breaking news
Help to AP
-
ప్రవాసాంధ్రుల్లారా ఆపత్కాలంలో ఏపీకి అండగా నిలవండి
సాక్షి, అమరావతి: ప్రస్తుతం కరోనా కష్టకాలంలో ప్రవాసాంధ్రులు ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలవాలని ఏపీ స్పెషల్ రిప్రజంటేటివ్ రత్నాకర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి సాధ్యమైనంత సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం సహాయ నిధికి చేసే సహాయంతో ఏపీలో మరిన్ని మెరుగైన వసతులు ఏర్పాటు చేసుకోవచ్చు అని గుర్తుచేశౠరు. మరింత వేగంగా ఎక్కువ మందికి వాక్సినేషన్ ఇవ్వొచ్చు అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. మీరు చేసే సహాయం మరిన్ని ఆస్పత్రులకు ఆక్సిజన్, వెంటిలేటర్, ఎక్మో సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావచ్చు అని రత్నాకర్ చెప్పారు. ప్రవాసాంధ్రులు ముందుకు వస్తే ఏపీలో ఆరోగ్య సౌకర్యాల కల్పన వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి శక్తికి మించి ప్రజలకు కరోనా నుంచి సేవలు చేస్తున్నారని గుర్తుచేశారు. మనం బాధ్యతగా ఏపీవాసులకు అండగా నిలుద్దామని ప్రవాసాంధ్రులకు ఏపీ స్పెషల్ రిప్రజంటేటివ్ రత్నాకర్ చెప్పారు. చదవండి: రాబోయే 3, 4 వారాలు చాలా కీలకం.. మరింత జాగ్రత్త చదవండి: లాక్డౌన్ పెట్టాలా లేదా అన్నది సీఎం నిర్ణయం -
ఏపికి సాయం చేస్తాం:ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: హుదూద్ పెను తుపాను దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన సహాయం అందిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ప్రధాని అధ్యక్షతన తుపానుపై అత్యున్నత స్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు. కేబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్, హొంశాఖ, రక్షణ శాఖ కార్యదర్శులు, వాతావరణ శాఖ సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్ ఏపి, ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. తుపాను పరిస్థితిని తెలుసుకుంటున్నారు. **