breaking news
helping spirit
-
శభాష్ అంజలి.. మంచి పని చేశావ్!
కట్నం డబ్బును మంచి పనికి వినియోగించి శభాష్ అనిపించుకుంది ఓ పెళ్లికూతురు. పెద్ద మొత్తంలో నగదును సమాజ సేవకు అందించి ఆదర్శంగా నిలిచింది. ఈ విషయం తెలిసిన వారందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసింది? రాజస్థాన్‌లోని బార్మర్ నగరానికి చెందిన కిషోర్ సింగ్ కనోడ్ కుమార్తె అంజలి కన్వర్ నవంబర్ 21న ప్రవీణ్ సింగ్‌ను వివాహం చేసుకుంది. తనకు కట్నంగా ఇవ్వాలనుకున్న 75 లక్షల రూపాయలను బాలికల హాస్టల్ నిర్మాణానికి వినియోగించాలని పెళ్లికి ముందే తండ్రితో చెప్పింది. కుమార్తె కోరినట్టుగానే ఈ మొత్తాన్ని బాలికల హాస్టల్ నిర్మాణానికి విరాళంగా ఇచ్చేశాడు కిషోర్ సింగ్. (చదవండి: ‘సార్ వీడు నా పెన్సిల్ తీసుకున్నాడు.. కేసు పెట్టండి’) ఈ విషయాన్ని లేఖ ద్వారా పెళ్లికి వచ్చిన అతిథులకు తెలియజేయగా కరతాళ ధ్వనులతో వారందరూ స్వాగతించారు. అంజలి తండ్రి పెళ్లి పందిట్లోనే ఖాళీ చెక్కును కూతురికి అందించి.. ఆమె అభీష్టాన్ని నెరవేర్చారు. బాలికల విద్య కోసం కట్నం సొమ్మును త్యాగం చేసిన అంజలి మంచి మనసును అక్కడున్నవారంతా మెచ్చుకున్నారు. 68వ జాతీయ రహదారికి సమీపంలోని నిర్మితమవుతున్న బాలికల వసతి గృహానికి కిషోర్ సింగ్ ఇప్పటికే కోటి రూపాయాలు ప్రకటించారు. అయితే నిర్మాణం పూర్తికావడానికి 50 నుంచి 75 లక్షలు అదనంగా ఖర్చు చేయాల్సి రావడంతో అంజలి ఈ నిర్ణయం తీసుకుంది. (చదవండి: నీలగిరి ‘తోడాలు’.. పాండిచ్చేరి చాపనేత.. ఎన్నెన్నో విశేషాలు!) #positivenews #barmer #girleducation pic.twitter.com/UPl9BqXKfE — Tribhuwan Singh Rathore 🇮🇳 (@FortBarmer) November 24, 2021 దీనికి సంబంధించిన కథనాన్ని ‘దైనిక్ భాస్కర్’ పత్రిక ప్రచురించింది. ఈ వార్తా కథనం క్లిప్పింగ్‌ను త్రిభువన్ సింగ్ రాథోడ్ అనే వ్యక్తి ట్విటర్లో షేర్ చేశారు. దీంతో అంజలి కన్వర్‌పై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్ఫూర్తిదాయకంగా నిలిచావంటూ పొగడుతున్నారు. (చదవండి: అనుపమ అలుపెరగని పోరాటం.. ఎట్టకేలకు చెంతకు చేరిన బిడ్డ!!) -
సేవాస్ఫూర్తి
