breaking news
farest department
-
శివ్వాంలో ఏనుగుల హల్చల్
గరుగుబిల్లి: మండలంలోని గొట్టివలస, మరుపెంట, శివ్వాం, రావుపల్లి తదితర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగులు శివ్వాం సమీపంలోని కుడికాలువ పరిసరాల్లో సోమవారం హల్చల్ చేశాయి. పంట పొలాలను కుమ్మేస్తున్నాయి. వరి, కూరగాయల పంట లను నాశనం చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ రేంజర్ మురళీకృష్ణతో పాటు ఇతర సిబ్బంది ఏనుగులు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఏనుగులు తరలించేందుకు అటవీ, రెవెన్యూ శాఖ చేసిన ప్రయత్నాలు ఏవీ సఫలం కాకపోవడంతో ప్రజల గుండెల్లో భయాందోళన నెలకొంది. ఎప్పుడు ఏ గ్రామంపై పడి ప్రజలపై దాడులు చేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని కోరుతున్నారు. -
పశ్చిమ డివిజన్లో 1400 హెక్టార్లలో ప్లాంటేషన్
పశ్చిమ డివిజన్ అటవీ అధికారి సీపీ వినోద్‌కుమార్ మల్లాపూర్: జిల్లా వ్యాప్తంగా పశ్చిమ డివిజన్లో 1400 హెక్టార్లలో ప్లాంటేషన్ చేస్తున్నట్లు పశ్చిమడివిజన్ అటవీ అధికారి సీపీ వినోద్‌కుమార్ అన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలో వననర్సరీ, హరితహారంలో నాటిన మొక్కలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం పర్యావరణ సమతుల్యత కోసమేనని అన్నారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని అటవీసిబ్బంది, వీఎస్ఎస్ చైర్మన్‌కు సూచించారు. అటవీ సంపదను రక్షించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. అటవీ సంరక్షణకు మల్లాపూర్ సెక్షన్‌లోని బీట్ అధికారులు, వన సంరక్షణ సమితి చైర్మన్లు, సభ్యులు దృష్టి సారించాలని సూచించారు. గోదావరి నదితీరంతోపాటు అటవీప్రాంత గ్రామాల నుంచి అక్రమ కలప సరఫరాను అరికట్టాలని అన్నారు. రాయికల్ రేంజ్ అధికారి నరేందర్‌రావు, మల్లాపూర్ సెక్షన్ అధికారి సాయిప్రసాద్, బీట్ అధికారులు రమణయ్య, సత్తార్, రవీందర్‌నాయక్, సురేష్, వనసంరక్షణ సమితి సిరిపురం రవీందర్, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.