రేమికులు. ఇదో ఉపాధిగానూ, అవకాశాలు కల్పించే ప్రత్యామ్నాయ వేదికగానూ డ్యాన్సర్లకు ఉపయోగపడుతుందని పలువురు డ్యాన్సర్లు పేర్కొన్నారు. నగరం నుంచి గోవా ఫిల్మ్ ఫెస్టివల్స్, నూతన సంవత్సర వేడుకలు తదితర కార్యక్రమాలకు వెళ్తున్నామని వారు తెలిపారు. నగరంలో ప్రత్యేకంగా నిర్వహించే మ్యూజిక్ కన్సర్ట్స్, నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే దాండియా ఈవెంట్స్‌లో ఈ డ్యాన్సర్లను ముందస్తుగానే బుక్ చేసుకోవడం విశేషం. ఈ మధ్య కాలంలో సంగీత్స్లో డ్యాన్సర్లకు బాగా డిమాండ్ పెరిగింది. ప్రతీ సంగీత్‌లో కనీసం ఒక కొరియోగ్రాఫర్, తనతో పాటు నృత్య బృందం పాల్గొనడమే కాకుండా నిర్వాహకులకు శిక్షణ అందించి సంగీత్‌లో సందడి చేస్తున్నారు.అవకాశాలెన్నో.. గతంతో పోలిస్తే ప్రస్తుతం డ్యాన్సర్లకు విభిన్న వేదికల్లో అవకాశాలు పెరిగాయి. మోడ్రన్ స్టెప్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే చాలు.., స్ట్రీట్ డ్యాన్సింగ్ నుంచి సినిమా ఫంక్షన్ల వరకు ఎన్నో అవకాశాలు. నగరం వేదికగా పలు సినిమా ఆడియో ఫంక్షన్లు, కార్పొరేట్ నైట్ ఈవెంట్స్‌తో పాటు తదితర లైఫ్ స్టైల్ ఈవెంట్లలో డ్యాన్సర్‌గా పాల్గొన్నారు. అంతేగాకుండా గోవా వేదికగా జరిగే డ్యాన్స్ ఫెస్టివల్స్‌లో పాల్గొన్నారు. ఇలాంటి వేదికలు మారుతున్న డ్యాన్స్ కల్చర్పైన అవగాహన పెంచుతాయి. ఇక్కడ వెస్ట్రన్ డ్యాన్స్‌కు ఆదరణ బాగా పెరిగింది. ఎలక్ట్రిక్ జాజ్, లాకింగ్ వంటి అధునాతన డ్యాన్సింగ్ స్టెప్పులు నగరానికి ఈ మధ్య వస్తున్నాయి. – శ్రీకాంత్, కొరియోగ్రాఫర్, శ్రీస్ డ్యాన్స్ స్టూడియోస్సాల్సా సైతం..20 ఏళ్లుగా నగరం వేదికగా డ్యాన్స్‌లో వస్తున్న మార్పులను గమనిస్తున్నాను. సిటీలో ఎక్కువగా టాలీవుడ్, బాలీవుడ్, హిప్హాప్కు క్రేజ్ ఉంది. నగరంతో పాటు బెంగళూరు వంటి నగరాల్లో అప్పుడప్పుడూ జాజ్, ఫ్రీక్ స్టైల్ వంటివి సందడి చేస్తున్నాయి. ఇవే కాకుండా ప్రత్యేకంగా సాల్సా, బచ్చాటా వంటి డ్యాన్సులను ఆస్వాదించే నగరవాసులున్నారు. కొంత కాలం పాటు క్లాసికల్ సమ్మిళితమైన బిబాయింగ్ వంటి డ్యాన్సులనూ నగరవాసులు చేసేవారు. డ్యాన్స్ లేకుండా ఈవెంట్స్ లేవు అనేంతలా డ్యాన్స్ పరిణామ క్రమం మారింది. ఈవెంట్స్‌తో పాటు ఫ్రీక్, హిప్ హాప్ వంటి డ్యాన్స్ ఫెస్టివల్స్ సైతం నిర్వహిస్తుంటారు. – నాగేంద్ర, కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ఇవి చదవండి: మునుపటి కాలం కాదు ఇది, కానీ.. -
USA : ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు
అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో జరుగనున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఈ నెల 29 నుండి అక్టోబర్ 1 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ప్రపంచ సంస్కృతులలోని భిన్నత్వాన్ని ఒకే వేదికపైకి చేర్చే ఈ ఉత్సవాలను గతంలో 3 సార్లు వివిధ దేశాలలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహించింది. 4వ విడత ఉత్సవాలను ఈ ఏడాది వాషింగ్టన్ డిసిలోని నేషనల్ మాల్ ప్రాంగణంలో మరింత ఘనంగా, చిరస్మరణీయంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసిలోని క్యాపిటల్ భవనం ముందున్న విశాల ప్రాంగణంలో ఫుట్ బాల్ మైదానమంత విస్తీర్ణంలో భారీ వేదికను ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలనుండి 17,000 మంది కళాకారులు, అనేక దేశాల నేతలు, ప్రముఖులు ఈ ఉత్సవాలలో పాల్గొంటున్నారు. లక్షలమంది ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొంటారని అంచనా వేస్తున్న ఈ ఉత్సవాలలో ప్రధాన ఆకర్షణగా 50కి పైగా ప్రదర్శనలు జరుగబోతున్నాయి. