breaking news
expired persons
-
సరదా ఇద్దరి ప్రాణాల్ని తీసింది
సాక్షి, నల్గొండ: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన బావ బామ్మర్దులు వాగునీటిలో పడి చనిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం తిమ్మాయిపాలెం గ్రామంలో బావ బామ్మర్దులు సరదాగా ఈత కోసమని సమీపంలోని కృష్ణా నది బ్యాక్ వాటర్ వాగులోకి వెళ్లారు. ఈ క్రమంలో వాగులో ఈత కొట్టే సమయంలో రమావత్ రగేష్ నాయక్(25), శీను నాయక్(22) నీటిలో ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు. అటు వైపు వెళ్తున్న స్థానికులు గమనించి వాగులో నుంచి మృతదేహాలను బయటకు తీశారు. అయితే చనిపోయిన రమావత్ రాగేశ్ నాయక్ స్వగ్రామం నెహ్రూ నగర్ తండ గుంటూరు జిల్లా. మరో మృతుడు శీను నాయక్ది దుర్గి మండలం గండిగనుమల స్వస్థలం. తన బంధువుల ఊరు అయిన బాలెంపల్లికి ఓ శుభకార్యానికి వచ్చారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగింది. దీంతో రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చదవండి: ఆ నాలుగూ.. ఇవేనా! -
పాక్‌పై అమెరికా ఆంక్షల కొరడా
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్‌పై మరోసారి కఠిన వైఖరి తీసుకుంది. బహిష్కరణకు గురైన వారిని స్వదేశానికి తీసుకెళ్లేందుకు, వీసా గడువు ముగిశాక తిష్టవేసిన పౌరుల విషయం పట్టించుకునేందుకు నిరాకరించడంతో పాకిస్తాన్‌పై తాజాగా ఆంక్షల కొరడా ఝళిపించింది. ఈ పరిణామంతో అమెరికా ఆంక్షల భారం పడిన 10 దేశాల జాబితాలో పాకిస్తాన్ సైతం చేరినట్లయింది. బహిష్కరణకు గురైన వారిని స్వదేశానికి తీసుకెళ్లేందుకు, అమెరికాలో అక్రమంగా ఉంటున్న తమ పౌరులను వెనక్కి తీసుకునేందుకు నిరాకరించడంతో ఆఫ్రికా దేశం ఘనాపైనా ఈ ఏడాది ఆంక్షలు విధించింది. ఈ రెండు దేశాలతోపాటు గయానా (2001), గాంబియా (2016), కాంబోడియా, ఎరిట్రియా, గినియా, సియెర్రాలియోన్ (2017), బర్మా, లావోస్ (2018)పైనా అమెరికా ఆంక్షలు అమలు చేస్తోంది. ఆంక్షల కారణంగా ఆయా దేశాల పౌరులు, నివాసితులకు ఎటువంటి కారణం చూపకుండా వీసా ఆలస్యం చేయవచ్చు లేదా నిరాకరించేందుకు అమెరికా హోంశాఖకు అధికారం ఉంటుంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నందున ఈ ఆంక్షల విషయమై స్పందించలేమని అమెరికా హోం శాఖ తెలిపింది. అయితే, ఆంక్షల ప్రభావం పాక్‌పై పరిమితంగానే ఉంటుందని అధికారులు అంటున్నారు. -
సచ్చినోల్ల పింఛన్లు స్వాహా
పాపన్నపేట, న్యూస్‌లైన్: సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నచందంగా నిరుపేదల పింఛన్లను అధికారులు నొక్కేశారు. పాపన్నపేట మండలంలోని 12 గ్రామాల్లో రూ. 