వెబ్‌ తెర మీద వెలిగిపోతున్న తార.. గరిమా జైన్‌ | Interesting Facts About Garima Jain | Sakshi
Sakshi News home page

వెబ్‌ తెర మీద వెలిగిపోతున్న తార.. గరిమా జైన్‌

Dec 19 2021 12:22 PM | Updated on Dec 19 2021 1:00 PM

Interesting Facts About Garima Jain - Sakshi

తొలి చిత్రంతోనే స్టార్స్‌గా మారినవాళ్లెందరో.. సినిమాలతో గుర్తింపు రాకపోయినా వెబ్‌ తెర మీద వెలిగిపోతున్న తారలూ అందరే!  రెండో కోవలోకి చెందిన నటే గరిమా జైన్‌. ఆమె పరిచయమే ఇది..

గరిమా జైన్‌ జన్మస్థలం మధ్యప్రదేశ్‌. 

పీఐఎమ్‌ఆర్‌ యూనివర్సిటీలో డిగ్రీ పట్టా పొందిన వెంటనే నేరుగా  మోడలింగ్‌ వైపు నడిచింది. 

ముంబైలోని ఓ యాక్టింగ్‌ స్కూల్లో శిక్షణ తీసుకుంది. 

ఒకవైపు మోడలింగ్‌ చేస్తూ ఆడిషన్స్‌ అటెండ్‌ అయ్యేది. సుమారు రెండు సంవత్సరాల ప్రయత్న ఫలితంగా 2015లో ఓ టీవీ సీరియల్లో.. చిన్న పాత్రలో నటించే అవకాశం దొరికింది. 

దురదృష్టవశాత్తు ఆ బుల్లిపాత్ర ఎడిటింగ్‌కు బలి అయింది. 

మొదటి అవకాశంలో కనబర్చిన తన నటన ప్రేక్షకుల కంటికి కనిపించలేకపోయినా, దర్శకుల దృష్టిలో పడింది. 

ఒకేసారి ‘శక్తి’, ‘ఈ– లవ్‌’ సీరియల్స్‌లో నటించడంతో పాటు ‘మర్దానీ –2’ సినిమాలో చాన్స్‌ కూడా కొట్టేసింది. ‘మర్దానీ –2’ సినిమా మంచి విజయం సాధించింది. 

2020లో ‘గందీ బాత్‌ 4’తో వెబ్‌ దునియాలోకి అడుగు పెట్టి, ‘ఎక్స్‌ఎక్స్‌ఎక్స్‌–2’, ‘ట్విస్టెడ్‌–3’ సిరీస్‌లతో అలరించింది. 

ఆమె తెలుగులో నటించిన ‘చిత్రం చెప్పిన కథ’  త్వరలోనే విడుదల కానుంది. 

నా కష్టమే నన్ను బ్యాక్‌ టు బ్యాక్‌ సిరీస్, సినిమాలతో బిజీగా ఉంచింది. ఎప్పటికైనా కష్టపడేవారికే ఫలితం దక్కాలి, దక్కుతుంది.  – గరిమా జైన్‌.   

Advertisement
 
Advertisement
Advertisement