breaking news
fish Mafia
-
'సాక్షి' ఎఫెక్ట్ చేపల మాఫియాపై ఎంక్వైరి
-
మారుమూల గ్రామాల్లో అక్రమంగా చేపల పెంపకం
-
నో పోలీస్.. నో చట్టం.. పెదరాయుళ్ల తీర్పులు!
కైకలూరు : కొల్లేరు లంక గ్రామాల్లో చట్టాలకు సమాంతరంగా పెద్దలు తీర్పులు కొనసాగుతున్నాయి. చిన్న చిన్న సమస్యలను గ్రామస్థాయిలో పరిష్కరించుకోవడానికి పూర్వం పెద్దలు నడుం బిగించేవారు. దీంతో బాధితులకు న్యాయం జరిగేది. నేడు ఆ పరిస్థితి లేదు. కొల్లేరు కట్టుబాట్ల నడుమ ఓటు బ్యాంకు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. లంక గ్రామాల్లో మాట వినకపోతే మూకుమ్మడి వేధింపులు ఎక్కువవుతున్నాయి. కొల్లేరు అభయారణ్య పరిధిలోని 120 జీవోకు మట్టిపాతర వేస్తూ అక్రమ చేపల చెరువులను యథేచ్ఛగా కొనసాగిస్తున్న పెద్దలను ఇదేంటని ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతున్నారు. ఇటీవల కొల్లేరు గ్రామాల్లో జరిగిన సంఘటనలు పె ద్దల పెత్తనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. మండవల్లి మండలం పులపర్రు గ్రామానికి చెందిన మోరు ఆశామణి అదే గ్రామానికి చెందిన మల్లేపూడి క్రాంతి ప్రేమించుకున్నారు. ఇద్దరూ మేజర్లు. కులాలు వేరు కావడంతో గత నెల 29న చర్చి వివాహం చేసుకున్నారు. ఈ నెల 7న వారు మండవల్లి పోలీసులను కలిసి రక్షణ కల్పించాలని కోరారు. ఈ నెల 11న గ్రామంలోని కొల్లేరు పెద్దలు పంచాయతీ పెట్టారు. ఇంతలో మహిళలు పెద్దసంఖ్యలో వచ్చి సదరు యువతిని ఈడ్చూకుంటు వెళ్ళిపోయారు. అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులను నిర్బంధించారు. దీంతో ఆ యువకుడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. యువతి అచూకీ ఇప్పటివరకు తెలియలేదు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను కొల్లేరు పెద్దల సమక్షంలో ఇటీవల కొందరు చితకబాదారు. సదరు వ్యక్తుల వాహనాలను దేవాలయం వద్దకు పంపకపోవడమే పోలీసులు చేసిన నేరం. ఈ ఘటనపై ప్రజాప్రతినిధులు కొమ్ముకాయడంతో పోలీసులే ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. కొల్లేరు అభయారణ్య పరిధిలోని అక్రమ చేపల చెరువుల్లో చేప పిల్లలను వదలడానికి ఓ పడవపై కొల్లేరు పెద్దల సమక్షంలో చేప పిల్లల డాబ్బాలను తీసుకువస్తున్నారు. దీనిని అడ్డుకునేందుకు ఓ అటవీశాఖ క్షేత్రస్థాయి ఉద్యోగి పడవలో ఎక్కాడు. కొంత దూరం వచ్చిన అతన్ని కొట్టి కొల్లేటిలోకి తోసేశారు. చేప పిల్లల వదలడాన్ని అడ్డుకోడానికి వచ్చిన అటవీ అధికారులను నిర్బంధించారు. అటవీ సిబ్బంది పోలీసుస్టేషన్లో కేసు పెట్టాడు. పెద్దల జోక్యంతో కేసు నీరుగారింది. కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంకు భక్తులు చేరడానికి పందిరిపల్లిగూడెం వద్ద వంతెన ఉంది. నిబంధనలు విరుద్ధంగా టోల్‌గేటు వసూలు చేస్తున్నారు. ఈ విషయంలో సదరు పాటదారునికి ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులకు గొడవ జరిగింది. దీనిపై పాటదారుడి ఫిర్యాదుతో పోలీసు కేసు నమోదైంది. పెద్దలు రంగ ప్రవేశం చేసి ఎదురు కేసు పెట్టారు. దీంతో ఆ కేసు నీరుగారింది గోకర్ణపురానికి చెం దిన ఓ మూడేళ్ల బాలికపై ఓ కామాం ధుడు లైంగికదాడి చేసి చంపేశాడు. మొదట్లో ఈ ఘాతకం వెలుగుచూడలేదు. సరైన శిక్ష పడకపోవడంతో అదే వ్యక్తి మరో మహిళపై అఘయిత్యానికి పాల్పడ్డాడు. అదే విధంగా పంచికలమర్రు గ్రామంలో పెద్దల మాట కాదన్నందుకు ఓ కుటుం బాన్ని గతంతో రామాలయంలో బంధించారు. మీడియా సంఘటనను వెలుగులోకి తీసుకురావడంతో కుటుంబాన్ని విడిచిపెట్టారు. ప్రేక్షక పాత్రలో పోలీసులు కొల్లేరు పెద్దలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటుంటే పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు. కొల్లేటికోటలో పోలీసులపై దాడి చేసిన వారికి సరైన శిక్ష పడలేదని సిబ్బందికి ఇప్పటికి మధనపడుతున్నారు. అటవీశాఖ అధికారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొల్లేరు పెద్దల మాట కాదంటే మరోసటి రోజు బదిలీలకు రంగం సిద్ధం చేసేస్తున్నారు. -
బరితెగించిన ‘చేపల’ మాఫియా!