కృష్ణాపుష్కరాల్లో ఐదొందల మంది వలంటీర్ల ఉచితసేవలు కల్కీభగవాన్, రెడ్‌క్రాస్, ఎన్ఎస్ఎస్, ఎన్ఆర్ యువసేన సేవకులు ఎదుటివారు సాయం అడిగితే చాలు.. క్షణాల్లో ముందుంటారు! రంగాపూర్ ఘాట్ నుంచి ‘సాక్షి’ బృందం: పుష్కర ఘాట్ల మెట్లు ఎక్కి దిగలేని వృద్ధులు పుణ్యస్నానాలు కోసం వారిని వెంట తీసుకొస్తారు.. దాహం వేసిందని అడిగితే చాలు క్షణాల్లో గ్లాసు నీళ్లను ఇట్టే తీసుకొచ్చి ఇస్తారు.. వాహనాలను ఎక్కవ పార్కింగ్ చేయాలో చెబుతారు.. ఆకలిగా ఉందని అడిగితే చాలు అన్నదాన ప్రాంగణం ఎక్కడుందో చూపిస్తారు.. సుస్తీ చేసిందని చెబితే చాలు వైద్యచికిత్సలు అందజేసే వైద్యకేంద్రంలో ఎక్కడుందో దారిచూపిస్తారు. నీళ్లలో మునిగిపోకుండా జాగ్రత్తలు చెబుతారు. దైవదర్శనానికి ఎలా వెళ్లాలో సూచిస్తారు.. వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన వలంటీర్లు భక్తి నిరతితో కృష్ణాపుష్కరాలకు వస్తున్న భక్తులకు విశేషసేవలు అందిస్తున్నారు. కేవలం రంగాపూర్ ఘాట్ వద్దే కేవలం 500మంది స్వచ్ఛంద సేవకులు తమ ఉచితసేవలు అందిస్తున్నారు. వారిలో కల్కీభగవాన్, రెడ్‌క్రాస్, ఎన్ఎస్ఎస్, ఎన్ఆర్ యువసేన సంస్థలకు చెందిన భక్తులు ఉన్నారు. వారి సేవలో వలంటీర్లు తరిస్తున్నారు. భక్తులకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడంతో పాటు ప్రకతి కాపాడడం, వైద్యసేవలకు తీసుకెళ్లడం, తిరిగి వారి ఇళ్లకు క్షేమంగా పంపించేందుకు పుష్కర సేవకులు శ్రమిస్తున్నారు. సేవే మా అభిమతం మేమంతా కల్కీభగవాన్ సేవామార్గంలో నడుస్తాం. పుష్కర భక్తులకు సేవలందించేందుకు పాలమూరు జిల్లాకు 500 మంది వలంటీర్లు వచ్చారు. రంగాపూర్ ఘాట్ వద్ద 150మంది సేవలు అందిస్తున్నారు. సేవలతో మాకు సంతృప్తి లభిస్తోంది. అన్ని రకాల సేవలందిస్తున్నాం. ముఖ్యంగా నదీనీరు కలుషితం కాకుండా పర్యవేక్షిస్తున్నాం. – బి.రమా, కల్కీభగవాన్ వలంటీర్, ఆదిలాబాద్ భక్తుల సేవలో.. దూరప్రాంతాల నుంచి పుష్కర స్నానాల కోసం వచ్చిన భక్తులకు సేవలందించేందుకు ఐదురోజులుగా ఇక్కడే ఉంటున్నాం. ఘాట్ ప్రత్యేకాధికారుల సూచన మేరకు భక్తులకు కావాల్సిన సేవలందిస్తున్నాం. పుష్కరాలు పూర్తయ్యేవరకు సేవలందిస్తాం. – చెన్నయ్య, ఎన్ఎస్ఎస్ వలంటీర్, మహబూబ్‌నగర్ ఐదు నిమిషాల్లో ముందుంటాం.. సహాయం.. అని అడిగి ఐదు నిమిషాల్లో సేవలు అందించేందుకు ముందుకొస్తాం. రెడ్‌క్రాస్ సొసైటీ తరఫున పుష్కరాల ప్రారంభం నుంచి 150 మంది వలంటీర్లతో కలిసి భక్తులకు సేవలు అందిస్తున్నాం. ఉదయం 6 నుంచీ రాత్రి 9 గంటల వరకు పుష్కర సేవలోనే ఉన్నాం.. – పోచ రవిందర్‌రెడ్డి, రెడ్‌క్రాస్ కార్యదర్శి, వనపర్తి