breaking news
Deportation Decision
-
వలస కార్మికుల మెడపై దేశ బహిష్కరణ కత్తి
నుపూర్ శర్మ బాధ్యతారాహిత్యంగా చేసిన వ్యాఖ్యలు విదేశాల్లో బతుకుతున్న వలస కార్మికులకు కొత్త కష్టాలను తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న వారి భవిష్యత్తును అగమ్యగోచరంలో పడేశాయి. ఇందుకు సంబంధించిన ప్రకంపనలు ముందుగా కువైట్‌లో మొదలయ్యాయి. నుపూర్ శర్మ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దుమారం రేపిన విషయం విదితమే. దీనిపై గల్ఫ్ దేశాధినేతలు తమ అభిప్రాయాలను భారత రాయబారులకు తెలిపారు. ఖతార్ లాంటి దేశాల్లో భారత వస్తువులను నిషేధించాలనే దాక వ్యవహారం వెళ్లింది. ఇంతలో భారత ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. అయితే గల్ఫ్ దేశాలు తమ ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకోవడంలో విఫలం కావడంతో భారత ప్రభుత్వం కూడా దౌత్యపరంగా కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేయడంతో గల్ఫ్ దేశాలు పునరాలోచనలో పడ్డాయి. నుపూర్‌శర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ గల్ఫ్ దేశాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకపోతే ఏమవుతుందో ఏమో అనే భయంతో కొందరు, నుపూర్ వ్యాఖ్యలను నొచ్చుకున్న మరికొందరు వలస కార్మికులు కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ర్యాలీలు చేశారు. నినాదాలు వినిపించారు. ఇప్పుడు ఇలా ధర్నా కార్యక్రమాల్లో పాల్గొన్న వలస కార్మికులను కువైట్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. అక్కడి చట్టాల ప్రకారం వలస కార్మికులకు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు లేదంటూ పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన వలస కార్మికులను వెంటనే గుర్తించి వారి దేశాలకు పంపించి వేస్తామంటూ హుకుం జారీ చేసింది. అంతేకాదు వారు భవిష్యత్తులో కువైట్‌లో పని చేసుకునే అవకాశం ఇవ్వబోమంటూ తేల్చి చెప్పింది. ఈ మేరకు నిరసనలో పాల్గొన్న వలస కార్మికులను గుర్తించే పని మొదలెట్టింది. కువైట్‌లో ఇండియాతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఫిలిప్పీన్ దేశాలకు చెందిన కార్మికులు పని చేస్తున్నారు. అయితే వీరిలో భారతీయులే అధికం. ప్రస్తుతం కువైట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వలస కార్మికుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. అప్పులు చేసి అక్కడికి చేరుకున్న వారిని ఉన్న పళంగా వెనక్కి పంపిస్తే వారి కుటుంబాలు మరింత చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. చదవండి: సౌదీలో దుబ్బాక వాసి మృతి.. మమ్మీ నాన్న రాడా అంటూ.. -
అక్రమ వలసదార్ల అరెస్టులు షురూ
వాషింగ్టన్: దేశంలో వలసదార్లను పెద్ద సంఖ్యలో ఏరివేసేందుకు, వారిని దేశ బహిష్కారం చేసేందుకు అమెరికా సర్వసన్నద్ధమైంది. అక్రమ వలసదార్లను ఆదివారం నుంచి అరెస్టు చేయనున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు. లక్షలాది అక్రమ వలసదార్లను అరెస్టు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. తగిన ఉత్తర్వులతో వారిని దేశ బహిష్కారం చేయనున్నట్టు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ యాక్టింగ్ డైరెక్టర్ మాథ్యూ అల్బెన్స్ తెలిపారు. అరెస్టులు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాబోవని, కేసుల దర్యాప్తును అనుసరించి అధికారులు ఎక్కడికంటే అక్కడికి పోతారని ఆయన చెప్పారు. అరెస్టు చేసిన వారిని వారి వారి దేశాలకు పంపుతామని, నేరాలకు పాల్పడిన వారిని ఇక్కడ లేదా వారి దేశాల్లోని జైళ్లకు పంపుతామని ట్రంప్ ప్రకటించారు. అధికారులు అందిస్తున్న వివరాల ప్రకారం – 2000 మందిని లక్ష్యంగా చేసుకుని సోదాలు నిర్వహించనున్నారు. గతంలో జరిగిన దాడులను బట్టి ఇప్పుడు కనీసం 200 మందిని అరెస్టు చేయవచ్చునని భావిస్తున్నారు. ట్రంప్ సర్కారు నిర్ణయాలు అగ్రరాజ్యంలో తీవ్ర రాజకీయ చర్చకు దారితీశాయి. ప్రభుత్వ చర్యలు అమానవీయమైనవంటూ డెమోక్రాట్లు విమర్శలు చేస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. మధ్య అమెరికా నుంచి ఇంతకు ముందెన్నడూ లేనంత మంది ప్రజలు ఇటీవల యూఎస్ సరిహద్దులకు చేరుకున్న విషయం తెలిసిందే. వీరిలో పలువురు ఇమ్మిగ్రేషన్ కోర్టు కేసులను ఎదుర్కొంటున్నారు. 2016లో బరాక్ ఒబామా హయాంలోను, 2017లో ట్రంప్ హయాంలోను అక్రమ వలసదార్లపై ఇదే తరహా ఆపరేషన్ నిర్వహించారు. -
ఇక టార్గెట్ శశికళ
