breaking news
diploma engineers
-
డిప్లమో ఇంజినీర్ల సమావేశం
రాయగడ : తమ కోర్కెలను ప్రభుత్వం ఆమోదించినప్పటికీ నేటికీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఒడిశాలోని డిప్లమో ఇంజినీర్లు, డిగ్రీ ఇంజినీర్లు రాష్ట్ర డిప్లమో ఇంజినీర్ల అసొసియేషన్ అదేశాల మేరకు రాయగడ ఐబీలో మంగళవారం సమావేశమయ్యారు. సమావేశం అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు రమకాంత్దాస్, సెక్రటరీ ప్రదీప్‌కుమార్ పాత్రో, సభ్యులు సుచిత్రామోహన్ తదితరులు మాట్లాడుతూ చాలా కాల క్రితం ప్రభుత్వం ఆమోదించిన 8కోర్కెలు నేటికీ అమలు కాలేదని దీనిపై రాష్ట్రంలో 8,500 మంది డిప్లమో ఇంజినీర్లు సెప్టెంబర్ 18వతేదీ నుండి అక్టోబర్ 31వతేదీ వరకు సామూహిక సెలవు ఆందోళన చేపట్టనున్నట్లు నిర్ణయించామని వివరించారు. ముఖ్యంగా రాష్ట్రంలో పంచాయతీరాజ్ విభాగంలో జూనియర్ ఇంజినీర్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని చట్ట ప్రకారం 6సంవత్సరాలు పని చేసిన కాంట్రాక్టు బేస్డ్ డిప్లమో ఇంజినీర్లను పర్మినెంట్ చేయవలసి ఉందని, 17సంవత్సరాలుగా పర్మినెంట్ చేయకపోవడంతో డిప్లమో ఇంజినీర్లు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇద్దరు నోడల్ అధికారులతో ఇబ్బందులు అలాగే 1279మంది డిగ్రీ ఇంజినీర్లను పర్మినెంట్ చేయవలసి ఉందని, 22సంవత్సరాలుగా వారి ఉద్యోగాలు క్రమబద్ధీకరణకు నోచుకోలేదని వాపోయారు. గతంలో అసిస్టెంట్ ఇంజినీర్లకు ఎగ్జిక్యూటివ్ ఇంజీనీర్లుగా ప్రమోషన్లు ఇచ్చినా అమలు కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంజినీర్ల సమస్యలను పరిష్కరించే నోడల్ అధికారి ఒకరు గతంలోఉండేవారని ప్రస్తుతం ఇద్దరు నోడల్ అధికారులను విభజించి ప్రభుత్వం నియమించడం వల్ల డిగ్రీ, డిప్లమో ఇంజినీర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇంజినీర్లకు నేరుగా వైద్య సదుపాయాలు కల్పించాలని డిప్లమో ఇంజీనీర్లు, డిగ్రీ ఇంజినీర్లకు రూ.4,600 పేస్కేల్ ఇవ్వాలని, పోస్టులు రెగ్యులర్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నట్లు విలేకరుల సమావేశంలో వివరించారు. -
పదోన్నతులు లేకుండానే పదవీ విరమణ
- పీఆర్ డిప్లొమా ఇంజినీర్ల ఆవేదన - సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విన్నపం కర్నూలు(అర్బన్): డిప్లొమా ఇంజినీర్లు ఏఈలుగా సర్వీసులో చేసి అదే పోస్టులో పదవీ విమరణ చేయాల్సిన దౌర్భాగ్యస్థితిలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్ల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కే రవీంద్ర, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే మోహన్, జీఎస్ గౌస్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్‌లోని పీఆర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మొత్తం 489 డిప్యూటీ ఈఈ పోస్టుల్లో 1:3 నిష్పత్తి ప్రకారం డిప్లొమా ఇంజినీర్లు 122 మంది ఉండాలన్నారు. ప్రస్తుతం 48 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. ఈఈ ప్రమోషన్ చానల్‌ను కూడా ప్రభుత్వం ఏకపక్షంగా తొలగించిందన్నారు. 58 ఈఈ పోస్టుల్లో 1:3 నిష్పత్తి ప్రకారం 14 మంది డిప్లొమా ఈఈలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ఒక్కరు కూడా లేక పోవడం దారుణమన్నారు. అనేక మంది ఏఈలకు సీనియారిటీ జాబితా లేదని, సర్వీస్ రెగ్యులరైజేషన్, ప్రొబేషన్, అటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కేళ్ళ వర్తింపు, టీఏ బిల్లులు నెలనెలా రాకపోవడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామన్నారు. విజయవాడలో 40వ వార్షికోత్సవం... ఈ నెల 23వ తేదీన ఉదయం 10 గంటలకు విజయవాడలోని బెంజి సర్కిల్ జ్యోతి కన్వెన్షన్‌లో సంఘం 40వ వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. సమావేశంలో జిల్లా నాయకులు జిలానీబాషా, మాధవ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.