ఆ రేపిస్ట్ చాలా మంచిదట!
డే కేర్ వర్కర్ గా చేస్తున్న ఓ మహిళ చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన ఘటన చాలా ఆలస్యంగా వెలుగుచూసింది. అమెరికాలోని ఓహియోలో హిదర్ కూన్ అనే యువతి మూడేళ్ల కిందట ఈ నేరాలు చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణకు వచ్చింది. ఆమెకు జీవితఖైదు విధిస్తూ స్థానిక కోర్టులో తీర్పు వెలువడింది. తాత్కాలిక బెయిల్ పై ఇంకెప్పుడూ విడుదల అవకుండా కొన్ని షరతులు కూడా విధించింది. పిల్లల పట్ల ఎంతో దయ, జాలి చూపించాల్సిన యువతి ఈ చర్యలకు పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టించింది.
ఆ వివరాలిలా ఉన్నాయి.. బాయ్ ఫ్రెండ్ కోరిక మేరకు 27 ఏళ్ల హిదర్ కూన్ ఓ రేపిస్ట్ గా మారింది. అభంశుభం తెలియని బాలురపై లైంగిక దాడులు చేసింది. 2013 ఏప్రిల్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆమె మాత్రమే కాదు బాయ్ ఫ్రెండ్ జేమ్స్ ఒస్బార్న్ కూడా లైంగి దాడులకు పాల్పడుతుంటాడు. పలు కేసులలో ఈ ప్రేమజంటపై ఎఫ్ఐఆర్ నమోదైంది. తాను నలుగురు బాలురపై లైంగిక దాడులకు పాల్పడింది. బాయ్ ఫ్రెండ్ కోరిక మేరకు ఈ తతంగాన్ని వీడియో తీసుకుంది. ఇప్పుడు ఆ వీడియోనే ఈ కేసులో ప్రధాన సాక్ష్యంగా మారింది. ఇప్పటివరకూ 40 కేసులలో హిదర్ కూన్, 81 కేసులలో జేమ్స్ నిందితులుగా ఉన్నారు.
వీడియోల రూపంలో సాక్షాలు కళ్ల ముందు ఉన్నా, తన క్లయింట్ చాలా మంచి వ్యక్తి అని, ప్రియుడి కోసం ఇలా తప్పిదం చేసిందంటూ ఆమె తరఫు న్యాయవాది హిదర్ ను వెనకేసుకు రావడం స్థానికంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బాయ్ ఫ్రెండ్ కోసం చేసిన తప్పిదాలు ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకున్నాయి. ఆమెకు జీవితఖైదు విధిస్తూ స్థానిక కోర్టులో తీర్పు వెలువడింది. తాత్కాలిక బెయిల్ పై ఇంకెప్పుడూ విడుదల అవకుండా కొన్ని షరతులు కూడా విధించింది.