breaking news
Dinner recipes
-
అల్లుళ్లకు 365 రకాల వంటలతో ఆతిథ్యం
నరసాపురం: గోదారోళ్లు అంటేనే మర్యాదలకు మారుపేరు. సంక్రాంతి సందర్భంగా శని, ఆదివారాల్లో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో రెండు కుటుంబాలు 365 రకాల వంటలతో కొత్త, కాబోయే అల్లుళ్లకు విందు భోజనం పెట్టారు. రైస్‌మిల్లర్ ఆచంట గోవింద్, నాగమణి దంపతుల కుమార్తె అత్యం మాధవి, అల్లుడు జ్యువెలరీ వ్యాపారి వెంకటేశ్వరరావు భీమవరంలో నివాసం ఉంటారు. వీరి ఏకైక కుమార్తె కుందవికి ఇటీవల తణుకుకి చెందిన ఎన్నారై తుబ్బలపల్లి సాయికృష్ణతో వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ముందే పెద్ద పండుగ రావడంతో సాయికృష్ణను ఆహ్వానించి 365 రకాల ఐటమ్స్ కొసరి కొసరి వడ్డించారు. రైస్, లెమన్‌రైస్, పులిహోర, దద్దోజనం, క్షీరాన్నం, బిర్యానీ ఇలా అన్నంలోనే 30 రకాలు, 50 రకాల స్వీట్లు, 20 రకాల హాట్స్, 100 రకాల పిండి వంటలు, 35 రకాల కూల్‌డ్రింక్స్, 35 రకాల బిస్కెట్స్, 30 రకాల ఐస్‌క్రీమ్స్, 15 రకాల కేక్‌లు తదితరాలు కలిపి మొత్తం 365 రకాలున్నాయి. ఇదే తరహాలో మరో కుటుంబం నాన్‌వెజ్ ఐటమ్స్‌తో అల్లుడికి విందు భోజనం పెట్టారు. కొత్త అల్లుడు వినయ్‌కుమార్‌కు 365 రకాల వంటలను వడ్డిస్తున్న దృశ్యం కొబ్బరి ఎగుమతుల వ్యాపారి మానే నాగేశ్వరరావు, అనంతలక్ష్మిల కుమార్తె యశోదసాయి, అల్లుడు వినయ్‌కుమార్‌కు 365 రకాల ఐటమ్స్ సిద్ధం చేసి భోజనం పెట్టారు. సొర, కొరమీను, వంజరం, కట్టెపరిగె, పండుగప్ప, సందువా తదితర రకాల చేపల కూరలు వడ్డించారు. చింతకాయ, పచ్చిరొయ్యలు, చింతచిగురు రొయ్యలు, చింతాకు, చిన్నచేపలు తదితర వంటలు వండారు. -
‘గ్రాండ్ ట్రంక్ రోడ్’
ఇదో మెనూ..! అలాగని రోడ్లకు సంబంధించిందో... వాటి వెరైటీల లిస్టో కాదు. పసందైన వంటకాల విందు ఇది. కాబూల్ నుంచి చిట్టగాంగ్ వరకు ఉన్న జీటీ రోడ్డు వెంట ధాబాల్లో వడ్డించే ఫుడ్ వెరైటీస్‌తో బంజారాహిల్స్ బార్బిక్యూ నేషన్ వేడివేడిగా అందిస్తోంది. అందుకు తగ్గట్టుగా... కస్టవుర్లకు రోడ్ సైడ్ కూర్చుని తిన్న ఫీలింగ్ కల్పిస్తోంది. పంజాబీ, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, బెంగాలీ రెసిపీలతో బుధవారం ‘గ్రాండ్ ట్రంక్ రోడ్’ సెలబ్రేషన్స్ ప్రారంభించింది. జింగా పాస్తా, వులాయ్ కర్రీ, అఫ్ఘనీ పులావ్ తదితర 40 రుచులను అందిస్తోంది. జూబ్లీహిల్స్‌లోని బార్బిక్యూ రెస్టారెంట్లో కూడా ఈ నెల 17 వరకు ఈ ‘టేస్ట్’ చూడవచ్చు. - సాక్షి, సిటీ ప్లస్