2.99,500ల ఫించన్ డబ్బులు దుర్విని యోగం అయ్యాయి. చనిపోయిన వారి ఫించన్లు, ఒకే పేరు మీద రెండేసి పింఛన్లున్న సంఘటనలను తెలివిగా అధికారులు సొమ్ము చేసుకున్నారు. గతజూన్ లో జరిగిన సామాజిక తనిఖీలో ఈ కుం భకోణం భయపడటంతో అధికారుల నుంచి డబ్బులు రికవరీ చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ సుధాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా వెలు గు చూడని సంఘటనలు కూడా మరిన్ని ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. పాపన్నపేట మండలంలో 23 గ్రామ పంచాయతీలు ఉండగా, రెండు గ్రామాల్లో తప్ప మిగతా అన్ని చోట్ల స్మార్ట్‌కార్డుల ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. కాగా అర్కెల, గాజులగూడెంలో మాత్రం ఇంత వరకు స్మార్ట్‌కార్డులు వినియోగంలోకి రాలేదు. దీంతో పంచాయతీ కార్యదర్శులే పింఛన్లు పం పిణీ చేస్తున్నారు. మండలంలో కొంతమంది పింఛన్‌దారులు మరణించగా, స్మార్ట్‌కార్డులున్న చోట వారి స్థానంలో మరొకరి వేలి ముద్రలు నమోదు చేసి యేళ్ల తరబడి వారి పింఛన్లను స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మరి కొన్ని గ్రామాల్లో ఒకే వ్యక్తికి రెండేసి పిం ఛన్లుండగా అందులో ఒకటి లబ్ధిదారునికి చెల్లించి, మరొకటి అధికారులే స్వా హా చేశారన్న ఆరోపణలున్నాయి. కాగా కొన్ని గ్రామాల్లో రాజకీయ నాయకులు కూడా ఈ పాపాన్ని పంచుకున్నారన్న విమర్శలున్నాయి. 2011-12 సంవత్సరానికి సంబంధించి జూన్ 2013లో సా మాజిక తనిఖీ జరిగింది. అర్కెలలో రూ.48 వేలు, మల్లంపేటలో రూ.41, 800, గాంధారిపల్లిలో రూ.2,100, నార్సింగిలో రూ.1లక్ష 22 వేల 400లు, గాజులగూడెంలో రూ.1800, మిన్పూర్లో రూ.32,500, నాగ్సాప్పల్లిలో రూ. 3,800, చీకోడ్‌లో రూ.500, అన్నారం లో రూ.1,000, పాపన్నపేటలో రూ.4, 800, యూసుఫ్‌పేటలో రూ.18,400, బాచారంలో రూ.22,400 స్వాహా అయినట్లు తేలింది. ఈ డబ్బులు స్వాహా చేసి న పంచాయతీ కార్యదర్శులు, సీఎస్పీ లు ప్రవీణ్, రమేష్, వినోద, కవిత, రేణు క, పి.స్వరూప, విజయలక్ష్మి, రాంరెడ్డి, సువర్ణ, అన్నపూర్ణ, రహ్మత్, దుర్గయ్య, సక్కుబాయి, లక్ష్మీ, సామెల్, భూమమ్మల నుంచి స్వాహా చేసిన డబ్బులు రికవరీ చేయాలని అధికారులు జారీ చేశారు వెలుగులోకి రాని కుంభకోణాలెన్నో... పాపన్నపేట మండలంలో యేళ్ల తరబడిగా పింఛన్ల కుంభకోణం కొనసాగుతుందన్న ఆరోపణలున్నాయి. గాజుల గూడెం గ్రామంలో సుమారు 8 మంది వ్యక్తులు చనిపోగా, అక్కడ కేవలం రూ.1800 లు మాత్రమే స్వాహా అయినట్లు తనిఖీలో తేలింది. ఇతర గ్రామా ల్లో కూడా ఇలాంటి అక్రమాలు యేుళ్ల తరబడి కొనసాగుతుందన్నా ఆరోపణలున్నాయి. కాగా సామాజిక తనిఖీ ప్రతి నిధి కేవలం కొంతమంది పింఛన్‌దారులను మాత్రమే విచారించడంతో మిగతావి బయట పడలేదని తెలుస్తుం ది. మిగతావారు అందుబాటులో లేనందు వల్ల విచారించలేక పోయామని సామాజిక తనిఖి అధికారులు అప్పట్లో స్ప ష్టం చేశారు. ఈ విషయమై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే ఫించన్ల అవినీతి భాగోతం బయట పడే అవకాశం ఉంది. ఈ విషయంపై ఎంపీడీఓ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు ఇచ్చిన సూచన మేరకు బా ధ్యులనుంచి స్వాహా అయిన సొమ్ము రూ.2,99,500లు రికవరీ చేస్తామన్నా రు. ఇతర అవినీతిపై అనుమానాలుంటే తన దృష్టికి తేవాలని సూచించారు.