breaking news
Granyuls India
-
గ్రాన్యూల్స్ మధ్యంతర డివిడెండు 25 శాతం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2018–19 ఆర్థిక సంవత్సరానికి రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై 25 శాతం మూడవ మధ్యంతర డివిడెండు చెల్లించాలని గ్రాన్యూల్స్ బోర్డు నిర్ణయించింది. డిసెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 71 శాతం అధికమై రూ.60 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.411 కోట్ల నుంచి రూ.637 కోట్లకు చేరింది. ఏప్రిల్–డిసెంబరులో రూ.1,690 కోట్ల టర్నోవరుపై రూ.172 కోట్ల నికరలాభం పొందింది. బీఎస్ఈలో మంగళవారం కంపెనీ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 0.73 శాతం తగ్గి రూ.88.40 వద్ద స్థిరపడింది. -
ప్రభుత్వ సబ్సిడీలపై ఆధారపడొద్దు
రియల్టీ డెవలపర్లకు జైట్లీ సూచన ముంబై: రియల్ ఎస్టేట్ డెవలపర్లు ప్రభుత్వ సబ్సిడీలపై ఆధారపడరాదని, మార్కెట్ ఎకానమీలో నిలదొక్కుకోవడం నేర్చుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. రియల్టీ రంగంలో మందగమనం ఇక ముగిసినట్లేనని, ఇకనుంచి కార్యకలాపాలు మరింతగా పుంజుకుంటాయని చెప్పారు. పరిశ్రమ సమస్యల నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం తన వంతు తోడ్పాటు అందిస్తుందని క్రెడాయ్-బ్యాంకాన్ సదస్సులో హామీ ఇచ్చారు. దేశం వేగంగా వృద్ధిచెందేందుకు రియల్టీ చోదకమన్నారు. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంటుందని, వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలోనే ఉండగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రాన్యూల్స్ లాభంలో 40 శాతం వృద్ధి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గ్రాన్యూల్స్ ఇండియా ద్వితీయ త్రైమాసిక నికర లాభంలో 40 శాతం వృద్ధి నమోదై రూ. 31 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో ఆదాయం 19 శాతం వృద్ధితో రూ. 308 కోట్ల నుంచి రూ. 366 కోట్లకు చేరింది. రూపాయి ముఖ విలువ కలిగిన షేరుకు 15 పైసల మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. దివీస్ లాభం 29% అప్ హైదరాబాద్ బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఫార్మా సంస్థ దివీస్ ల్యాబ్స్ నికర లాభం(స్టాండెలోన్ ప్రాతిపదికన) 29% పెరిగి రూ. 296 కోట్లుగా నమోదైంది. క్రితం క్యూ2లో నికర లాభం రూ. 230 కోట్లు. రెండో త్రైమాసికంలో ఆదాయం రూ.833 కోట్ల నుంచి రూ.964 కోట్లకు పెరిగినట్లు సంస్థ వెల్లడించింది. పవర్‌గ్రిడ్ చేతికి వేమగిరి-2 ప్రాజెక్టు న్యూఢిల్లీ: వేమగిరి-2 విద్యుత్ సరఫరా వ్యవస్థ ఏర్పాటు ప్రాజెక్టును బిడ్డింగ్‌లో దక్కించుకున్నట్లు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తెలిపింది. దీని కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల గుండా విద్యుత్ పంపిణీ లైన్లు వేయనున్నట్లు, వేమగిరి 2 ట్రాన్స్‌మిషన్‌గా ఈ ప్రాజెక్టును వ్యవహరించనున్నట్లు సంస్థ పేర్కొంది.