breaking news
Dragons
-
‘నీ లంచం తిరిగి ఇచ్చేస్తున్నా..ఆల్ ద బెస్ట్’
విల్లింగ్టన్ : డ్రాగన్లపై పరిశోధన చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఓ పదకొండేళ్ల బాలిక ఇవ్వజూపిన లంచాన్ని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డర్న్ తిరస్కరించారు. తన లాంటి చిన్న పిల్లలు ఇచ్చే సూచనలు, సలహాలు తప్పక పాటిస్తామని, అయితే పని చేయడం కోసం ఇలా డబ్బు ఇవ్వడం మంచిది కాదని సున్నితంగా హెచ్చరించారు. ఈ మేరకు..‘సైకిక్స్, డ్రాగన్స్ గురించి నువ్విచ్చే సలహాలు స్వీకరించేందుకు మేము ఎల్లప్పుడూ సిద్ధం. కానీ దురదృష్టవశాత్తూ మనం ఇప్పుడు వాటిపై పరిశోధనలు చేయడం లేదు. నువ్వు లంచంగా ఇచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేస్తున్నా. టెలికినెసిస్, టెలిపతి, డ్రాగన్లపై నీకున్న ఇంటరెస్ట్ అమోఘం. ఆల్ ద బెస్ట్. నేను కూడా ఇక నుంచి డ్రాగన్లపై ఓ కన్నేసి ఉంచుతా. అవి సూట్ తొడుక్కుంటాయా’ అంటూ జెసిండా పేరిట ప్రధాని కార్యాలయం సదరు బాలికకు లేఖ రాసింది. ఇంతకీ విషయమేమిటంటే.. విక్టోరియా అనే బాలికకు డ్రాగన్స్, టెలీపతి, మనుషుల మనస్సును చదివే అంశాలంటే ఎంతో ఆసక్తి. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే స్కై ఫై సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్‌ను వీక్షించినప్పటి నుంచి నిరంతరం వాటి గురించే ఆలోచిస్తోందని ఆమె సోదరుడు పేర్కొన్నాడు. డ్రాగన్ ట్రెయినర్‌గా మారాలన్నది తన కల అని తెలిపాడు. ఈ క్రమంలోనే అతీత శక్తులపై పరిశోధనలు జరపాలంటూ ప్రభుత్వాన్ని కోరడంతో పాటు.. ఇందుకు సంబంధించి రాసిన లేఖకు ఐదు డాలర్లు(న్యూజిలాండ్) జత చేసినట్లు పేర్కొన్నాడు. -
ఆ షోకు వెళితే రెప్పవాల్చరేమో?
బీజింగ్: మీరెప్పుడైనా చైనా వెళతారా.. వెళితే అక్కడ లింగ్షాన్ గ్రాండ్ బుద్ధ సెనిక్ ప్రాంతానికి తప్పక వెళ్లండి. ఎందుకంటే జ్ఞాన బుద్ధుడి ప్రతిమలు దర్శనం ఇవ్వడమే కాకుండా అబ్బురపరిచే దృశ్యాలు కనువిందు చేస్తాయి. ముఖ్యంగా అక్కడ ఉన్న ఒక పెద్ద కొలను నడిమధ్య లో ప్రత్యేకంగా రూపొందించిన తామరతో కూడిన పూర్ణకుంబంలాంటి ఆకృతి కనిపిస్తుంది. ఆ తామర రేకులు విచ్చుకుంటుండగా అందులో నుంచి బుద్ధుడు దర్శనమిస్తాడు. అలా కనిపిస్తూ నాలుగు దిక్కులు తిరుగుతుంటాడు. అలా బుద్ధ విగ్రహం తిరుగుతున్న క్రమంలో ఆ కొలనులోనే కింద ఏర్పాటుచేసిన తొమ్మిది డ్రాగన్లు బుద్ధుడికి స్నానం చేయిస్తాయి. బుద్ధ బగవానుడికి పక్కనే మరో దేవదూత తన చంటి బిడ్డను చేతిలో పట్టుకొని దర్శనమిస్తుంది. అక్కడ కూడా నీటి దారలు రివ్వున ఎగిసి ఆ విగ్రహాన్ని తాకుతుంటాయి. ఆ వెంటనే ఈ రెండు విగ్రహాల నడుమ దూరంగా ఓ కొండల మద్యలో మరో విగ్రహం నుంచి భారీ లైటింగ్ వస్తుంది. అలా లైటింగ్ రావడంతోనే మొదలవుతుంది అసలైన లేజర్ షో.. దాన్ని చూసే ఎవ్వరైనా ముగ్దుల్వాల్సిందే. ప్రపంచంలోని ఎన్నో చోట్ల జరిగే లేజర్ షోల కంటే చైనాలోని ఇక్కడ జరిగే లేజర్ షోకే, స్థానికులు, పర్యాటకులు కుప్పలుగా వెళుతుంటారు. ఈ బుద్ధుడికి సఖ్యముని అని పేరు.