breaking news
Expert Shortage
-
కంపెనీల్లో జెన్ఏఐ నిపుణుల కొరత..
న్యూఢిల్లీ: దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) మార్కెట్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. 2025లో 28.8 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి. కానీ నిపుణల కొరతే పరిశ్రమకు ప్రధాన సమస్యగా మారింది. పది జెన్ఏఐ ఉద్యోగాలుంటే నైపుణ్యాలున్న అభ్యర్ధులు ఒక్కరే ఉంటున్నారు. టీమ్‌లీజ్ డిజిటల్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం నిర్దిష్ట ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ఎల్ఎల్ఎం సేఫ్టీ..ట్యూనింగ్, ఏఐ ఆర్కె్రస్టేషన్, ఏజెంట్ డిజైన్, సిమ్యులేషన్ గవర్నెన్స్, ఏఐ కాంప్లయెన్స్, రిస్క్ ఆపరేషన్స్లాంటి ఏఐ నైపుణ్యాలకు అత్యధిక డిమాండ్ ఉంటోంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు.. జనరేటివ్ ఏఐ ఇంజినీరింగ్, మెషిన్లెరి్నంగ్ ఆపరేషన్స్లాంటి విభాగాల్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతున్నాయి. సీనియర్లకు ఏటా రూ. 58–60 లక్షల వరకు ప్యాకేజీలు ఉంటున్నాయి. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → డిజిటల్ ఎకానమీలో ఏఐ, క్లౌడ్ ఉద్యోగాలకు డిమాండ్ భారీగా ఉంది. దానికి తగ్గట్లుగా నైపుణ్యాలున్న అభ్యర్ధులు లభించక, తీవ్ర కొరత నెలకొంది. దీంతో తగిన అర్హతలున్న వారికి కంపెనీలు భారీ వేతనాలిస్తున్నాయి. → జీసీసీల్లో సైబర్‌సెక్యూరిటీ, డేటా ఇంజినీరింగ్ ఉద్యోగుల వేతనాలు 2025–2027 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో వార్షికంగా వరుసగా రూ. 28 లక్షల నుంచి రూ. 33.5 లక్షలకు, రూ. 23 లక్షల నుంచి రూ. 27 లక్షలకు పెరగనున్నాయి. → నాన్–టెక్ రంగాల్లోని టెక్ ఉద్యోగాలకు సంబంధించి ఐటీ సపోర్ట్, సంప్రదాయ తరహా సిస్టమ్స్ మెయింటెనెన్స్ విభాగాల్లో వేతనాలు వార్షికంగా రూ. 12 లక్షల స్థాయిలోనే స్థిరపడిపోయి ఉన్నాయి. పరిశ్రమ క్లౌడ్ నేటివ్, ఔట్సోర్స్డ్ సరీ్వస్ మోడల్స్ వైపు మళ్లుతుండటాన్ని ఇది సూచిస్తోంది. → ఏఐ మార్కెట్ ప్రస్తుతం హైపర్–గ్రోత్ దశలోకి అడుగుపెడుతోంది. ఏటా 45 శాతం వృద్ధితో 2025లో 28.8 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రతిభావంతుల కొరత తీవ్రంగా ఉంటోంది. ప్రతి పది జెన్ఏఐ ఉద్యోగాలకు అన్ని అర్హతలు కలిగిన ఇంజినీరు ఒకే ఒక్కరు ఉంటున్నారు. → 2026 నాటికి ఏఐ టాలెంట్ అంతరాలు 53 శాతానికి పెరగనుంది. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్‌లో డిమాండ్–సరఫరా మధ్య అంతరం 55–60 శాతానికి పెరగనుంది. → ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో పెద్ద స్థాయిలో శిక్షణను కల్పించకుంటే, కంపెనీల వృద్ధి ఆకాంక్షలు నెరవేరని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. → ఏఐ వినియోగమనేది జాబ్ మార్కెట్ల రూపురేఖలను గణనీయంగా మార్చేయనుంది. గ్లోబల్ విధులు నిర్వహించే 40 శాతం వరకు ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఐటీ సరీ్వసులు, కస్టమర్ ఎక్స్పీరియన్స్, బీఎఫ్ఎస్ఐ, హెల్త్కేర్లాంటి రంగాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే కంపెనీలు ఏఐ–ఫస్ట్ లెర్నింగ్ మోడల్స్, డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. → భారత డిజిటల్ ఎకానమీలో ఉద్యోగాలు, నైపుణ్యాల్లో మార్పులకు ఇంజిన్లుగా వ్యవహరిస్తున్న జీసీసీలు, ఉద్యోగాల కల్పనకు సారథ్యం వహిస్తున్నాయి. 2025లో 22–25 శాతం మేర ఉద్యోగాలు కల్పించనున్నాయి. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో అత్యధికంగా కొలువులు ఉండనున్నాయి. → 2027లో అందుబాటులోకి రాబోయే 47 లక్షల కొత్త టెక్ ఉద్యోగాల్లో గణనీయ సంఖ్యలో కొలువులను (12 లక్షలు) జీసీసీలే కల్పించనున్నాయి. ప్రధానంగా జెన్ఏఐ, ఇంజినీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఉంటాయి. → జీసీసీలు మెట్రో పరిధిని దాటి విస్తరిస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో 1,30,000–1,40,000 మంది తాజా గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకోనున్నాయి. వీరిలో ఎక్కువ శాతం హైరింగ్ ద్వితీయ, తృతీయ శ్రేణి ఇంజినీరింగ్ క్యాంపస్‌లలో ఉండొచ్చు. వైవిధ్యానికి కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. ఇప్పుడు టాప్ 20 జీసీసీల్లో 40 శాతం మంది సిబ్బంది మహిళలే ఉంటున్నారు. పరిశ్రమ సగటు కన్నా ఇది 1.5 రెట్లు అధికం. → 2027 నాటికి భారత్‌లో 2,100 పైగా జీసీసీలు ఉంటాయి. వీటిలో 30 లక్షల మంది పైగా ఉంటారు. -
భారత్‌కు ఏఐ నిపుణులు కావలెను
సాక్షి, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్న హాట్ టాపిక్ ఇదే. అయితే ప్రపంచ ఏఐ నిపుణులకు కేంద్రంగా మారడానికి భారత్‌కు అవకాశాలు ఉన్నప్పటికీ.. ఈ రంగంలో నిపుణుల కొరతను దేశం ఎదుర్కొనబోతోందని మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కంపెనీ తన తాజా నివేదికలో వెల్లడించింది. పెరుగుతున్న నైపుణ్య అంతరం ఈ రంగంలో దేశ పురోగతికి ఆటంకం కలిగించే ప్రమాదం ఉందని తెలిపింది. 2027 నాటికి భారత ఏఐ రంగంలో 10 లక్షలకుపైగా నైపుణ్యం కలిగిన నిపుణుల కొరత తప్పదని జోస్యం చెప్పింది. అందుబాటులో ఉన్న నిపుణులతో పోలిస్తే 1.5–2 రెట్ల డిమాండ్ ఉంటుందని అంచనాగా వెల్లడించింది. సమస్య నుంచి గట్టెక్కాలంటే కంపెనీలు సంప్రదాయ నియామక విధానాలకు మించి ముందుకు సాగాలి. నిరంతర నైపుణ్యాల పెంపుదలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆవిష్కరణ–ఆధారిత పర్యావరణ వ్యవస్థను పెంపొందించాలి అని వివరించింది. రీస్కిల్–అప్‌స్కిల్.. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి భారత్‌లో శ్రామిక శక్తి నైపుణ్యం తిరిగి మెరుగుపరచడం, నైపుణ్యాలను పెంచడం అత్యవసరమని నివేదిక స్పష్టం చేసింది. ‘అభివృద్ధి చెందుతున్న సాంకేతిక సాధనాలు, నైపుణ్యాలపై ప్రస్తుత నిపుణుల్లో ఎక్కువ మందిలో తిరిగి నైపుణ్యం మెరుగుపర్చడం, పెంచడంలో సవాళ్లతోపాటు అవకాశాలూ ఉన్నాయి’ అని బెయిన్ అండ్ కంపెనీ ఏఐ, ఇన్సైట్స్, సొల్యూషన్స్ ప్రాక్టీస్ పార్ట్నర్, లీడర్ సైకత్ బెనర్జీ తెలిపారు. ‘ప్రతిభ కొరతను పరిష్కరించడానికి బహుముఖ విధానం అవసరం. కంపెనీలు సంప్రదాయ నియామక పద్ధతులకు మించి అంతర్గత ప్రతిభను పెంపొందించడానికి నిరంతర నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతిభ కొరత ఒక ముఖ్యమైన సవాల్. కానీ అధిగమించలేనిది కాదు. దీనిని పరిష్కరించడానికి వ్యాపార సంస్థలు ఏఐ ప్రతిభను ఆకర్షించడం, అభివృద్ధి చేయడం, నిలుపుకోవడంలో ప్రాథమిక మార్పు అవసరం’ అని నివేదిక వివరించింది. ఏఐ స్వీకరణలో వెనుకంజ.. ఆకర్షణీయంగా జీతాలు పెరిగినప్పటికీ అర్హత కలిగిన ఏఐ నిపుణుల సరఫరా డిమాండ్ వేగాన్ని అందుకోలేదు. ప్రతిభ అంతరం పెరగడం వల్ల పరిశ్రమల్లో ఏఐ స్వీకరణ మందగించే ప్రమాదం ఉందని నివేదిక వివరించింది. ఉత్పాదక ఏఐ సాంకేతికతలను అమలు చేయడానికి అంతర్గత ఏఐ నైపుణ్యం లేకపోవడం ఒక ప్రధాన అడ్డంకి అని ప్రపంచవ్యాప్తంగా సర్వేలో పాలుపంచుకున్న కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు. ఈ కొరత కనీసం 2027 వరకు కొనసాగుతుందని, అంతర్జాతీయ మార్కెట్లలో వివిధ స్థాయిల్లో ప్రభావం ఉంటుందని అంచనాగా చెప్పారు. దేశంలో 2019 నుండి ఏఐ సంబంధిత ఉద్యోగ నియామకాలు ఏటా 21 శాతం దూసుకెళ్లాయి. అయితే వేతనాలు ప్రతి సంవత్సరం 11 శాతం పెరిగాయి. ఏఐ అవకాశాలు: 2027 నాటికి 23 లక్షలకుపైమాటే. అంటే అందుబాటులో ఉన్న నిపుణులతో పోలిస్తే 1.5–2 రెట్లు అధిక డిమాండ్. మూడేళ్లలో వనరులు: సుమారు 12 లక్షల మందికి చేరిక నిపుణుల కొరత : 10 లక్షల మందికిపైగా డిమాండ్ తీర్చాలంటే: మానవ వనరుల నైపుణ్యం తిరిగి మెరుగుపరచడం (రీస్కిల్), నైపుణ్యాలను పెంచడం (అప్‌స్కిల్) అత్యవసరం. -
నీతి ఆయోగ్‌కు కన్సల్టెంట్లు కావలెను!
న్యూఢిల్లీ: ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్ నిపుణుల కొరతతో సతమతమవుతోంది. దీంతో ఏడుగురు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)లను నియమించుకోవాలని నిర్ణయించింది. ఒక్కొక్కరికి నెలకు రూ.1.55 లక్షల వేతనాన్ని ఇవ్వనున్నట్లు సంస్థ తన వెబ్సైట్లో ప్రకటించింది. ఆర్థిక, సామాజిక, ఐటీ, రవాణా, న్యాయ, ఇంజనీరింగ్ విభాగాల్లో కన్సల్టెంట్లు అవసరమని అందులో పేర్కొంది. ప్రత్యేక కార్యకలాపాల కోసం పనిచేసే వీరిని తొలుత ఏడాది కాలపరిమితితో నియమించనున్నట్లు తెలిపింది. ఆయారంగాల్లో సరైన నిపుణులు లభించకపోవడంతో సంస్థ కార్యకలాపాలకు విఘాతం కలుగుతోందని సీనియర్ అధికారి ఒకరు శనివారం చెప్పారు. దీంతో ఇందులో ఉన్న సభ్యులపై పనిభారం పెరుగుతోందని, సంస్థ వైస్‌చైర్మన్ అరవింద్ పనగరియా 10 డివిజన్లు, 20 మంత్రిత్వ శాఖలు పర్యవేక్షిస్తున్నారని; సభ్యుడు బిబేక్ దేబ్రాయ్ 3 డివిజన్లు, 18 మంత్రిత్వ శాఖలు, 15 రాష్ట్రాలు చూస్తున్నారన్నారు. మరో సభ్యుడు వీకే సారస్వత్ 15 మంత్రిత్వ శాఖలు, 17 రాష్ట్రాలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.