breaking news
digitimes
-
సముద్ర గర్భంలో దొరికిన ఐఫోన్ పనిచేస్తుందోచ్!
న్యూఢిల్లీ : మనం పొరపాటున స్మార్ట్‌ఫోన్‌ను నీళ్లలో పడేసినా లేదా కింద పడేసినా.. ఇక దాని పని అంతే. ఆ స్మార్ట్‌ఫోన్‌ను ఓ మూలన పడేసి, కొత్తది కొనుక్కోవాల్సిందే. కానీ ఆపిల్ ఐఫోన్ల విషయంలో దాన్నే ఆపాదిస్తే, మనం తప్పులో కాలేసినట్టే. ఆపిల్ ఐఫోన్లు ఫర్ఫార్మెన్స్కు మారు పేరుగా నిలుస్తున్నాయి. తాజాగా ఐఫోన్ 7 ఇదే నిరూపించింది. సముద్ర గర్భంలో నాని నాని ఉన్న ఆపిల్ ఐఫోన్ 7, బయటకి తీస్తే భలే పనిచేస్తుందట. దాని బ్యాటరీ పూర్తిగా నీళ్లలో తడిచిపోయినా కూడా ఇంకా మంచిగా పనిచేస్తూనే ఉందని డిజిటైమ్స్ వెల్లడించింది. అంతేకాక సముద్ర గర్భంలో కూడా ఈ స్మార్ట్‌ఫోన్ సిగ్నల్‌ను కరెక్ట్‌గా అందుకుంటుందని తెలిపింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ కెనడా సందర్శకుడికి చెందిన ఆపిల్ ఐఫోన్ 7 పొరపాటున సముద్రంలోకి పడిపోయింది. ఎంత వెతికినా అతనికి దొరకకపోయే సరికి దానిపై ఆశలు వదిలేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. యూకేకు చెందిన స్కూబా డైవర్ సిరిస్ హార్సీకి ఆ ఫోన్ దొరికింది. ఇంగ్లండ్‌లోని డోర్డల్ డోర్ దగ్గరిలో గల సముద్ర గర్భం నుంచి ఓ వెలుగు రావడం కనిపించింది. అదేమిటా? అని దాని వద్దకు వెళ్లి చూసింది. సముద్ర గర్బంలో వెలుగులు చిందిస్తున్న ఆ వస్తువును చూసి ఆమె షాకైంది. అది ఐఫోన్ 7. టెక్ట్స్ మెసేజ్ రావడంతో, ఆ ఐఫోన్ 7ను వెలుతురును బ్లింక్ అవుతుంది. నీటిలో మునిగి ఉన్న ఆ డివైజ్‌ను హార్సీ బయటకు తీసింది. 48 గంటల పాటు ఆ ఐఫోన్ అక్కడే ఉన్నట్టు తెలిసింది. అంతసేపు పూర్తిగా నీటిలోనే మునిగి ఉన్న 84 శాతం బ్యాటరీ సామర్థ్యంతో ఆ ఫోన్ మంచిగా పనిచేస్తుందని తెలిసింది. అంతేకాక సిగ్నల్స్‌ను కూడా అది కరెక్ట్‌గా పొందుతుంది. హార్సీ తనకు దొరికిన ఐఫోన్ 7 ను తన వద్దనే ఉంచుకోకుండా.. ఆ ఫోన్ పోగొట్టుకున్న కెనడియన్‌కు అందచేసింది. ఈ డివైజ్ వాటర్ రెసిస్టెన్స్‌తో ఐపీ67 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ కేసుతో ఐఫోన్ 7 ఎంత స్ట్రాంట్‌గా పనిచేస్తుందో మరోసారి వెల్లడైంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా దీని పనితీరు అద్భుతమని టెక్ విశ్లేషకులు సైతం అంటున్నారు. -
శాంసంగ్ మడతపెట్టే ఫోన్ల రాక అప్పుడేనట!
స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కుతూ మడతపెట్టే ఫోన్లపై కంపెనీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఇక త్వరలోనే దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఈ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయబోతుందంటూ వార్తలు వచ్చాయి. అయితే శాంసంగ్ మాత్రం ఇంకొంచెం ఆలస్యంగా 2017 చివరి త్రైమాసికంలో మడతపెట్టే తొలి స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుందట. ఈ విషయాన్ని డిజిటైమ్స్ రిపోర్టు చేసింది. అలాగే తొలుత కొంతమొత్తంలోనే ఉత్పత్తి చేపట్టి వినియోగదారుల ముందుకు తీసుకురావాలని యోచిస్తోందని సంబంధిత వర్గాలు చెబుతున్నట్టు డిజిటైమ్స్ పేర్కొంది. ఒకేసారి పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేపట్టడానికి కంపెనీకి వీలుపడటం లేదని, టెక్నికల్ సమస్యల వల్ల ఈ ఫోన్లను చిన్నమొత్తంలోనే తయారుచేయనున్నారని తెలుస్తోంది. 2018 రెండో త్రైమాసికం వరకు పెద్ద మొత్తంలో ఈ మడతపెట్టే డివైజ్‌లను తయారుచేయరని టాక్. చాలా అనువుగా ఉండే అమోలెడ్ డిస్ప్లేతో వీటిని రూపొందించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ దక్షిణ కొరియా దిగ్గజం మడతపెట్టే డివైజ్‌లను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఇప్పటికే పలు రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఈ ఫోన్లపై కంపెనీ కూడా అదే స్థాయిలో హాడ్వర్క్ చేస్తుందట. ముందస్తు రూమర్ల ప్రకారం కంపెనీ విడుదల చేయబోయే మడతపెట్టే డివైజ్ గెలాక్స్ ఎక్స్ అని తెలిసింది. ఈ నెల చివరిలో జరుగబోయే ఎండబ్ల్యూసీ ఈవెంట్లో ఈ ఫోన్ వినియోగదారుల ముందుకు తీసుకొస్తుందని అంచనావేశారు. కానీ ఈవెంట్ దగ్గరపడే కొద్ది గెలాక్సీ ఎక్స్‌ను ఇప్పుడు ప్రవేశపెడతారు, అప్పుడు ప్రవేశపెడతారు అంటూ పలు రిపోర్టులు వస్తున్నాయి. చివరికి శాంసంగ్ మడతపెట్టే డివైజ్‌లు ఈ ఏడాది చివరి త్రైమాసికంలోనే మన ముందుకు రాబోతున్నాయని తెలుస్తోంది.