breaking news
daggupati rana
-
కుటుంబంలో విషాదం.. పాడె మోసిన హీరో రానా
టాలీవుడ్ హీరో దగ్గుపాటి రానా అమ్మమ్మ రాజేశ్వరీదేవి మృతి చెందారు. తణుకు మాజీ ఎమ్మెల్యే, దివంగత వైటీ రాజా తల్లి, ప్రముఖ పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణరావు చౌదరి భార్య రాజేశ్వరి దేవి అనారోగ్యంతో కన్నుమూశారు. సొంతూరు పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో ఆమె అంత్యక్రియలు జరిగాయి. రానాతో పాటు దగ్గుబాటి సురేష్ కూడా ఆమె అంతిమ యాత్రలో పాల్గొన్నారు. రానాకు రాజేశ్వరీదేవి స్వయానా అమ్మమ్మ కావడంతో పాడె మోశారు. రానా దగ్గుబాటి తల్లి లక్ష్మీ పుట్టింటి ఫ్యామిలీ రాజకీయాలతో పాటు వ్యాపార రంగంలో కూడా ప్రముఖంగా ఉన్నారనే విషయం తెలిసిందే. -
నన్ను ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదు: రానా
బెంగళూరు: టాలీవుడ్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరంటే దగ్గుబాటి రానా పేరు వినిపిస్తుంది. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ విలక్షణ నటుడు పెళ్లి విషయంలో ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తోంది. తన సినిమాల్లోని క్యారెక్టర్లను చూసిన తర్వాత ఏ అమ్మాయీ తనను పెళ్లి చేసుకోదని కామెంట్ చేశాడు. తన నెక్స్ట్ మూవీ బాహుబలి 2 లో తాను పోషించిన విలన్ పాత్రను చూశాక ఏ ఆడపిల్ల తనను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాదేమోనని అభిప్రాయం వ్యక్తం చేశాడు. 'బెంగళూర్ నాటకాల్' మూవీలో నటిస్తున్న రానా ఈ సినిమా ప్రమోషనల్ భాగంగా మీడియాతో మాట్లాడిన ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తను ప్రస్తుతం చాలా సినిమాలకు సైన్ చేశాననీ, కమిట్ అయిన సినిమాలన్నిటినీ పూర్తి చేశాకే పెళ్లి గురించి ఆలోచిస్తానని తేల్చిచెప్పాడు. అయితే తాను పోషిస్తున్న విలన్ పాత్రలను చూస్తే ఎవరికైనా ప్రేమ పుడుతుందా అంటూ జోవియల్ గా కామెంట్ చేశాడు. బాహుబలి సెకండ్ పార్ట్‌లో చాలా క్రూరంగా కనిపించబోతున్నానని పేర్కొన్నాడు. 'తమాషా కోసం చిలిపిగా అన్నాడా... లేక నిజంగానే ఆ అనుమానం పట్టి పీడిస్తోందా' ఇపుడిదే టాలీవుడ్లో హాట్ టాపిక్. మలయాళంలో భారీ విజయం సాధించిన బెంగళూరు డేస్ సినిమాను పీవీపీ సంస్థ తమిళంలో బెంగళూరు నాటకాల్గా రీమేక్ చేస్తోంది. బాబీసింహా, శ్రీదివ్య, సమంత, పార్వతి, రాయ్‌లక్ష్మి, ప్రకాశ్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ మూవీలో రానా మరో ముఖ్యమైన ప్రాతను పోషించాడు. అటు బాహుబలి 2 , ఘాజీ, మల్టీ స్టారర్ మూవీ, మరో తమిళ మూవీలతోపాటు తెలుగులో శేఖర్ కమ్ముల లీడర్ కి సీక్వెల్ గా వస్తున్న లీడర్ 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు రానా. హీరోగా టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన రానా తర్వాత బాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరించాడు. బాలీవుడ్ భామ బిపాషా బసు, హీరోయిన్ త్రిషలతో చాలా సన్నిహిత సంబంధాలున్నాయన్న వార్తలు గుప్పుమన్నాయి. ఏకంగా త్రిషను పెళ్లి చేసుకోబోతున్నాడనే వదంతులు అప్పట్లో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.