breaking news
heineken beer
-
కోక్ బాటిల్ వ్యవహారంతో కోట్లు హాంఫట్, మరి ఈ బీర్ బాటిల్ సంగతేంటి?
మ్యూనిచ్: స్టార్ ఫుట్‌బాల్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా ప్రజలకు హాని కలిగించే పానీయాలపై బహిరంగంగానే తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. యూరో 2020లో భాగంగా రెండు రోజుల కిందట జరిగిన ప్రెస్ మీట్లో పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో తన ముందున్న కోకాకోలా బాటిల్‌ను తీసి పక్కన పెట్టిన విషయం తెలిసిందే. కోలా వద్దు, నీళ్లే ముద్దు అన్న అతని సందేశం కోకాకోలా కంపెనీకి సుమారు రూ.30 వేల కోట్ల నష్టం తెచ్చిపెట్టిందని వార్తలు వచ్చాయి. తాజాగా ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ పాల్ పోగ్బా కూడా రొనాల్డో రూట్లోనే వెళ్లాడు. నిన్న జర్మనీతో మ్యాచ్ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌కు వచ్చిన పోగ్బా.. తన ముందు ఉన్న హైనెకెన్ కంపెనీకి చెందిన బీర్ బాటిల్‌ను తీసి కింద పెట్టాడు. మరి పోగ్బా చేసిన ఈ పని వల్ల సదరు బీర్ కంపెనీకి ఎంత నష్టం వాటిల్లబోతుందో లెక్కకట్టే పనిలో పడ్డారు మార్కెట్ నిపుణులు. After #POR captain Cristiano Ronaldo and his Coca Cola removal, #FRA’s Paul Pogba makes sure there’s no Heineken on display 🍺 #EURO2020 pic.twitter.com/U9Bf5evJcl — Sacha Pisani (@Sachk0) June 16, 2021 కాగా, ఇస్లాం మతాన్ని ఆచరించే పోగ్బాకు ఆల్కహాల్ సేవించే అలవాటు లేదు. ఈ విషయాన్ని అతను చాలాసార్లు బహిరంగా ప్రస్తావించాడు. తాజాగా జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆల్కహాల్ ఉత్పత్తి అయిన బీర్ బాటిల్‌ను పక్కకు పెట్టడం ద్వారా మందుపై తనకున్న వ్యతిరేకతను మరోసారి ప్రత్యక్షంగా బహిర్గతం చేశాడు. పోగ్బాలా ఇస్లాంను ఆచరించే మరికొందరు క్రీడాకారులు సైతం మద్యం ఉత్పత్తుల ప్రమోషన్‌కు దూరంగా ఉంటారు. ఇంగ్లీష్ క్రికెటర్లు మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, దక్షిణాఫ్రికా మాజీలు హాషిమ్ ఆమ్లా, ఇమ్రాన్ తాహిర్‌లు మద్యం కంపెనీల పేర్లను తమ దుస్తులపై ధరించేందుకు సైతం ఇష్టపడరు. హైనెకెన్ బేవరేజ్ కంపెనీ ప్రస్తుతం జరుగుతున్న యూరో 2020కి ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. చదవండి: రొనాల్డో చర్య.. కోకా కోలాకు భారీ డ్యామేజ్.. మరి ఆ యాడ్! -
ఆల్కహాల్ లేకుండానే బీరు!
వేసవి తాపాన్ని తట్టుకునేందుకు బీరు లాంటి చల్లటి పానీయాలు తాగాలనుకునేవారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువే ఉంటారు. అందులోని ఆల్కహాలుకు అలవాటు పడితే ఆరోగ్యం పాడవుతుందని ఆందోళన పడేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. అలాంటివారి కోసమే ఒక్కశాతం కూడా ఆల్కహాల్ లేని బీరును నెదర్లాండ్స్‌కు చెందిన డచ్ కంపెనీ హైనెకెన్ మార్కెట్లోకి విడుదల చేసింది. హైనెకెన్ 0.0 పేరుతో ఈ బీరును ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల్లో విడుదల చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఆల్కహాలు అసలు లేని లేదా అతి తక్కువ ఉండే బీర్లను తయారు చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. 2010 నుంచి ఇలాంటి బీర్లను తయారు చేస్తున్న కంపెనీలు చాలానే ఉన్నాయి. అయితే ఆ కంపెనీలన్నీ కేవలం తమ స్వదేశానికి మాత్రమే పరిమితం కాగా, డచ్ కంపెనీ మాత్రం అంతర్జాతీయ మార్కెట్‌పై దృష్టి పెట్టింది. ఈ ఆల్కహాలు లేని బీర్ల మార్కెట్ 2010 నుంచి ఇప్పటివరకు ఏటా ఐదు శాతం చొప్పున పెరుగుతూ వస్తోందని కంపెనీ వర్గాలు తెలిపాయి.