breaking news
hastina
-
హస్తినకు చేరుకున్న సీఎం చంద్రబాబు
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి/గన్నవరం: ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం రాత్రి 8 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు పలువురు ఎంపీలు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా అశోకా రోడ్డులోని ఆయన నివాసానికి వెళ్లారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే బస చేయనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయం, పెండింగ్ ప్రాజెక్టుల విషయం, పోలవరం, రాజధాని అమరావతి అంశాలపై ప్రధాని, కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. గురువారం ఉదయం ప్రధానితో భేటీ అవ్వనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి మనోహర్ లాల్ఖట్టర్లను కలవనున్నారు. శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా, రాష్ట్రంలో ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలకు చంద్రబాబు విందు ఇచ్చారు. అనంతరం శుక్రవారం రాత్రి లేదా శనివారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వెళ్లనున్నట్లు తెలిసింది.34 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్!నిత్యం నీతులు, సుద్దులు చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. కొంచెం దూరం ప్రయాణించడానికి కూడా హెలికాప్టర్ వినియోగించడం చర్చనీయాంశమైంది. బుధవారం ఆయన కేవలం 34 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించకుండా, హెలికాప్టర్‌ను వాడారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లేందుకు బుధవారం సాయంత్రం వెలగపూడి సచివాలయం నుండి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకునేందుకు ఆయన ఆకాశమార్గాన్ని ఎంచుకున్నారు. హడావుడి, ఆడంబరాలకు దూరంగా ఉన్నట్లు రోజూ మీడియా సమావేశాలు, సమీక్షల్లో చెబుతున్న ఆయన కొద్దిపాటి దూరానికి హెలికాప్టర్ వినియోగించడం గమనార్హం. సాధారణంగా కొద్దిపాటి దూరం ప్రయాణాలకు ముఖ్యమంత్రి అయినా, గవర్నర్ అయినా రోడ్డు మార్గాన్నే ఉపయోగిస్తారు. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప హెలికాప్టర్ వాడరు. కానీ ఇప్పుడు 34 కిలోమీటర్లు వెళ్లేందుకు హెలికాప్టర్ వాడడం ద్వారా తాను చెప్పే సూక్తులన్నీ మాటలకే పరిమితమని చంద్రబాబు రుజువు చేసుకున్నారు. -
సెల్వం పాత్రలో బాలయ్య
-
బెయిల్ నిరాకరణ
-
సెల్వం పాత్రలో బాలయ్య
బావా బావా.. ‘పన్నీర్’ ♦ ఆధారాలు బయటపడితే చంద్రబాబు ఔట్.. సీఎంగా బాలకృష్ణకు చాన్స్ ♦ ఓటుకు నోటు వ్యవహారం నేపథ్యంలో టీడీపీలో చర్చ ♦ బాబు కుటుంబసభ్యులు, సన్నిహితుల మంతనాలు ♦ వీర విధేయుడి ఎంపికపై తర్జనభర్జనలు.. ♦ లోకేశ్‌కు అనుభవ లేమి.. పైగా ప్రస్తుత కేసులో చినబాబు ప్రస్తావన ♦ కోడెల పేరూ తెరపైకి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యేకు డబ్బు ఎర చూపిన ఉదంతం తెలుగుదేశం పార్టీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో రేవంత్‌రెడ్డితో పాటు సూత్రధారిగా ఏపీ సీఎం చంద్రబాబుపై బలమైన ఆధారాలు ఉన్నాయని తెలుస్తున్న నేపథ్యంలో.. తదనంతర రాజకీయ పరిణామాలపై టీడీపీలో అంతర్గత సమాలోచనలు వేగవంతమయ్యాయి.బాబు సీఎంగా తప్పుకోవలసివస్తే ఏం చేద్దామన్న విషయమై ఆయన కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులైన పార్టీ నేతల మధ్య అనేక కోణాల్లో సమాలోచనలు జరుగుతున్నాయి. బాబు రాజీనామా అనివార్యమైతే ఆయన ఈ కేసు నుంచి బయటపడే వరకు ఆ స్థానంలో కూర్చోబెట్టదగిన వీరవిధేయుడు ఎవరన్నదానిపై చర్చ సాగుతోంది. ఈ కేసు నుంచి బాబు బయట పడటానికి అవకాశాలున్నాయా? ఏసీబీ తదుపరి విచారణ కోణాలు ఎలా ఉండబోతున్నాయి? ఇంతవరకు ఎలాంటి ఆధారాలు సేకరించారు? వంటి వాటిపై సమాలోచనలు సాగిస్తూనే అనూహ్య పరిణామాలు తలెత్తితే అనుసరించాల్సిన వ్యూహంపైనా మల్లగుల్లాలు పడుతున్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు... అనుకోని పరిణామాలు సంభవిస్తే తప్ప ఈ కేసు నుంచి బాబు బయటపడే ఆస్కారం, అవకాశాలు లేవని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో తమిళనాడులో పన్నీరు సెల్వం మాదిరిగా ఇక్కడ వీరవిధేయుడెవరన్న చర్చ మొదలైంది. తాను రాజీనామా చేయాల్సి వస్తే కుమారుడు లోకేశ్‌ను ఆ పదవిలో కూర్చోబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు.ప్రస్తుత కేసులో చినబాబు పేరూ ప్రస్తావనకు వస్తుండటం, రాజకీయ అనుభవం సైతం లేకపోవడంతో ఇంకెవరు? అన్న ప్రశ్న ఉదయిస్తోంది. దీంతో బాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే ఎన్.బాలకృష్ణ పేరు బలంగా వినిపిస్తోంది. ఆయనకూ రాజకీయ అనుభవం లేకపోవడం ప్రతికూలంగా మారుతుందన్న చర్చా సాగుతోంది. దీంతో పార్టీలో సీనియర్లు, ఇతర విధేయుల పేర్లూ చర్చకొచ్చాయి. ప్రధానంగా ప్రస్తుత శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్ని రకాలుగా సమర్థులని చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన గురువు సూచించినట్టు తెలుస్తోంది. పైగా బాలకృష్ణకు కూడా కోడెల అత్యంత సన్నిహితుడు. చిన్నచిన్న అభిప్రాయ భేదాలున్నప్పటికీ మొదటినుంచి పార్టీకి సేవలు అందించడం, ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొనగలగడం, మంత్రిగా, స్పీకర్‌గా,అనుభవం కలిగిన నేతగా ఆయన పేరు ముందు వరుసలో చేరింది. ఇందుకు చంద్రబాబు అంగీకరిస్తారా లేదా అన్న మీమాంస ఉంది. మరోవైపు యనమల రామకృష్ణుడు లాంటి ఇతర సీనియర్లు కూడా అంగీకరించకపోవచ్చన్న అభిప్రాయమూ ఉంది. డిప్యూటీ సీఎంలు నిమ్మకాయల చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తితో పాటు మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి.నారాయణల పేర్లు చర్చల్లో వస్తున్నప్పటికీ వీరి విషయంలో ఏకాభిప్రాయం ఉండదన్న వాదనలున్నాయి. తమిళనాడు తరహాలో చూస్తే చినరాజప్ప పేరును, ఇటీవలి కాలంలో చాలా విషయాల్లో.. ప్రధానంగా ఏపీ కొత్త రాజధాని వ్యవహారాల్లో అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిస్తున్న నారాయణ పేరును చంద్రబాబు సూచించే అవకాశాలుంటాయి. ఈ పరిణామాలపై చంద్రబాబు కుటుంబసభ్యులతో సన్నిహితంగా ఉన్నవారు మాత్రమే రహస్య సమాలోచనలు చేస్తున్నారు. మెజారిటీ మంత్రులు బాలకృష్ణ పేరును మాత్రమే సూచిస్తారని, బాబు సైతం ఆయన పేరును సూచించే వచ్చని జూనియర్ మంత్రులు చెబుతున్నారు. ఇక బుధవారం బాలకృష్ణ జన్మదినం కావడంతో మంత్రులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏసీబీ నోటీసిస్తే ఒత్తిడి పెరుగుతుంది వాస్తవానికి మంగళవారం (9 వతేదీ) చైనా ప్రతినిధి బృందంతో సమావేశంలో పాల్గొనడానికి మాత్రమే చ ంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. నామినేటెడ్ ఎమ్మెల్యేతో టెలిఫోన్లో మాట్లాడిన సంభాషణల ఆడియో టేపులు బయటకు రావడంతో ఉలిక్కిపడిన చంద్రబాబు తన పర్యటనను పొడిగించుకున్నారు. బుధవారం ఉదయం రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో మొదలుపెట్టి వరుసగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి తదితరులను కలిశారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలంతా బాబు ఢిల్లీ పర్యటనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని