పెయింటింగ్ పోటీల్లో సత్తాచాటిన ‘గజేంద్ర’
అనంతపురం ఎడ్యుకేషన్ : జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన పెయింటింగ్ పోటీల్లో మడకశిర మండలం ఆమిదాలగొంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థి గజేంద్ర సత్తా చాటాడు. ఈ విద్యార్థి గీసిన ఆర్ట్ జిల్లాస్థాయిలో ప్రథమస్థానంలో నిలవడమే కాకుండా రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానాన్ని పొందింది. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 25న ఢిల్లీలో జరిగే వేడుకల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా గజేంద్ర అవార్డు అందుకోనున్నాడు.