♦ విలీనం దిశగా వైరి వర్గాలు ♦ శశికళను సాగనంపేందుకు సన్నాహాలు ♦ అనుచరులతో దినకరన్ బిజీ బిజీ ♦ దినకరన్ ఓ 420 అని ఎద్దేవా చేసిన ఎడపాడి ♦ అవసరమైతే అవిశ్వాస తీర్మానం: స్టాలిన్ సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ఇద్దరికీ ఒకరే శత్రువైన పక్షంలో మనమిద్దరం మిత్రులమైనట్లే’ అనే రాజకీయ సూత్రాన్ని సీఎం ఎడపాడి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం అక్షరాల పాటించడం ప్రారంభించారు. అన్నాడీఎంకే (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ను పార్టీ నుంచి గెంటివేసిన ఎడపాడి తరువాతి బాణాన్ని తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళపై ఎక్కుపెట్టారు. విలీనం అంశంలోని ప్రధాన డిమాండ్లలో ఒకటైన శశికళ బహిష్కరణను నెరవేర్చడం ద్వారా పన్నీర్‌సెల్వంతో దోస్తీ కుదుర్చుకునే దిశగా ఎడపాడి పళనిస్వామి పావులు కదుపుతున్నారు. ‘అమ్మ’ లేని అనాథగా మారిన అన్నాడీఎంకేను బీజేపీ అక్కున చేర్చుకుంది. శశికళ కుటుంబమంటే సహించని ప్రధాని మోదీ ముందుగా పన్నీర్‌సెల్వంను చేరదీయగా, ఆ తరువాత ఎడపాడి కూడా చేరువయ్యారు. తమిళనాడులో బీజేపీ బలోపేతానికి అన్నాడీఎంకే మినహా మరే మార్గంలేని బీజేపీ ఎడపాడి, పన్నీర్‌లకు అన్నిరకాల అండదండలు ఇస్తోంది. ఎడపాడి వద్దనున్న ఎమ్మెల్యేల బలం, పన్నీర్ వద్ద ప్రజాబలం ఏకమైతే తమ ఆశయాలు నెరవేరుతాయని బీజేపీ గట్టిగా విశ్వసిస్తోంది. ఇందులో భాగంగానే ఎడపాడి, పన్నీర్ వర్గాల విలీనంపై బీజేపీ పట్టుబడుతోంది. విలీనం అంశం ముందుకు వెనక్కు సాగుతుండగా, అన్నాడీఎంకే (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి హోదాలో దినకరన్ 19 మంది ఎమ్మెల్యేలు సహా 59 మందికి పార్టీ పదవులను పందేరం చేశారు. అంతేగాక కొంతమందిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించారు. దినకరన్ వైఖరి సీఎం ఎడపాడికి మరింత ఆగ్రహం తెప్పించింది. దినకరన్ పదవే ప్రశ్నార్థకంగా మారినవేళ ఆయన నియామకాలు చెల్లవని ఎడపాడి ప్రకటించారు. అంతేగాక శశికళ, దినకరన్‌లను ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శిగా తాము ఆమోదించడం లేదని సీఎం ప్రకటించడంతో విలీన అంశం వేగంగా ముందుకు వెళ్లింది. ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పదవీ ప్రమాణ స్వీకారోత్సవ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం ఎడపాడి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం గురువారం రాత్రి వేర్వేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం విడివిడిగా ప్రధానిని కలుసుకుని శశికళ, దినకరన్‌ల బహిష్కరణ నిర్ణయం తదితర తాజా పరిణామాలను వివరించినట్లు సమాచారం. అంతేగాక విలీన ముహూర్తంపై ఇరువర్గాల నేతలు ఢిల్లీలో చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. విలీనం కాగానే పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి శశికళను బహిష్కరిస్తున్నట్లుగా ఒక తీర్మానాన్ని ఆమోదించాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి చట్టపరమైన చిక్కులు ఏర్పడకుండా ఎడపాడి వర్గీయులు నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా దినకరన్‌ను సీఎం ఎడపాడి 420 అని విమర్శించడంపై పార్టీలో అగ్గిపుట్టింది. 420 అనే పదానికి దినకరన్ అక్షరాల అర్హుడని సీఎం ఎద్దేవా చేశారు. ఇందుకు దినకరన్ తీవ్రంగా స్పందిస్తూ పార్టీని కాపాడుకునేందుకు ఎలాంటి కఠిన నిర్ణయాన్ని తీసుకునేందుకు వెనుకాడనని ఎడపాడిని హెచ్చరించారు. ప్రధాన కార్యదర్శి పదవిపై దీప డిమాండ్: అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితుల నుంచి అన్నాడీఎంకేను చక్కబెట్టేందుకు ప్రధాన కార్యదర్శి పదవికి వెంటనే ఎన్నిక జరపాలని అన్నాడీఎంకే జే దీప అధ్యక్షురాలు దీప శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు ఆమె వినతిపత్రం అందజేశారు. దినకరన్ సన్నాహాలు ఇదిలా ఉండగా, పార్టీ తన చేతుల్లో నుంచి జారిపోకుండా టీటీవీ దినకరన్ తన వంతు ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. తన వెంట నడుస్తున్న 17 మంది ఎమ్మెల్యేలతో శుక్రవారం సమావేశమయ్యారు. ఎడపాడికి వ్యతిరేకంగా దినకరన్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించారు. దినకరన్ బలమేంటో త్వరలో మేలూరులో జరగబోయే సభలో నిరూపిస్తామని సవాల్ చేశారు. అవసరమైతే అవిశ్వాస తీర్మానం: స్టాలిన్ ప్రభుత్వం, అధికార పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ శుక్రవారం పార్టీ జిల్లా ఇన్చార్జి్జలతో శుక్రవారం సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఆసాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నందున అవసరమైతే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు.