breaking news
dissmissed
-
సుప్రీంకోర్టులో విపక్షాలకు షాక్.. సీబీఐ, ఈడీపై పిటిషన్ తిరస్కరణ..
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో విపక్షాలకు చుక్కెదురైంది. సీబీఐ, ఈడీలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని బీఆర్ఎస్ సహా 14 రాజకీయ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. నాయకుల అరెస్టులపై నిర్దిష్ట మార్గదర్శకాలు ఇవ్వాలని విపక్షాలు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నిర్దిష్ట కేసు వివరాలు లేకుండా మార్గదర్శకాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. సామాన్యుడికి, రాజకీయ నాయకులకు వేర్వేరు న్యాయ సూత్రాలు ఉండవని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. రాజకీయ నాయకులకు ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించలేం అని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ను డిస్మిస్ చేసింది. దీంతో పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని విపక్షాల తరపు న్యాయవాది అభిషేక్ సింగ్వీ న్యాయస్థానాన్ని కోరారు. విపక్షాల స్పేస్ తగ్గిందని కోర్టులను ఆశ్రయించడం సరికాదు, దానికి సరైన వేదిక రాజకీయాలే అని సుప్రీకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. రాజకీయాల్లోనే ఈ అంశాన్ని తేల్చుకోవాలని హితవు పలికింది. చదవండి: ఛానల్ బ్యాన్.. కేంద్రానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసుల మెమో కొట్టివేత
-
ఎమ్మెల్యేపై కేసు కొట్టివేత
ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డిపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసును కొట్టివేస్తూ కర్నూలు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాజ్ మెజిస్ట్రేట్ శ్రీనివాసరావు మంగళవారం తీర్పు చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా స్థానిక నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో ఎస్వీ అనుచరులు బాణసంచా కాల్చారని కేసు నమోదు చేశారు. కోర్టులో ఎస్వీపై నేరం రుజువు కాకపోవడంతో కేసును కొట్టివేస్తూ మేజిస్ట్రేట్ తీర్పు చెప్పారు.