breaking news
Dhulipalla narendrakumar
-
‘ధూళిపాళ్ల నరేంద్ర చేయని నేరాలు, ఘోరాలు లేవు’
సాక్షి, గుంటూరు: ధూళిపాళ్ల నరేంద్ర చేయని నేరాలు, ఘోరాలు లేవని జీడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక పథకం ప్రకారం సంగం డెయిరీ ఆక్రమించుకున్నాడని దుయ్యబట్టారు. ‘‘జీడీసీసీ బ్యాంకులో రూ.500 కోట్ల అక్రమాలు జరిగాయని ధూళిపాళ్ల నరేంద్ర తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. దమ్ముంటే అక్రమాలను నిరూపించాలని.. నిరూపిస్తే పాలకమండలి మొత్తం రాజీనామా చేస్తామని సీతారామాంజనేయులు సవాల్ విసిరారు. నిరూపించకుంటే సంగం డెయిరీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలన్నారు. చదవండి: పెగాసస్‌పై టీడీపీ ఎందుకు కంగారుపడుతోంది: అంబటి రాంబాబు 2017 నుంచి పథకం ప్రకారం టీడీపీ నేతలు నకిలీ డాక్యుమెంట్లు పెట్టి లోన్లు తీసుకున్నారన్నారు. వారిలో 15 మంది టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. బ్యాంకు రుణాలకు సంబంధించిన డేటా ఇవ్వమని ధూళిపాళ్ల నరేంద్ర చెబుతున్నాడు. ఆధారాలు లేకుండా ఎలా రూ.500 కోట్ల కుంభకోణం జరిగిందని తప్పుడు ప్రచారం ఎలా చేస్తారు?. గతంలో చింతలపూడి సహకార సంఘం సెక్రటరీని ధూళిపాళ్ల వేధించారు. ఆయన వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారని గుర్తు చేశారు. కోవిడ్ టైమ్‌లో డీవీసీ ఆసుపత్రి ద్వారా ధూళిపాళ్ల రూ.కోట్లు సంపాదించారని రాతంశెట్టి సీతారామాంజనేయులు మండిపడ్డారు. -
‘సాక్షి’ డెరైక్టర్లపై కేసులో తదుపరి చర్యలన్నీ నిలుపుదల
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ఏపీ రాజధాని ప్రాంత పరిధిలో అధికారపార్టీ నేతల భూ అక్రమాలపై ‘సాక్షి’ ప్రచురించిన కథనాలు తమ పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయంటూ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా పొన్నూరు పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలిపేసింది. ప్రతివాదులుగా ఉన్న నరేంద్రకుమార్, గుంటూరు జిల్లా పోలీసులకు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిం ది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. టీడీపీ ఎమ్మెల్యే నరేంద్రకుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పొన్నూరు పోలీసులు.. జగతి పబ్లికేషన్స్ డెరైక్టర్లు యర్రంరెడ్డి ఈశ్వర ప్రసాదరెడ్డి, కాల్వ రాజప్రసాదరెడ్డి, పి.వెంకటకృష్ణ ప్రసాద్, ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, ఎడిటర్ వి.మురళి తదితరులపై కేసు నమోదు చేయడం విదితమే. ఈ కేసును కొట్టేయాలని, అప్పటివరకు తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని కోరుతూ ‘సాక్షి’ డెరైక్టర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ మంగళవారం విచారించారు. పిటిషనర్ల తరఫున జి.కళ్యాణి వాదనలు వినిపిస్తూ... వాస్తవాలను నిర్ధారించుకున్నాకనే కథనాల్ని ప్రచురించినట్టు పేర్కొన్నారు. పత్రిక రోజువారీ వ్యాపారాలతో కంపెనీ డెరైక్టర్లకు ఎటువంటి సంబంధం లేదన్నారు. సాక్షి కథనాలకు, దాని డెరైక్టర్లకు ఏ సంబంధం లేదని, ఈ విషయం తెలిసి కూడా పోలీసులు కేసు నమోదు చేశారని, ఇది అధికార దుర్వినియోగమేనని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా కేసు నమోదు చేశారన్నారు. రాజకీయ కక్ష సాధింపుచర్యల్లో భాగంగానే నరేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆమె కోర్టుకు విన్నవించారు. ఈ వాదనలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు.