స్నాప్‌డీల్ ద్వారా ‘గొకీ’ ఫిట్నెస్ సర్వీస్‌లు
న్యూఢిల్లీ: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్, స్నాప్‌డీల్ అమెరికాకు చెందిన ఫిట్నెస్ సంస్థ గొకీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా గొకీ ఫిట్‌నెట్ బాండ్, సర్వీసులను భారత వినియోగదారులకు అందిస్తామని స్నాప్‌డీల్ పేర్కొంది. గొకీ సబ్స్క్రిప్షన్ కోసం వినియోగదారులు స్నాప్‌డీల్‌డాట్‌కామ్ ద్వారా నేరుగా ఆర్డర్ చేయవచ్చని వివరించింది.
ఆరు నెలల ప్లాన్ రూ.5,999 అని, 12 నెలల ప్లాన్ రూ.9,999 అని వివరించింది. గొకీ బాండ్, పర్సనల్ కోచ్ సర్వీస్, గొకీ యాప్ తదితర సేవలు పొందవచ్చని తెలిపింది. అడ్వాన్స్డ్ ఫిట్నెస్ ట్రాకర్‌గా గొకీ బాండ్ పనిచేస్తుందని పేర్కొంది. వినియోగదారుడి డేటాను బట్టి కస్టమైజ్డ్ సలహాలవివ్వడమే కాకుండా సాధించదలచుకున్న లక్ష్యాన్ని చేరువ అయ్యేలా ప్రేరణనిచ్చేలా గొకీ పర్సనల్ కోచ్ సర్వీస్ పనిచేస్తుందని పేర్కొంది.