చినవెంకన్న సన్నిధిలో వివాహాల సందడి
దేవరపల్లి (ద్వారకాతిరుమల) : వివాహాలు, కొత్త జంటలతో చినవెంకన్న క్షేత్రంలో శనివారం సందడి నెలకొంది. మాఘమాసం కావడంతో శుక్రవారం రాత్రి వివిధ ప్రాంతాల్లో వివాహాలు జరుపుకున్న నూతన వధూవరులు శనివారం తెల్లవారుజాము నుంచి ద్వారకాతిరుమల చినవెంకన్న దర్శనార్థం వచ్చారు. వీరి రాకతో ఆలయ పరిసరాలు కళకళలాడాయి. కొత్త జంటలు, వారి బంధువులతో క్షేత్రం సందడిగా మారింది. పెళ్లి వస్రా్తలతో వీరంతా స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు బారులు తీరారు. స్వామివారి సన్నిధిలో వివాహాలు కూడా పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి