breaking news
fair rate
-
మిషన్ మౌసమ్తో వాతావరణ సమాచారం
కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో వ్యవసాయ ఉత్పత్తులకు న్యాయమైన ధరలను నిర్ధారించడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నొక్కి చెప్పారు. పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి, వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులకు సేవలందించేందుకు ఉద్దేశించిన అనేక కీలక కార్యక్రమాలను ఆమె హైలైట్ చేశారు.రైతులపై దృష్టిరైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించేలా చూడటం ద్వారా వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముర్ము తెలిపారు. వ్యవసాయ రంగానికి ఊతమివ్వడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, తద్వారా దేశ సమగ్ర ఆర్థిక వృద్ధికి దోహదపడటం ఈ కార్యక్రమం లక్ష్యమని చెప్పారు.యు-విన్ పోర్టల్గర్భిణులు, చిన్నారులకు ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచే దిశగా యూ-విన్ పోర్టల్‌ను ప్రారంభించినట్లు రాష్ట్రపతి ప్రకటించారు. యు-విన్ పోర్టల్ వ్యాక్సినేషన్ షెడ్యూల్‌ను కచ్చితంగా ట్రాక్ చేయడానికి, సకాలంలో పూర్తి రోగనిరోధక శక్తిని నిర్ధారించడానికి రూపొందించినట్లు తెలిపారు. యూనివర్సల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా 12 నివారించదగిన వ్యాధులకు వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.ఇదీ చదవండి: ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమామిషన్ మౌసమ్భారతదేశాన్ని వాతావరణ మార్పులకు సిద్ధంగా ఉండేలా, వాటివల్ల కలిగే ప్రభావాలను మరింత స్మార్ట్‌గా నిర్వహించడానికి మిషన్ మౌసమ్ పథకం తోడ్పడుతుందన్నారు. ఈ రూ.2,000 కోట్ల ప్రాజెక్టు ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో కచ్చితమైన, సకాలంలో వాతావరణ సమాచారాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది. మిషన్ మౌసమ్లో తదుపరి తరం రాడార్లు, ఉపగ్రహ వ్యవస్థలు, అధిక పనితీరు కలిగిన సూపర్ కంప్యూటర్లతో సహా అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
రైతులపై శ్రద్ధ లేని ప్రభుత్వం
= ఎన్నికల్లో ఇచ్చిన ధరల స్థిరీకరణ హామీ ఏమైంది ? = ఒక్కరోజైనా రైతు సమస్యలపై పాలకులు చర్చించారా ? = వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరపై జరిగిన చర్చా వేదికలో రైతు నాయకుల ధ్వజం ఒంగోలు టూటౌన్: వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడంలో పాలకుల వైఫల్యంపై రైతు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతికూల వాతావరణాన్ని సైతం ఎదుర్కొని పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించకపోవడంపై మండిపడ్డారు. స్థానిక రంగా భవనంలో వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు కల్పనలో ప్రభుత్వాల వైఫల్యం–రైతు సంఘాల కర్తవ్యంపై సోమవారం చర్చా వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆచార్య రంగా కిసాన్ సంస్థ అధ్యక్షుడు ఆళ్ళ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆచార్య ఎన్జీ రంగా సమయంలో రైతులను కొంత వరకైనా ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుత పాలకులు రైతులకు గిట్టుబాటు కల్పించకపోవడం, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను సకాలంలో ఆదుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పాలకులు రైతులకు «రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ ఏర్పాటు చేస్తానని ఇచ్చిన వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. కరువు పరిస్థితుల్లో క్షామ నివారణ చర్యలు ప్రభుత్వం చేపట్టాలని ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక జిల్లా అధ్యక్షుడు చుండూరి రంగారావు అన్నారు. సీపీఐ ఎంఎల్ నాయకుడు పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ పాలకులకు రాజధాని నిర్మాణంలో ఉన్న శ్రద్ధ రైతులపై లేదన్నారు. అసెంబ్లీలో రైతు కుటుంబాల నుంచి వచ్చామని చెప్పుకునే మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్క రోజు అయిన రైతుల సమస్యలపై సమీక్షించారా అంటూ ప్రశ్నించారు. రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపినాథ్ మాట్లాడుతూ ప్రస్తుతం మిరప, కంది, శనగ పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నా పాలకులు చోద్యం చూస్తున్నారని అన్నారు. రైతులు, రైతు సంఘాల్లో ఐక్యత లేకపోవడం వల్లనే పాలకులకు అలుసైందని ఏపీ రైతు సంఘం నాయకుడు పమిడి వెంకట్రావు అన్నారు. పక్క రాష్ట్రాలు రైతులను ఆదుకునే తీరును మన పాలకులు ఎందుకు అనుసరించలేకపోతున్నారని మరో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.హనుమారెడ్డి ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆచార్య రంగా కిసాన్ సంస్థ ప్రధాన కార్యదర్శి చుంచు శేషయ్య, ఆక్వా రైతు సంఘం నాయకుడు అన్నెం కొండలరాయుడు, తెలుగు రైతు సంఘం నాయకులు కొండ్రగుంట వెంకయ్య, పెంట్యాల హనుమంతరావు, మండవ శ్రీనివాసరావు, పలు రైతు సంఘాల నాయకులు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.