అధికారుల సంతకాలు ఫోర్జరీ ఆలస్యంగా వెలుగు చూసిన వైనం ఇరిగేషన్‌శాఖ ఉద్యోగి హస్తం విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ గుడివాడ, న్యూస్‌లైన్ : గుడివాడ డివిజన్లో చేపల చెరువుల మాఫియా తన సామ్రాజ్యాన్ని విస్తరింజేసుకునేందుకు ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసిన ఘటనఆలస్యంగా వెలుగు చూసింది. చేపల చెరువుల అనుమతుల ఫైళ్లలో తమ సంతకాలు ఫోర్జరీ చేశారని గమనించిన అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే విషయాన్ని జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ ఎస్ఈలకు తెలియజేశారు. ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న ఓ చిరుద్యోగి సాయంతో ఈ వ్యవహారం నడిపించారని అనుమానిస్తున్నారు. ఆ ఉద్యోగి నెలరోజులుగా సెలవులో ఉండడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈఏడాది గుడివాడ డివిజన్లోని గుడివాడ, నందివాడ, కైకలూరు. మండవల్లి, కలిదిండి మండలాల్లో పెద్ద ఎత్తున చేపల చెరువుల తవ్వకాలు మొదలుపెట్టారు. అయితే నందివాడ మండలంలోని వివిధ గ్రామాల్లో 20 మంది రైతులు 400 ఎకరాల్లో చేపల చెరువుల తవ్వకానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేశారు. పోలుకొండ డ్రైనేజీ సెక్షన్ పరిధిలో రైతులు చేసిన దరఖాస్తులపై డ్రైనేజీ శాఖ జేఈ కవిత, ఆ శాఖ డీఈ హరనాధ్ బాబు సంతకాలు ఫోర్జరీ చేసి జిల్లా స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న కలెక్టర్‌కు పంపారు. అయితే చేపల చెరువుల అనుమతుల విషయంలో తాము క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సి ఉందని, డ్రైనేజీ గట్లు ఆనుకుని ఉన్న చెరువుల అనుమతులపై పరిశీలించాల్సి ఉందని డ్రైనేజీ శాఖ ఈఈ వాసంతి కలెక్టర్‌కు నివేదిక పంపారు. దీంతో సంబంధిత ఫైళ్లన్నీంటిని కలెక్టర్ రఘునందన్‌రావు వెనక్కి పంపారు. దీనిపై విచారణకు జేసీని నియమించారు. దీంతో గతనెల మూడో వారంలో జిల్లా జేసీ గుడివాడకు వచ్చి ఇరిగేషన్ డ్రైనేజీ శాఖలతోపాటు, రెవెన్యూశాఖ అధికారులను పిలిపించి మాట్లాడారు. ఫైళ్లను చూపించారు. పోలుకొండ సెక్షన్ పరిధిలో ఉన్న ఫైళ్లను చూసిన డ్రైనేజీ శాఖ డీఈ హరనాధ్‌బాబు, జేఈ కవిత ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ సంతకాలు తమవి కావని తేల్చారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్‌కు, ఇరిగేషన్‌శాఖ ఎస్ఈకి వీరిద్దరూ వివరణ ఇచ్చారు. ఫిర్యాదు అందుకున్న కలెక్టర్ దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని విచారణకు ఆదేశించినట్లు సమాచారం. డ్రైనేజీ డీఈ హరనాద్బాబును, డ్రైనేజీ శాఖ పోలుకొండ సెక్షన్ జేఈ కవితను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఈవిషయమై తాము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామనిచెప్పారు. తమ సంతకాలు ఫోర్జరీ అయిన విషయం వాస్తవమేనన్నారు. ఉన్నతాధికారులు విచారణలో నిజానిజాలు వెలుగులోకొస్తాయని తెలిపారు. రెవెన్యూశాఖ తప్పిదాలే ఫోర్జరీలకు దారి తీసిందా?... చేపల చెరువుల అనుమతుల విషయంలో రెవెన్యూశాఖది కీలక బాధ్యత. చెరువుల అనుమతులకు 8శాఖల అధికారులతో సమావేశమై సంతకాలు తీసుకోవాల్సి ఉంది. అలా కాకుండా చేపల చెరువుల యజమానులకు నేరుగా ఫైళ్లు ఇచ్చి ఎవరికి వారే ఆయా శాఖల అధికారుల వద్దకు వెళ్లి సంతకాలు పెట్టించుకురమ్మని పంపుతున్నారు. ఫలితంగా ఈఫోర్జరీ వ్యవహారానికి తెరలేసినట్లు తేలింది. పరారీలో ఇరిగేషన్‌శాఖ ఉగ్యోగి? ఇరిగేషన్‌శాఖ గుడివాడ డివిజన్ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి ఫోర్జరీ వ్యవహారానికి సాయపడ్డాడని తెలుస్తోంది. పోలుకొండ సెక్షన్ జేఈ ప్రొహిబిషన్‌లో ఉండటంతో ఆమె నిజాయితీగా వ్యవహరిస్తారని తెలిసిన చేపల చెరువుల యజమానులు ఇరిగేషన్ శాఖఉగ్యోగిని ప్రోత్సహించి ఫోర్జరీ వ్యవహారానికి తెగబడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయం బయట పడిన నాటినుంచి ఇరిగేషన్‌శాఖలో పనిచేసే ఉద్యోగి ఉన్నతాధికారులకు కనీస సమాచారం లేకుండా విధులకు గైర్హాజరయ్యాడు. గత నెల 18నుంచి ఆయన విధులకు రావటం లేదని ఇరిగేషన్‌శాఖ డీఈ అనీల్‌బాబు పేర్కొన్నారు. ఈవ్యవహారంపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపితేనే వాస్తవం తేలుతుందని పలువురు పేర్కొంటున్నారు.