breaking news
Dangeti Jahnavi
-
దంగేటి జాహ్నవికి వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి,తాడేపల్లి: అంతరిక్ష యానానికి ఎంపికైన దంగేటి జాహ్నవికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు.ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదిగా ట్వీట్ చేశారు. ‘అంతరిక్ష యానానికి ఎంపికయిన మొదటి భారతీయ యువతి, అందునా ఏపీకి చెందిన యువతి కావటం ఆంధ్రులకు గర్వకారణం. జాహ్నవి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం’ అని ట్వీట్లో పేర్కొన్నారు. Heartiest congratulations to Ms. Jahnavi Dangeti on being selected as an Astronaut Candidate for Titans Space’s ASCAN programme, for a mission slated for launch in 2029. Your brilliance makes every Indian and every Andhrite proud. Wishing you continued success as you inspire many… pic.twitter.com/P1JMDktu5p— YS Jagan Mohan Reddy (@ysjagan) June 24, 2025 -
Dangeti Jahnavi : అంతరిక్షంలోకి ఆంధ్రా అమ్మాయి.. ఎప్పుడంటే?
సాక్షి,అమరావతి: ఆంధ్ర అమ్మాయి దంగేటి జాహ్నవి అరుదైన ఘనతను సాధించారు. 2029లో అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగామిగా ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి 2029లో అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్నారు. జాహ్నవి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి నాసా నిర్వహించే అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందారు.జాహ్నవి అమెరికాలోని టైటాన్స్ ఆర్బిటల్ పోర్ట్ స్పేస్ స్టేషన్‌కు ఎంపికై నాలుగేళ్లలో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టులో భాగంగా అంతరిక్షంలోకి అడుగు పెట్టనున్నారు. పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బీఎటెక్ పూర్తిచేసిన జాహ్నవి ఇంటర్మీడియట్ వరకు తన స్వగ్రామమైన పాల కొల్లులోనే చదువుకున్నారు. ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్, పద్మశ్రీ.. ఉద్యోగ రిత్యా వాళ్లిద్దరూ కువైట్‌లో ఉంటున్నారు. అంతరిక్ష పట్ల అపారమైన ఆసక్తి ఉన్న జాహ్నవి, విద్యార్థులకు సైన్సు, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మాథమేటిక్స్ (STEM) విద్యపై చైతన్యాన్ని కలిగించే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మన దేశంలో ప్రముఖ ఎన్ఐటీల్లో ప్రసంగాలు ఇచ్చారు. అంతేకాకుండా, అనాలోగ్ మిషన్లు, డీప్ సీ డైవింగ్, దీర్ఘకాలిక అంతరిక్ష ప్రయాణాల స్థిరతపై ప్రపంచ సదస్సుల్లోనూ పాల్గొంటూ వచ్చారు.International Astronomical Search Collaboration లో ఆమె కృషి ద్వారా, పాన్-స్టార్స్ టెలిస్కోప్ డేటా ఆధారంగా ఓ ఆస్ట్రాయిడ్‌ను తాత్కాలికంగా గుర్తించారు. తద్వారా స్పేస్ ఐస్లాండ్లో జరిపే జియాలజీ శిక్షణ కోసం ఎంపికైన తొలి భారతీయురాలిగా పేరు సంపాదించారు. నాసా స్పేస్ అప్స్ చాలెంజ్‌లో పీపుల్స్ చాయిస్ అవార్డు, ఇస్రో అందజేసే వరల్డ్ స్పేస్ వీక్ యంగ్ అచీవర్ అవార్డుతో పాటు ఇతర ప్రతిష్టాతకమైన అవార్డులను ఆమె సొంతం చేసుకున్నారు.