breaking news
Crore loans
-
మలివిడత మాల్యా ఆస్తుల జప్తుపై ఈడీ దృష్టి
న్యూఢిల్లీ: బ్యాంకులకు రూ.9వేల కోట్ల రుణాలను చెల్లించకుండా, బ్రిటన్‌లో తలదాచుకున్న ప్రముఖ వ్యాపార వేత్త విజయ్‌మాల్యాకు సంబంధించి మరిన్ని ఆస్తులను అటాచ్ చేసే దిశగా ఈడీ తన చర్యలను ముమ్మరం చేసింది. మాల్యాపై విచారణ జరుపుతున్న ఈడీ ఇప్పటికే రూ. 8,041 కోట్ల విలువైన ఆస్తులను మనీ లాండరింగ్ చట్టం కింద అటాచ్ చేసిన విషయం తెలిసిందే. మరోసారి వేల కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసే దిశగా ఈడీ దర్యాప్తు బృందం చర్యలు ముమ్మరం చేసింది. ఇందుకు సంబంధించి ముంబై కోర్టు ఆదేశాలను సైతం పొందింది. ఈ సారి అటాచ్మెంట్ చేసే వాటిలో మాల్యా విదేశీ ఆస్తులు కూడా ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈడీ ఈ నెల 3న రెండో విడత మాల్యాకు సంబంధించి రూ.6,630 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే. కాగా, మాల్యా అరెస్ట్‌కు వారంట్ జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ను కోరిన ఈడీ తాజా అభియోగాలను నమోదు చేసింది. -
చంద్రబాబు వంచనపై పోరు
పాయకరావుపేట : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రెండేళ్లుగా ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబుపై ఈ నెల 8న అన్ని నియోజకవర్గాల్లోని పోలీస్స్టేషన్లలో వైఎస్సార్సీపీ నాయకులు ఫిర్యాదులు చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి చెప్పారు. ఆయన ఇక్కడ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, వేంకటేశ్వరుని సాక్షిగా తిరుపతిలో జరిగిన మహానాడులో చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, రూ.24 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని అబద్ధపు ప్రసంగాలు చేశారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా సాధనలో విఫలమైన చంద్రబాబు ప్రత్యేక హోదా తీసుకువస్తామని మరోసారి చెప్పడం హాస్యాస్పందంగా ఉందన్నారు. ప్రత్యేక రైల్వే జోన్ కోసం రైల్వే శాఖా మంత్రి సురేష్ ప్రభును అడకపోగా, కేంద్ర ఇవ్వలేదని బీదరుపులు అరుస్తున్నారన్నారు. పోలవరం ఎలా పూర్తిచేస్తారు? పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.700 కోట్లు కేటాయిస్తే కేవలం 15 శాతం పనులు పూర్తయ్యాయని, నిధులు లేకుండా 2018 కల్లా పోలవరం పూర్తి చేస్తామని ఎలా ప్రకటనలు చేస్తున్నారని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణంలో కూడా ఆదే తరహలో ప్రజలను మోసం చేస్తున్నారని, చంద్రబాబు మోసపూరిత ప్రకటనల వల్లే కేంద్రం నిధులు విడుదల చేయడం లేదన్నారు. కేంద్రం విడుదల చేసిన నిధులకు, చంద్రబాబు చేసిన ఖర్చుకు లెక్కలు సరిపోకపోవడంతో బీజేపీ ప్రభుత్వం చంద్రబాబును నమ్మడం లేదన్నారు. పెట్టుబడులు తేవడంలో సీఎం విఫలం పరిశ్రమలకు కొత్తగా రూ.6.5 లక్షల కోట్లతో పెట్టుబడులకు అగ్రిమెంట్లు కుదుర్చుకుంటున్నట్లు ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటించినా, ఇప్పటివరకు కనీసం ఒక్క కంపెనీ కూడా ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. ