breaking news
Garima Jain
-
పబ్‌లో మొబైల్ పోగొట్టుకున్న నటి.. పోలీసులకు ఫిర్యాదు
ఈ మధ్యకాలంలో లేట్‌నైట్ పార్టీలు, పబ్ కల్చర్ మితిమీరుతోంది. ఇక వీకెండ్ వచ్చిందంటే చాలు ఫ్రెండ్స్‌తో చిల్ అవ్వాల్సిందే అనేలా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు లేట్‌నైట్ పార్టీల్లో చిందేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి, సింగర్ గరిమా జైన్‌కు ముంబైలోని పబ్‌లో ఊహించని షాక్ తగిలింది. వివరాల ప్రకారం ఏప్రిల్2న వీకెండ్ పార్టీ కోసం ముంబై ఎయిర్‌పోర్ట్‌కు దగ్గర్లో ఉన్న పబ్‌కు వెళ్లిన గరిమా పార్టీలో బాగా ఎంజాయ్ చేసింది. తెల్లవారుజామున 3.15నిమిషాలకు అక్కడి నుంచి తిరిగి వచ్చే క్రమంలో తన ఫోన్ పోగొట్టుకున్న విషయాన్ని గుర్తించింది. వెంటనే పబ్ నిర్వాహకులకు, పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరిగి పబ్‌కి వెళ్లి ఎంత దొరికినా తన ఫోన్ కనిపించలేదంటూ వాపోయింది. ఆ ఫోన్ ధర సుమారు లక్ష రూపాయల దాకా ఉంటుందని పేర్కొంది. గరిమా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా గరిమా ఇటీవలే రాణి ముఖర్జీ లీడ్ రోల్లో నటించిన మర్దాని 2 సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. -
వెబ్ తెర మీద వెలిగిపోతున్న తార.. గరిమా జైన్
తొలి చిత్రంతోనే స్టార్స్‌గా మారినవాళ్లెందరో.. సినిమాలతో గుర్తింపు రాకపోయినా వెబ్ తెర మీద వెలిగిపోతున్న తారలూ అందరే! రెండో కోవలోకి చెందిన నటే గరిమా జైన్. ఆమె పరిచయమే ఇది.. ►గరిమా జైన్ జన్మస్థలం మధ్యప్రదేశ్. ►పీఐఎమ్ఆర్ యూనివర్సిటీలో డిగ్రీ పట్టా పొందిన వెంటనే నేరుగా మోడలింగ్ వైపు నడిచింది. ►ముంబైలోని ఓ యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుంది. ►ఒకవైపు మోడలింగ్ చేస్తూ ఆడిషన్స్ అటెండ్ అయ్యేది. సుమారు రెండు సంవత్సరాల ప్రయత్న ఫలితంగా 2015లో ఓ టీవీ సీరియల్లో.. చిన్న పాత్రలో నటించే అవకాశం దొరికింది. ►దురదృష్టవశాత్తు ఆ బుల్లిపాత్ర ఎడిటింగ్‌కు బలి అయింది. ►మొదటి అవకాశంలో కనబర్చిన తన నటన ప్రేక్షకుల కంటికి కనిపించలేకపోయినా, దర్శకుల దృష్టిలో పడింది. ►ఒకేసారి ‘శక్తి’, ‘ఈ– లవ్’ సీరియల్స్‌లో నటించడంతో పాటు ‘మర్దానీ –2’ సినిమాలో చాన్స్ కూడా కొట్టేసింది. ‘మర్దానీ –2’ సినిమా మంచి విజయం సాధించింది. ►2020లో ‘గందీ బాత్ 4’తో వెబ్ దునియాలోకి అడుగు పెట్టి, ‘ఎక్స్ఎక్స్ఎక్స్–2’, ‘ట్విస్టెడ్–3’ సిరీస్‌లతో అలరించింది. ►ఆమె తెలుగులో నటించిన ‘చిత్రం చెప్పిన కథ’ త్వరలోనే విడుదల కానుంది. నా కష్టమే నన్ను బ్యాక్ టు బ్యాక్ సిరీస్, సినిమాలతో బిజీగా ఉంచింది. ఎప్పటికైనా కష్టపడేవారికే ఫలితం దక్కాలి, దక్కుతుంది. – గరిమా జైన్.