breaking news
ganeshan
-
భర్తను చంపి.. లొంగిపోయిన భార్య..
సాక్శి, చిత్తూరు : జిల్లాలోని శాంతిపురం మండల కేంద్రంలో వ్యాపారి హత్య సంఘటన సంచలనం సృశ్టిస్తోంది. తన భర్తను తానే చంపానంటూ భార్య పోలీసుల ఎదుట లొంగిపోవడంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. శాంతిపురంలో శివాజీ గణేశన్ అనే వ్యాపారి గత ఆరు సంవత్సరాలుగా కిరాణా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మాధవి అనే మహిళతో ఆయనకు వివాహం అయింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యాపారంలో ఒడిదుడుకులు, ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా సాగుతోంది. ఈ క్రమంలో శనివారం గణేశన్‌ను తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో దారుణంగా హత్య చేశారు. వ్యాపార పనుల్లో ఎప్పుడు బిజీగా ఉండే గణేశన్ హఠాత్తుగా హత్యకు గురి కావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గణేశన్-మాధవి దంపతుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్థానికులు చెబుతున్నారు. అయితే, మాధవి ఉదయం కుప్పం పొలీస్ స్టేశన్‌కి వెళ్ళి లొంగిపోవడం వెనక వారి మధ్య ఏదో గొడవ ఉందనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. శివాజీ గణేశన్ శరీరంపై పలు కత్తిపోట్లు ఉండటాన్ని గుర్తించిన పోలీసులు భార్యే ఈ హత్య చేసి ఉంటుందా? అనే కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. ఇప్పటికే చిత్తూరు నుంచి క్లూస్ టీం సంఘటనాస్థలంలో అన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. పోలీసులు కూడా తమ శైలిలో విచారణను ఆరంభించారు. అయితే మృతుడు శివాజీ గణేశన్కి అతని కుటుంబం మధ్య తగాదాలు ఉన్నాయని ఈ తగాదాల కారణంగానే వేరేవరైనా హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ కోణంలో శివాజీ గణేశన్ సోదరుడైన పండరినీ అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కూలంకషంగా విచారణ జరిగితే తప్ప పండరికి, గణేశన్ హత్యకు ఉన్న లింకు ఏమిటనేది బయటపడదు. -
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా..
సాక్షి, చెన్నై: సెల్ఫీ మోజుతో యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు దిగటానికి ఏమాత్రం వెనుకకాడటం లేదు. తాజాగా తమిళనాడులోని సేలం సమీపాన ఆదివారం కొండపై సెల్ఫీ తీసుకుంటూ లోయలో జారిపడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సేలంలోని కిచ్చిపాళయం అప్పర్ వీధికి చెందిన గణేశన్(25) ప్రైవేటు సంస్థలో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో గణేశన్ తన స్నేహితులు రాజ్‌కుమార్ (21), అభిషేక్ (25), జగన్ (21)లతో ఊత్తుమలై కొండపై ఉన్న మురుగన్ ఆలయానికి వెళ్లాడు. అక్కడ దర్శనం ముగించుకుని కొండపై నుంచి సేలం నగరపు అందాలను తిలకించారు. అనంతరం ఒకరి తర్వాత మరొకరు సెల్‌ఫోన్‌తో ఫోటోలు తీసుకున్నారు. తర్వాత సమీపాన ఉన్న ఒక బండపై గణేశన్ నిలుచుని సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ కాలు జారి 50 అడుగుల లోయలో జారిపడ్డాడు. దీంతో తలపై తీవ్రగాయం తగిలి గణేశన్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.