breaking news
group 1 officers
-
తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌ను ఏర్పాటు చేయండి
సాక్షి, హైదరాబాద్: అన్ని శాఖల అనుభవజ్ఞులైన అధికారులతో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టీఏఎస్) ఏర్పాటు చేయాలని తెలంగాణ గ్రూప్–1 అధికారుల సంఘం కోరింది. అన్ని శాఖల్లో పదోన్నతులు వచ్చేలా చర్యలు తీసుకున్నందుకు సోమవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను తెలంగాణ గ్రూప్–1 అధికారుల సంఘం అధ్యక్షులు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి హన్మంత్‌నాయక్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లుగా గ్రూప్ 1 అధికారులతో పాటు స్థానిక సంస్థలశాఖలైన పంచాయత్ రాజ్, మున్సిపల్‌శాఖల అధికారులను నియమించాలని, నాన్ రెవెన్యూ కోటాలో ఖాళీగా ఉన్న ఐదు ఐఏఎస్ పోస్ట్‌లను భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, టీఏఎస్ నేతలు అరవిందరెడ్డి, హరికిషన్, అంజన్ రావ్, శశిధరా చారి, నాగరాజు, రమేష్, పద్మజా రాణి, ప్రశాంతి, రజనీకాంత్‌రెడ్డి ,అమర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
విభజన ప్రక్రియను వేగవంతం చేయండి
కమల్‌నాథన్‌కు గ్రూప్-1 ఉద్యోగుల వినతి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రా ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తే అది సంపూర్ణ తెలంగాణ కాదని, తెలంగాణ స్ఫూర్తికి విరుద్ధంగా ఉద్యోగుల విభజన ఉందని గ్రూప్-1 ఉద్యోగుల సంఘం ప్రతినిధులు అరవింద్‌రెడ్డి, శశిధరాచారి, శరత్చంద్ర, సుధాకర్‌రెడ్డి అన్నారు. కమల్నాథన్ను కలసిన అనంతరం వారు బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. త్వరితగతిన ఉద్యోగ విభజన ప్రక్రియను చేపట్టాలని కమల్నాథన్ను కోరినట్లు వెల్లడించారు.