breaking news
Friendly matches
-
సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్!
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్‌కు ముందు టీమిండియా స్టార్ సంజూ శాంసన్ (Sanju Samson) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మెరుపు హాఫ్ సెంచరీతో రాణించి.. సెలక్టర్లకు తానూ రేసులో ఉన్నానంటూ బ్యాట్ ద్వారానే సందేశం ఇచ్చాడు. కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఆసియా కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం దృష్ట్యా తటస్థ వేదికైన యూఏఈలో మ్యాచ్‌లు జరుగనున్నాయి.సెలక్టర్లకు సవాల్అయితే, ఈ మెగా ఈవెంట్‌కు ఎంపిక చేసే భారత జట్టుకు సంజూ శాంసన్‌ను ఎంపిక చేస్తారా? లేదంటే.. ఓపెనర్ యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్లను పిలిపించి.. ఈ కేరళ బ్యాటర్‌పై వేటు వేస్తారా? అన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి సందేహాల నడుమ సంజూ శాంసన్ తనదైన శైలిలో సెలక్టర్లకు సవాల్ విసిరాడు.ప్రెసిడెంట్స్ ఎలెవన్ vs సెక్రటరీ ఎలెవన్కాగా కేరళ క్రికెట్ లీగ్ సీజన్-2 సెప్టెంబరులో ప్రారంభం కానుంది. అయితే, ఈ టోర్నీకి ముందు గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ ఎలెవన్- కేరళ క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ ఎలెవన్ మధ్య శుక్రవారం ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది.గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగిన ఈ మ్యాచ్‌లో సంజూ సెక్రటరీ ఎలెవన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇక ఈ పోరులో సచిన్ బేబీ కెప్టెన్సీలోని ప్రెసిడెంట్ ఎలెవన్ తొలుత బ్యాటింగ్ చేసింది.రోహన్ కన్నుమ్మల్ (29 బంతుల్లో 60), అభిజిత్ ప్రవీణ్ (18 బంతుల్లో 47) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడగా.. ప్రెసిడెంట్ ఎలెవన్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.విష్ణు విధ్వంసం.. సంజూ మెరుపు హాఫ్ సెంచరీఇక లక్ష్య ఛేదనలో విష్ణు వినోద్ విధ్వంసకర ఇన్నింగ్స్ (29 బంతుల్లో 69)తో విరుచుకుపడగా.. సంజూ శాంసన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. 36 బంతుల్లో 54 పరుగులతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ అలరించాడు. ఈ క్రమంలో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే సెక్రటరీ ఎలెవన్ లక్ష్యాన్ని ఛేదించి జయభేరి మోగించింది.ఆసియా కప్-2025 టోర్నీకి భారత జట్టు ప్రకటనకు సమయం ఆసన్నమైన వేళ సంజూ ఈ మేరకు బ్యాట్‌తో రాణించడం పట్ల అతడి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా సెప్టెంబరు 9- 28 మధ్య యూఏఈ వేదికగా ఆసియా కప్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే.అత్యధికంగా మూడు శతకాలుకాగా సంజూ అంతర్జాతీయ టీ20లలో ఇప్పటికే మూడు శతకాలు బాదాడు. తద్వారా రోహిత్ శర్మ (5), సూర్యకుమార్ యాదవ్ (4) తర్వాత టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో మొత్తంగా 152కు పైగా స్ట్రైక్‌రేటుతో 861 పరుగులు సాధించాడు.చదవండి: ENG vs SA: వన్డే, టీ20లకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. ఆ సిరీస్‌కు కెప్టెన్‌గా జేకబ్ -
కేరళకు రానున్న మెస్సీ బృందం
తిరువనంతపురం: అంతా అనుకున్నట్లు జరిగితే... భారత క్రీడాభిమానులు, కేరళ ఫుట్‌బాల్ ప్రేమికులు ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా జట్టు ఆటగాళ్ల విన్యాసాలు ప్రత్యక్షంగా చూస్తారు. రెండు అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడేందుకు... స్టార్ స్ట్రయికర్ లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు వచ్చే ఏడాది కేరళకు రానుందని ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అబ్దుల్ రహమాన్ బుధవారం ప్రకటించారు. ఈ మ్యాచ్‌లను కేరళ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందని... వేదికతో పాటు, ప్రత్యర్థి జట్లు ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతానికైతే ఖతర్, జపాన్ జట్లను ఆహ్వానించాలనే ఆలోచన ఉందని ఆయన వివరించారు. ‘ఫుట్‌బాల్ స్టార్ మెస్సీతో కూడిన ప్రపంచ నంబర్‌వన్ ఫుట్‌బాల్ జట్టు అర్జెంటీనా వచ్చే ఏడాది కేరళకు రానుంది. ఆ జట్టు ఇక్కడ రెండు మ్యాచ్‌లు ఆడనుంది. దీనిపై అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘంతో కలిసి త్వరలోనే సంయుక్త ప్రకటన విడుదల చేస్తాం’ అని రహమాన్ పేర్కొన్నారు. ఇటీవల స్పెయిన్ పర్యటన సందర్భంగా అర్జెంటీనా జాతీయ జట్టును ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. దీనికి ఆ జట్టు నుంచి సానుకూల స్పందన వచ్చిందని... త్వరలోనే దీనిపై మరింత స్పష్టత వస్తుందని అన్నారు. మ్యాచ్‌కు సంబంధించిన ఏర్పాట్లు, భద్రత తదితర అంశాలను ప్రభుత్వమే పర్యవేక్షిస్తుందని మంత్రి చెప్పారు. అయితే తమ షెడ్యూల్ ప్రకారం అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘమే భారత పర్యటనకు సంబంధించిన తేదీలను వెల్లడించనుందని పేర్కొన్నారు. అర్జెంటీనా ఆడనున్న మ్యాచ్‌ను ప్రత్యక్షంగా 50 వేల మంది అభిమానులు చూసేలా ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌ను నిర్వహించే శక్తి సామర్థ్యాలు కేరళ ప్రభుత్వానికి ఉన్నాయని రహమాన్ పేర్కొన్నారు. రెండు మ్యాచ్‌ల నిర్వహణకు రూ. 100 కోట్లు ఖర్చు అవుతుందని, ఈ మొత్తాన్ని స్పాన్సర్ల ద్వారా సమకూరుస్తామని ఆయన తెలిపారు. -
జాతీయస్థాయి క్రికెట్ స్టేడియాలు సిద్ధం
త్రిలోచనాపురం (ఇబ్రహీంపట్నం) : నవ్యాంధ్ర రాజధాని విజయవాడలో క్రీడాభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. ఇబ్రహీంపట్నంలోని త్రిలోచనాపురంలో రెండు జాతీయస్థాయి క్రికెట్ స్టేడియాలు దాదాపు సిద్ధమయ్యాయి. కృష్ణానదికి అవతల వైపున రాజధాని నిర్మాణం జరగనుండగా, నదికి ఇవతల వైపున విజయవాడ నగరానికి అతిసమీపంలో ఈ క్రికెట్ స్టేడియాలు నిర్మిస్తున్నారు. మే రెండు నుంచి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లు మే రెండో తేదీ నుంచి ఇక్కడ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 13 ఎకరాల్లో నిర్మాణం జరుపుకొంటున్న క్రికెట్ స్టేడియాల్లో ఒక గ్రౌండ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. రెండో స్టేడియంలో పిచ్‌ల నిర్మాణం జరిగింది. పే ్లగ్రౌండ్లో పచ్చదనాన్ని నింపాల్సి ఉంది. పిచ్‌ల ఏర్పాటుకు వివిధ ప్రాంతాల నుంచి బ్లాక్, రెడ్సాయిల్ను తీసుకువచ్చారు. క్రికెటర్లకు అందుబాటులో ఉండేందుకు ఒక్కో గ్రౌండ్లో ఏడు పిచ్‌లు ఏర్పాటు చేశారు. సకల సౌకర్యాలు ఇక్కడ రంజీ మ్యాచ్‌లతో పాటు జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించేందుకు మార్గం సులువైంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కార్పొరేషన్‌కు చెందినది కావడంతో పోటీల నిర్వహణకు అనేక ఇబ్బందులు తలెత్తేవి. ఇప్పుడు అసోసియేషన్ సొంత స్టేడియాల్లో క్రికెట్ పోటీల నిర్వహణతో పాటు జాతీయస్థాయి క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ ఇక్కడ ఇవ్వనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ జిల్లా సహాయ కార్యదర్శి కె. మురలేశ్వరరావు తెలిపారు. జాతీయస్థాయి క్రీడాకారుల శిక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏసీ రూమ్‌లు, కిచెన్, డైనింగ్ హాల్, ఎంపైర్ రూమ్స్, స్విమ్మింగ్‌ఫూల్, జిమ్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మాణమైన ఈ స్టేడియాలు కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్‌కు అప్పగించనున్నామని ఆయన తెలిపారు.