breaking news
Dharmaj
-
28 నుంచి ధర్మజ్ కార్ప్ ఐపీవో
న్యూఢిల్లీ: ఆగ్రో కెమికల్స్ తయారీ కంపెనీ ‘ధర్మజ్ కార్ప్ గార్డ్’ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ఈ నెల 28 నుంచి మొదలు కానుంది. 30వ తేదీన ఇష్యూ ముగుస్తుంలది. ఒక్కో షేరుకు ధరల శ్రేణిగా రూ.216–237ను ప్రకటించింది. గరిష్ట ధర ప్రకారం చూస్తే ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ.251 కోట్ల వరకు సమీకరించనుంది. రూ.216 కోట్ల విలువ చేసే షేర్లను తాజా జారీ ద్వారా, మరో 14.83 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించనుంది. ఐపీవో రూపంలో కంపెనీకి సమకూరే రూ.216 కోట్లను గుజరాత్‌లోని బరూచ్‌లో తయారీ కేంద్రం ఏర్పాటుకు వినియోగించనుంది. అలాగే, మూలధన అవసరాలకు, రుణాలను చెల్లించేందుకు ఉపయోగించుకోనుంది. పురుగు ముందులు, శిలీంద్ర సంహారిణి రసాయనాలు, సూక్ష్మ ఎరువులు తదితర ఉత్పత్తులను ధర్మజ్ తయారు చేస్తోంది. 25కు పైగా దేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. చదవండి: PM Kisan New Rules: పీఎం కిసాన్‌లో కొత్త రూల్స్.. వాళ్లంతా అనర్హులు, ఈ పథకం వర్తించదు! -
దేశంలోనే ధనిక గ్రామం ధర్మాజ్
వడోదర: గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో ఉన్న ధర్మాజ్ అనే మారుమూల గ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు చేసిన బ్యాంకింగ్ డిపాజిట్లతో అది అత్యంత ధనిక గ్రామంగా అవతరించింది. కేరళ రూ.90 వేల కోట్ల ఎన్ఆర్ఐ డిపాజిట్లతో దేశంలోనే ముందంజలో ఉండగా ధర్మాజ్ గ్రామం ఏకంగా రూ.వెయ్యి కోట్ల డిపాజిట్లతో వార్తల్లోకి ఎక్కింది. ఈ విషయాన్ని వడోదర డివిజన్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆర్.ఎన్. హిర్వే మీడియాకు వెల్లడించారు. ధర్మాజ్‌లో 3 వేల కుటుంబాలు ఉండగా ఆయా కుటుంబాల నుంచి కొందరు అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో స్థిరపడ్డారు. వారు తమ డిపాజిట్లను స్వగ్రామంలో బ్యాంకుల్లో చేయడంతో ధర్మాజ్ ఆర్థికంగా అందరినీ ఆకట్టుకునేలా మారింది.