breaking news
firs filed
-
వేమూరి కావేరి బస్సు ప్రమాదంపై రెండు ఎఫ్ఐఆర్లు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కావేరి బస్సు ప్రమాద ఘటనపై చిక్కుముడి వీడింది. బైక్, బస్సు ప్రమాదం ఒకటి కాదని.. రెండు వేర్వేరు ప్రమాదాలని పోలీసులు తేల్చారు. బైకర్స్ మద్యం సేవించి లక్ష్మీపురం నుంచి బయలుదేరగా చిన్నటేకూరు దాటిన తర్వాత వారి బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో శివశంకర్ అక్కడికక్కడే మృతిచెందగా, వెనుక కూర్చున్న ఎర్రిస్వామి కిందపడిపోయాడు. ఈ ఘటన తర్వాత కొన్ని వాహనాలు ఇదే దారిలో వెళ్లాయి. 13 నిమిషాల తర్వాత వచి్చన కావేరి బస్సు డ్రైవర్.. ఆ బైక్‌ను గుర్తించడంలో విఫలమై ఢీకొట్టడంతో విషాదం చోటుచేసుకుంది.నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ ఘటనలపై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ నెల 24న బైక్‌ను ఢీకొట్టి ప్రమాదానికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుపై సెక్షన్ 12(ఏ), 106(1) బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు. ఏ1గా వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్, ఏ2గా బస్సు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అయితే పోలీసుల విచారణలో రెండూ వేర్వేరు ఘటనలని తేలాక ఈ నెల 25న మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చాకలి ఎర్రిస్వామి ఫిర్యాదు మేరకు మృతిచెందిన బైకర్ శివశంకర్‌పై సెక్షన్ 281, 125(ఏ), 106(1) కింద కేసు నమోదు చేశారు. విచారణ ఇంకా కొనసాగుతోందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మృతదేహాలు అప్పగింత డీఎన్ఏ శాంపిల్స్ రిపోర్ట్‌ను ఎఫ్ఎస్ఎల్ (ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ) జిల్లా కలెక్టర్‌కు పంపడంతో మృతదేహాలను బాధిత కుటుంబాలకు అందజేశారు. కర్నూలు జనరల్ ఆస్పత్రి మార్చురీ వద్ద భీతావహ వాతావరణంలో ఈ ప్రక్రియ పూర్తయింది. ఆదివారం 17 మృతదేహాలను బంధువులకు అప్పగించగా.. బిహార్ వాసి అమృత్‌కుమార్ మృతదేహాన్ని తాము తీసుకెళ్లలేమని, ఆనవాళ్లు కూడా లేని మాంసపు ముద్దకు ఇక్కడే అంత్యక్రియలు చేయాలని కుటుంబ సభ్యులు వేడుకున్నారు. దీంతో కర్నూలు కార్పొరేషన్ అధికారులు అమృత్‌కుమార్ అంత్యక్రియలు పూర్తిచేశారు. ఇక తమిళనాడు వాసి ప్రశాంత్ మృతదేహాన్ని సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఆరాంఘర్‌లో బస్సు ఎక్కింది కుప్పం వాసి త్రిమూర్తి.. హైదరాబాద్‌లోని ఆరాంఘర్‌లో బస్సు ఎక్కిన ప్రయాణికుడిని కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలం యామగానిపల్లెకు చెందిన త్రిమూర్తిగా గుర్తించడంతో డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. చెక్కుల పంపిణీ పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం బస్సు ప్రమాదంలో మృతిచెందిన ఆరుగురు ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షలు చొప్పున పరిహారం అందజేసింది. గద్వాల ఆర్డీవో అలివేలు చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఏపీ ప్రభుత్వం తరఫున హోంమంత్రి అనిత ప్రకటించినట్లుగా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని త్వరలో అందజేస్తామని కర్నూలు కలెక్టర్ సిరి తెలిపారు. కోలుకుంటున్న బస్సు ప్రమాద బాధితుడు కర్నూలు (హాస్పిటల్): కర్నూలు శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురైన గుణసాయి అనే ప్రయాణికుడు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కోలుకుంటున్నాడు. మచిలీపట్నంకు చెందిన ఈయన ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. బస్సులో ప్రయాణిస్తుండగా మంటలు రావడంతో ఆ పొగ పీల్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో అతని ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురయ్యాయి. దీంతో అతన్ని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించారు. వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆర్‌ఐసీయులో ఉంచి వైద్యం అందిస్తున్నారు. శనివారం వరకు విషమంగా ఉన్న అతని ఆరోగ్యం వైద్యుల కృషి ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడింది. ఆస్పత్రిలో చేరిన ఎర్రిస్వామి.. బస్సు ప్రమాదంలో కీలక సాక్షిగా ఉన్న ఎర్రిస్వామి శనివారం రాత్రి ప్రభుత్వాస్పత్రిలో కడుపునొప్పితో చేరాడు. బైక్ నుంచి అతను కింద పడటంతో కడుపు వద్ద గీరుకుపోయింది. దీనికితోడు పలుచోట్ల నొప్పులు ఉండటంతో కుటుంబసభ్యుల కోరిక మేరకు పోలీసులు అతన్ని ఆసుపత్రిలో చేరి్పంచారు. అతనికి అ్రల్టాసౌండ్ స్కాన్, ఎక్స్‌రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేసిన వైద్యులు.. లోపల ఎలాంటి గాయాల్లేవని నిర్ధారించారు. మరికొన్ని పరీక్షలు చేసి కోలుకుంటే డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిసింది. -
‘మీరు వారితో పోల్చుకోవద్దు’.. ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీం చురక
న్యూఢిల్లీ: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో డీఎంకే ముఖ్య నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు చురకంటించింది. సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలపై వివిధ రాష్ట్రాల్లో ఫైల్ అయిన కేసులన్నింటిని జత చేసి తమిళనాడులో విచారించేలా ఆదేశాలు జారీ చేయాలని ఉదయనిధి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ‘వివాదాస్పద వ్యాఖ్యలు చేసే జర్నలిస్టులతో మీరు పోల్చుకోవద్దు. వాళ్లు రేటింగ్‌ల కోసం వారి బాస్‌ల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తారు. మీరు మాత్రం ఎవరి జోక్యం లేకుండా సొంతగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు’ అని ఉదయనిధికి కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఉదయనిధి న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి జోక్యం చేసుకుని ఇలాంటి వ్యాఖ్యలే నుపుర్ షర్మ అనే రాజకీయ నాయకురాలు చేస్తే ఆమె ఎఫ్‌ఐఆర్‌లన్నింటిని సొంత రాష్ట్రానికి బదిలీ చేశారని గుర్తు చేశారు. దీనికి స్పందించిన అత్యున్నత న్యాయస్థానం అయితే మీరు సీఆర్పీసీ సెక్షన్ 406 కింద పిటిషన్ వేయకుండా ఆర్టికల్ 36 ప్రకారం రిలీఫ్ ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించింది. ఈ కేసు విచారణను మే 6వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగ్యూ లాంటి రోగం అని గత ఏడాది చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్, జమ్మూకాశ్మీర్, మహారాష్ట్ర, కర్ణాటక, బిహార్ తదితర రాష్ట్రాల్లో స్టాలిన్‌పై కేసులు నమోదయ్యాయి. ఇదీ చదవండి.. భోజ్‌శాల సర్వేపై సుప్రీం కీలక తీర్పు -
Munawar Faruqui: స్టాండప్ కమెడియన్‌కి ఊరట
ఢిల్లీ: స్టాండప్ కమెడియన్, ర్యాపర్ మునావర్ ఫరూకీకి సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. హిందూ దేవుళ్లను కించపరిచేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో దేశవ్యాప్తంగా మునావర్‌కి వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లన్నింటిని ఇండోర్(మధ్యప్రదేశ్)కు బదిలీ చేయాని సోమవారం కోర్టు ఆదేశాలు జారీచేసింది. హిందూ దేవుళ్లను కించపరిచేలా ఓ షోలో మునావర్ వ్యాఖ్యలు చేశాడని, మతపరమైన మనోభావాలు దెబ్బతీశాడని దేశవ్యాప్తంగా పలు చోట్ల ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారం పెను దుమారమే రేపింది. ఈ మేరకు బెయిల్ మీద బయట ఉన్న మునావర్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. సోమవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. మునావర్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్ఐఆర్లను ఇండోర్‌కు బదిలీ చేయాలని బెంచ్ ఆదేశించింది. అంతేకాదు.. ఫరూకీకి కల్పించిన మధ్యంతర బెయిల్‌ను మరో మూడు వారాలు పొడిగిస్తున్నట్లు తెలిపింది. 2021, జనవరి1వ తేదీన ఇండోర్‌లోని 56 దుకాణ్ ఏరియాలోని ఓ కేఫ్‌లో న్యూఇయర్ వేడుకల సందర్భంగా.. మునావర్ ఓ కామెడీషో నిర్వహించాడు. ఈ షోలోనే మునావర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అంతేకాదు ఆ సమయంలో ఉన్న కరోనా ఆంక్షలను సైతం ఉల్లంఘించి మరీ షోను నిర్వహించినట్లు తేలింది. దీంతో మునావర్‌పై పలు చోట్ల ఫిర్యాదు వెళ్లాయి. మధ్యప్రదేశ్ హైకోర్టు మునావర్‌కు బెయిల్ తిరస్కరించగా.. సుప్రీం కోర్టు మాత్రం 2021, ఫిబ్రవరి 5వ తేదీన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఊరట ఇచ్చింది. -
'మోదీ హఠావో దేశ్ బచావో..' అంటూ ఢిల్లీలో వేల బ్యానర్లు ప్రత్యక్షం..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వేల సంఖ్యలో బ్యానర్లు ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. ఫుటోవర్‌లు, ఫ్లైఓవర్లు, బిల్డింగులు, రోడ్లు ఇలా అనేక చోట్ల మోదీ హఠావో దేశ్ బచావో(మోదీని గద్దె దించండి దేశాన్ని కాపాడండి) అంటూ ప్లెక్సీలు వెలిశాయి. సామాజిక మాధ్యమాల్లో ఇందుకు సంబంధించిన పోస్టర్లు తెగ వైరల్ అయ్యాయి. ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి వీటిని తొలగించారు. మొత్తం 100కు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అయితే ఇలాంటి బ్యానర్లు లక్షకుగా పైగా ముద్రించాలని రెండు ప్రింటింగ్ ప్రెస్‌లకు ఎవరో ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు మంగళవారం 10వేల పోస్టర్లను కూడా సీజ్ చేశారు. వీటిని వ్యానులో తరలిస్తుండగా పట్టుకున్నారు. అయితే వాటిపై ప్రింటింగ్ ప్రెస్ పేరు గానీ, ఎవరు ముద్రించారనే వివరాలు గానీ లేవు. మోదీ వ్యతిరేక బ్యానర్లకు సంబంధించి 100 ఎఫ్ఐర్లు నమోదు చేయడంతో పాటు, ఆరుగురుని అరెస్టు చేసినట్లు స్పెషల్ సీపీ దీపేంద్ర పథాక్ తెలిపారు. ఆప్ కార్యాలయం నుంచే వ్యాన్ వెల్లిందని పేర్కొన్నారు. ఆప్ సెటైర్లు.. మరోవైపు మోదీ వ్యతిరేక పోస్టర్లను పోలీసులు తొలగించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ సెటైర్లు వేసింది. కేంద్రం నియంత ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడింది. ఆ పోస్టర్లలో ఏం తప్పు ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. 100 ఎఫ్ఐఆర్లు ఎందుకు నమోదు చేశారు మోదీజీ? అని ప్రశ్నించింది. భారత్ ప్రజాస్వామ్య దేశం అని బహుశా ప్రధాని మర్చిపోయినట్టున్నారని సెటైర్లు వేసింది. ఈమేరకు ట్వీట్ చేసింది. मोदी सरकार की तानाशाही चरम पर है‼️ इस Poster में ऐसा क्या आपत्तिजनक है जो इसे लगाने पर मोदी जी ने 100 F.I.R. कर दी? PM Modi, आपको शायद पता नहीं पर भारत एक लोकतांत्रिक देश है। एक पोस्टर से इतना डर! क्यों? pic.twitter.com/RLseE9Djfq — AAP (@AamAadmiParty) March 22, 2023 చదవండి: కేంద్రం శుభవార్త .. ఓటర్ ఐడీకి ఆధార్ కార్డ్ లింక్ చేశారా? -
ఇద్దరు మాజీ సీఎంలపై కేసులు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు బీఎస్ యడ్యూరప్ప, హెచ్డీ కుమారస్వామిలపై అక్రమ భూ డీనోటిఫికేషన్ కేసులో మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కాగ్ నివేదిక ఆధారంగా జయకుమార్ హీరేమత్ అనే ఆర్టీఐ కార్యకర్త 2012 సంవత్సరంలో లోకాయుక్తకు చేసిన ఫిర్యాదు ఫలితంగా ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ (బీడీఏ) ఈ భూములను కేటాయించి, డీనోటిఫై చేయడాన్ని అప్పట్లో కాగ్ తప్పుబట్టింది. తర్వాత ఈ కేసును ప్రాథమిక దర్యాప్తు కోసం సీఐడీ విభాగానికి బదిలీ చేశారు. సీఐడీ చేసిన దర్యాప్తులో.. 2007 నుంచి 2012 వరకు జరిగిన భూముల డీనోటిఫికేషన్లలో అక్రమాలు, చట్ట ఉల్లంఘనలు ఉన్నట్లు గుర్తించింది. మొత్తం 40 అక్రమ డీనోటిఫికేషన్లను కాగ్ గుర్తించింది. ఈ కేసులో ఆర్టీఐ డాక్యుమెంట్ల ఆధారంగా కుమారస్వామిని ఎ1 గాను, యడ్యూరప్పను ఎ2గాను పేర్కొన్నారు.