సీనియర్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఈ కేసు విషయమై విచారణకు హాజరుకావాలని ఏసీబీ బాబుకు నోటీసు ఇస్తే ఆయన రాజీనామా చేయాలన్న ఒత్తిడి పెరుగుతుంది. అంతవరకు వెళ్లదనుకుంటున్నాం. అదే జరిగితే బాబు కేసు నుంచి బయటపడేవరకు మరో నేతను ఎంపిక చేసుకుంటాం’ అని ఆ మంత్రి అన్నారు. సచివాలయంలో మంత్రులతో బాలయ్య భేటీ చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆయన వియ్యంకుడు బాలకృష్ణ బుధవారం సచివాలయానికి రావడం చర్చనీయాంశంగా మారింది. ఉదయం తన నివాసంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న బాలకృష్ణ సచివాలయానికి వచ్చిన సందర్భంగా పలువురు మంత్రు లు, ఎమ్మెల్యేలతో సమావేశం కావడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. మంత్రి పరిటాల సునీత చాంబర్లో ఆయన కేక్‌ను కట్ చేశారు. వేడుకల్లో పాల్గొన్న మంత్రులు, టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలకు మిఠాయిలు పంపిణీ చేశారు. మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, రావెల కిషోర్‌బాబు, అచ్చెన్నాయుడు, టీడీపీ సీనియర్ నేతపయ్యావుల కేశవ్, ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి తదితరులతో రహస్యంగా మంతనాలు సాగించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నీతి నిజాయితీలకు టీడీపీ మారు పేరని చెప్పారు. టీడీపీని అస్థిరపరిచేందుకుకుట్ర సాగుతోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనైతికమన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలపై చర్చించేందుకే మంత్రులు, టీడీపీ నేతలతో సమావేశమయ్యానని చెప్పారు.రేవంత్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేయడంపై స్పందించడానికి బాలకృష్ణ నిరాకరించారు. సమావేశానికి మీడియాను అనుమతించకపోవడాన్ని మంత్రులు అచ్చెన్నాయుడు, పల్లె రఘునాథరెడ్డి, రావెల దృష్టికి విలేకరులు తీసుకెళ్లగా..సమావేశానికి ప్రాధాన్యత లేదని కొట్టిపారేశారు. కేవలం బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పామన్నారు. -
హస్తినలో బాబు, సచివాలయంలో బాలయ్య
-
హస్తినలో బాబు, సచివాలయంలో బాలయ్య
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తినలో పర్యటిస్తుంటే.. మరోవైపు ఆయన బావమరిది, హిందుపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ బుధవారం సచివాలయానికి వచ్చారు. పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఛాంబర్‌కు ఆయన వెళ్లారు. అక్కడ అనంతపురం జిల్లా టీడీపీ నేతలతో పాటు, పలువురు మంత్రులతో బాలకృష్ణ సమావేశం అయ్యారు. బాలకృష్ణ తొలిసారి సచివాలయానికి రావటం రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకే భేటీ అయినట్లు మంత్రులు చెప్పటం గమనార్హం. తమ సమావేశానికి ఎలాంటి ప్రాధాన్యత లేదని టీడీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. అయితే ఈ భేటీకి మీడియాను కూడా అనుమతించలేదు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ నీతి నిజాయితీలకు మారుపేరు తెలుగు దేశం పార్టీ అని, ఇదంతా రాజకీయ కుతంత్రం అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయటం పద్ధతి కాదని, దాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనే తాము సమావేశమై చర్చలు జరిపినట్లు బాలకృష్ణ తెలిపారు. కాగా ఓటుకు నోటు వ్యవహారంలో పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విషయంలో స్పందించేందుకు ఆయన నిరాకరించారు. ఈ సమావేశంలో మంత్రులు రావెల కిషోర్ బాబు, పల్లె రఘునాథరెడ్డి, కింజెరపు అచ్చెన్నాయుడు, టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.