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడి అమరుడయిన మార్టిన్ లూధర్ కింగ్ ప్రఖ్యాత ఉపన్యాసం “ఐ హావ్ ఎ డ్రీమ్” ను నేషనల్ మాల్ వేదికపై నుండే ఇచ్చారు.1963వ సంవత్సరంలో జరగిన ఈ ఉపన్యాసం ద్వారా ప్రపంచ సమైక్యత, సమానతా సందేశాన్ని అందరికీ చాటిచెప్పాడు. దానికి ఒక శతాబ్ది క్రితం షికాగోలోని ప్రపంచ పార్లమెంటు సదస్సులో స్వామి వివేకానందుని ఉపన్యాసం అక్కడి ప్రజలను సన్మోహితులను చేసి, ఆయన జ్ఞానానికి పాదాక్రాంతులను చేసింది. ప్రపంచంలోని వివిధ మత నాయకులను తన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు గా పేర్కొంటూ మతవిశ్వాసాల పేరుతో ప్రజలను విభజించడం, ఇతర ధర్మాల పట్ల అసహనం విడనాడ వలసిందిగా అతడు హితవు పలికాడు. ఈ సెప్టెంబర్ 29వ తేదీన ప్రారంభం కానున్న ఈ చారిత్రాత్మక ఉత్సంలో శ్రీ శ్రీ రవిశంకర్, ప్రపంచంలో దేశాలు, ధర్మాలు, జాతుల మధ్య భేదాభిప్రాయాలను, అంతరాలను చెరిపివేసి, 180 దేశాలకు చెందిన ప్రజలను “ఒకే ప్రపంచ కుటుంబం” గా ఒకే వేదికపై ఆవిష్కరిస్తారు.మానవాళిని సమైక్యంగా ఉంచేవాటిలో ప్రధాన పాత్రగా ఉండే ఆహారం అనేది ఇక్కడ కూడా తన పాత్రను పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధదేశాలకు చెందిన వంటకాలు ఇక్కడి కార్యక్రమాలకు హాజరయ్యే ప్రేక్షకులకు విందుచేయనున్నాయి. ఈ సారి అనేకమంది ఔత్సాహిక కళాకారులు సైతం తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించడం విశేషం. ఈ ఉత్సవాలకు ప్రత్యేకంగా హాజరౌతున్నవారిలో ఐక్యరాజ్య సమితి 8వ సెక్రటరీ జనరల్ బాన్-కి-మూన్, భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్, అమెరికాలోని ప్రముఖ వైద్యుడు వివేక్ మూర్తి, అమెరికా సెనేటర్ రిక్ స్కాట్, నాన్సి పెలోసి, భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, సురినామ్ దేశ రక్షణ మంత్రి కృష్ణకుమారి మాథెరా ఉన్నారు. -
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ ఆత్మహత్య
సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. అమెరికన్ హిప్హాప్ డ్యాన్స్, కొరియోగ్రాఫర్, నటుడు డీజే స్టీఫెన్ ఆత్మహత్య చేసుకున్నాడు. లాస్ ఏంజిల్స్‌లోని ఓ హాటల్లో ఆయన గన్‌తో షూట్ చేసుకున్ని ఆత్మహత్య పాల్పడినట్లు అక్కడి మీడియా పేర్కొంది. దీంతో హాలీవుడ్ నటీనటులు సోషల్ మీడియా వేదికగా స్టీఫెన్ మృతికి సంతాపం తెలుపుతున్నారు. చదవండి: అనన్య ఫ్యాన్‌గర్ల్ మూమెంట్.. ‘ఆయన నాకు చేయి ఊపారు’ కాగా ది ఎలెన్ డిజనరేస్ షో, సో యూ థింక్ యూ కెన్ డాన్స్’ వంటి రియాలిటీ షోలతో స్టీఫెన్ పాపులర్ అయ్యాడు. స్టెప్ అప్, మ్యాజిక్ మైక్ డబుల్ ఎక్స్ సినిమాల్లో కూడా ఆయన నటించాడు. అలాగే టెలివిజన్ ప్రొడ్యూర్గా కూడా స్టీఫెన్ గుర్తింపు పొందాడు. కాగా స్టీఫెన్‌కి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Ellen DeGeneres (@theellenshow) -
హిప్హాప్
హిప్హాప్ డ్యాన్స్ సిటీవాసులను ఉర్రూతలూగించింది. బ్రేకింగ్, లాకింగ్ తదితర స్టెప్పులతో మాదాపూర్ శిల్పకళావేదిక హోరెత్తింది. ప్రకృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో యూకేకు చెందిన అవంతి గ్రేడ్ కంపెనీ సభ్యులు ‘ద బ్లాక్ ఆల్బమ్’ పేరుతో బుధవారం నిర్వహించిన హిప్హాప్ డ్యాన్స్ దుమ్మురేగింది. స్ట్రీట్ డ్యాన్స్‌కు దగ్గరగా ఉండే ఈ స్టెప్పులు... నగరవాసులకు మరింత జోష్‌నిచ్చాయి. ఈలలు వేయించి... గోల చేయించాయి. సాక్షి, సిటీప్లస్