breaking news
healthy environment
-
పరిసరాలను పట్టించుకుంటున్నారా?
చాలామంది ఇంటిని, ఒంటిని శుభ్రంగా ఉంచుకుంటారు కానీ మన చుట్టూ ఎలా ఉంటే ఏమవుతుందిలే అన్నట్లు ఉంటారు. అయితే ఇల్లు, ఇంటిలోని మనుషులు మాత్రమే శుభ్రంగా ఉండి పరిసరాలన్నీ అపరిశుభ్రంగా ఉంటే ఏం ప్రయోజనం? అనారోగ్యం, అంటువ్యాధులు పోంచే ఉంటాయి. ఇంతకీ పరిసరాల పరిశుభ్రత అంటే ఏమిటో, పరిసరాలను ఏవిధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలో చూద్దామా?ఇంట్లో మురికిగా ఉండే ప్రదేశాలను శుభ్రం చేయడం ఎంత ముఖ్యమో, చుట్టుపక్కల ఉండే హానికారక సూక్ష్మజీవులను నిరోధించడంపై దృష్టిపెట్టడం కూడా అంతేముఖ్యం. చేతులు కడుక్కోవడం, బట్టలు ఉతకడం, ఫ్లోర్‌ని తుడవటం ఆరోగ్యవంతమైన వాతావరణానికి కీలకం. ఒక సర్వే మేరకు అపరిశుభ్రమైన పరిసరాలలో మెసలడం వల్ల్ల పిల్లలు ప్రమాదకరమైన అంటురోగాల బారిన పడతారని తెలిసింది. అందువల్ల ఆయా ప్రదేశాలను శుభ్రం చేయడంపై దృష్టి పెట్టాలని, అవి శుభ్రంగా కనిపించినప్పటికీ తగిన శ్రద్ధ పెట్టి ఎలాంటి క్రిములూ లేకుండా చూడాలని, అప్పుడే హానికారక సూక్ష్మ క్రిముల వ్యాప్తిని అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.బ్యాక్టీరియా ఎలాపోతుంది?ఆహారాన్ని తయారు చేసిన తర్వాత నేలను,రాతి దిమ్మెలను శుభ్రం చేయడానికి క్లాత్‌కు బదులు పేపర్ టవల్స్ వాడి చూడండి. ఇలా చేయడం వల్ల వంటగదిలో ఉపయోగించే గుడ్డలు అపరిశుభ్రం కాకుండా, కలుషితం కాకుండా ఉంటాయి.ఎలా శుభ్రం చేయాలి? పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అంటే మురికితో΄ాటు రోగకారక క్రిములను అరికట్టడం. తద్వారా అంటువ్యాధులు సోకకుండా చూసుకోవడం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అంటురోగాల వ్యాప్తిని తగ్గించొచ్చు. తద్వారా మన పిల్లల్ని రక్షించుకోవడంతో పాటు, ఆసుపత్రులపై ఒత్తిడిని కూడా తగ్గించొచ్చు. ఇంటిని మాత్రమే కాదు, ఇంటి పరిసరాలలో ఎక్కడైనా మురికిగుంటలు, చెత్తకుప్పలు, అపరిశుభ్ర వాతావరణం ఉంటే దానిపై దృష్టి పెట్టాలి. శ్రమ అనో, ఖర్చనో అనుకోకుండా చెత్తను క్లీన్ చేయాలి లేదా చేయించాలి. కొంతమంది తమ ఇంటిలోని చెత్తనంతటినీ తీసుకొచ్చి ఖాళీగా ఉన్న ప్రదేశాలలో పడేస్తుంటారు. క్రమేణా అవి చెత్తకు, ఆ తర్వాత అపరిశుభ్రతకు, అంటువ్యాధులకు నిలయాలుగా మారతాయి. అందువల్ల చొరవ తీసుకుని క్లీన్ చేయించాలి. అలాగే మురికిగుంటలపై కూడా దృష్టి సారించాలి. పరిసరాలలో నీరు నిలవకుండా చూసుకోవాలి. ఇంటిలోని చెత్తను, తడిచెత్త, పోడిచెత్తగా వేరు చేసి పడెయ్యడం, గాజుపెంకుల వంటి వాటిని విడిగానూ వేరు చేసి పడెయ్యాలి. ఇలాంటి వాటన్నింటినీ బాధ్యతగా చేసినప్పుడే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే సూక్ష్మక్రిములు, తద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము.ఏయే పరిసరాలు?⇒వంటశాలలు, భోజన శాలలు ∙మరుగుదొడ్లు, ⇒ఇల్లు, వంటగదిలో ఉండే మురికి బట్టలు, మసిగుడ్డలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ⇒పెంపుడు జంతువులతో ఉన్నప్పుడు ⇒చెత్త, వ్యర్థాలను చేత్తో తాకినప్పుడు, పారేసేటప్పుడు ⇒అంటువ్యాధి సోకిన వారికి సపర్యలు చేసేప్పుడు శుభ్రత ΄ాటించడం అత్యవసరం ⇒మాంసం వంటి వంటకాలు చేసినప్పుడు వంటగదిలోని నేలను, దిమ్మల్ని, మాంసం కోసిన చెక్క/బోర్డుల్ని శుభ్రం చేయడం చాలా కీలకం. అలాగే, కలుషితమైన ప్రదేశాన్ని, పాత్రల్ని శుభ్రం చేశాక ఆయా గుడ్డలు, స్క్రబ్‌లను, బ్రష్‌లను కడగాలి ⇒ఇంట్లో నేలపైన, కుర్చీలు, బల్లల వంటి ఫర్నీచర్పైన చాలా దుమ్ము పట్టినట్లు ఉంటుంది. వాటిని కూడా శుభ్రం చేయాలి. -
మా అబ్బాయి దురలవాట్లను మాన్పించడం ఎలా?
మా అబ్బాయి చెన్నైలో మంచి పేరున్న కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అయితే చెడుసావాసాలకు అలవాటుపడి, కానబీస్ అనే మత్తుపదార్థాన్ని సేవిస్తున్నాడని తెలిసి, కాలేజీ మాన్పించి ఇంటికి తీసుకొచ్చేశాం. చిన్నప్పటినుంచి కూడా ఆటలాడుకుంటూ, కులాసాగా గడిపేద్దామనే తప్ప చదువు ధ్యాస బొత్తిగా లేదు. ఎలాగో ఇంజినీరింగ్ వరకు నెట్టుకొచ్చాం. వాడికి మంచి లక్ష్యాలు ఉన్నాయి కానీ, వాటిని నెరవేర్చుకునేందుకు ప్రయత్నించడు. మాకు వాడితో ఎలా వేగాలో అర్థం కావడం లేదు. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - ఒక తల్లి, హైదరాబాద్. మీ సమస్యను నేను అర్థం చేసుకోగలను. అయితే దేనినైనా మొగ్గగా ఉన్నప్పుడే తుంచేయాలి. లేదంటే పెద్దయ్యాక ఇలాగే తయారవుతారు. అందుకే పిల్లలకు చిన్నప్పటినుంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగేలా చూడటం ముఖ్యం. కొందరు పిల్లలు చిన్నప్పటినుంచి ఒకవిధమైన ధోరణిలో ఉంటారు. తల్లిదండ్రుల గారాబం వల్ల, పుష్కలంగా డబ్బుండటం వల్ల, జల్సాకు అలవాటుపడి, చదువును నిర్లక్ష్యం చేస్తారు. క్లాసులో టీచర్లు చెప్పేది వినరు, నోట్సు రాసుకోరు. క్లాసులే కాదు, పరీక్షలు కూడా ఎగ్గొడుతుంటారు. డబ్బుండటం వల్ల రకరకాల స్వభావాలుండే స్నేహితులు వీరి వెనకాల తిరుగుతుంటారు. పిల్లలు ఇలా ఉన్నప్పుడే పెద్దలు దానిని ఖండించి, నయానో, భయానో నచ్చజెప్పి వారిని గాడిలో పడేలా చేయాలి. లేదంటే పెద్దయినా వారిలో ఇదే ధోరణి కొనసాగుతుంది. సాధారణంగా ఇటువంటి పిల్లలు క్షణికమైన ఆనందాన్నిచ్చే మత్తుపదార్థాలు, మద్యపాన ం, ధూమపానం తదితర దురలవాట్లకు అలవాటుపడి, వాటికి తొందరగా బానిసలుగా మారతారు. ఫలితంగా సంఘవిద్రోహశక్తులుగా కూడా మారతారు. మీ అబ్బాయి ఇంజినీరింగ్ చదువుతుంటే మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టారంటున్నారు. అలా ఖాళీగా ఉంటే మరింతగా చెడిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. అతన్ని తనకిష్టమైన మరో మార్గం వైపు మళ్లించేందుకు ప్రయత్నించండి. అంటే స్పోర్ట్స్, గేమ్స్ లాంటి వాటివైపన్నమాట. మీరు, మిగిలిన కుటుంబ సభ్యులందరూ అతన్ని బాగా చూసుకోండి, ప్రేమగా మెలగండి. తాను చేస్తున్నది తప్పని తనే తెలుసుకునేలా చేయండి. సైకోథెరపీ, కౌన్సెలింగ్ వంటి వాటిద్వారా అతని మనసును మంచి మార్గంవైపు మళ్లేలా చూడండి. అంతేకానీ, హిప్నాటిజం వంటి వాటివల్ల అద్భుతం జరిగి, అతను అనూహ్యంగా మారతాడని మాత్రం ఆశించకండి. మీ అబ్బాయిని తీసుకుని మంచి సైకాలజిస్టును కలవండి. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్ సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్