breaking news
Cyclone Roanu
-
తుపాను మనల్ని చూసి భయపడింది: చంద్రబాబు
ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలు బాగా వెనకబడ్డాయి ఉద్యోగులంతా త్యాగాలు చేసి జూన్ 27లోగా రావాలి నా భార్య రాకపోయినా నేనొచ్చి పనిచేస్తున్నా ఆమె వారానికి ఒకసారి వచ్చి వెళ్తారు విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హోదా ఉన్న పది రాష్ట్రాలు ఏం సాధించాయని, ఆ పదీ ఇప్పుడు బాగా వెనకబడి ఉన్నాయని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కరువు, తుపానులు సమస్యగా మారాయని చెప్పారు. మొన్న తుపాను వచ్చినా.. మనల్ని చూసి భయపడి వెళ్లిపోయిందని చంద్రబాబు తెలిపారు. నీటి పంపకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు లేవని అన్నారు. తాత్కాలిక సచివాలయం తరలింపునకు అవసరమైతే మరో రూ. 200-300 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. ఉద్యోగులంతా త్యాగాలు చేసి జూన్ 27వ తేదీ లోపు రావాలని పిలుపునిచ్చారు. తన భార్య రాకపోయినా తాను మాత్రం ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నానని తెలిపారు. ఆమెకు వ్యాపారం ఉందని, అందుకే ఆమె హైదరాబాద్‌లో ఉన్నారని.. వారానికి ఒక రోజు విజయవాడ వచ్చి వెళ్తారని అన్నారు. ఇక నియోజకవర్గాల పెంపుపై ఏపీ, తెలంగాణ ఏకాభిప్రాయంతో ఉన్నట్లు బాబు చెప్పారు. ఏపీకి ఎప్పటికీ అవతరణ దినోత్సవాలు ఉండబోవనని, ప్రతియేటా జూన్ 2వ తేదీన నవనిర్మాణ దీక్షలు మాత్రమే నిర్వహిస్తామని ఆయన తెలిపారు. -
నేడు తీరం దాటనున్న తుపాను
- తీవ్ర తుపానుగా మారని ‘రోను’ - నేటి సాయంత్రం బంగ్లాదేశ్‌లో తీరం దాటే అవకాశం సాక్షి, హైదరాబాద్/ విశాఖపట్నం: రాష్ట్రానికి రోను తుపాను ముప్పు తప్పింది. తీవ్ర భయాందోళనలకు గురిచేసిన ఈ తుపాను ప్రశాంతంగానే రాష్ట్రాన్ని దాటింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు ‘రోను’ ఉత్తర కోస్తాలోనే పయనిస్తూ ఒడిశాలోకి ప్రవేశించింది. వాయవ్య బంగాళాఖాతంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో తూర్పు ఈశాన్య దిశగా పయనిస్తూ శుక్రవారం రాత్రి 10 గంటలకు ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శనివారం సాయంత్రానికి బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌కు సమీపంలో ఖేపుపరా, కాక్స్ బజార్ల మధ్య తీరాన్ని దాటనుందని ఐఎండీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. ముందుగా అంచనా వేసినట్టుగా రోను తీవ్ర తుపానుగా బలపడకుండానే తీరాన్ని దాటుతుందని స్పష్టం చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు తప్పినట్టు ప్రకటించింది. రాష్ట్రానికి అన్ని రకాల తుపాను హెచ్చరికలను కూడా ఉపసంహరించింది. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి ‘సాక్షి’కి చెప్పారు. ఉత్తర కోస్తాలో గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లోనూ ప్రస్తుతం ఉన్న నాలుగో నెంబరుకు బదులు రెండవ నెంబరు ప్రమాద హెచ్చరికలను కొనసాగిస్తున్నారు. ఉత్తరకోస్తాలోని మత్స్యకారులు రానున్న 24 గంటల్లో సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని, దక్షిణ కోస్తాలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గడచిన 24 గంటల్లో ఇచ్చాపురం, కళింగపట్నంలలో 15, రణస్థలంలో 14, అమలాపురం, పలాస, అవనిగడ్డల్లో 11, టెక్కలి, మందసల్లో 10, సోంపేటలో 9, విశాఖలో 8 సెం.మీల వర్షపాతం నమోదైంది. మరో 5 రోజులు వర్షాలే.. సాక్షి, హైదరాబాద్: క్యుములోనింబస్ మేఘాల కారణంగా మరో ఐదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. మరోవైపు రామగుండం, ఆదిలాబాద్‌లలో శుక్రవారం అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలు ప్రధాన పట్టణాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రాంతం ఉష్ణోగ్రత రామగుండం 45.2 ఆదిలాబాద్ 44.8 నిజామాబాద్ 43.4 హైదరాబాద్ 38.6


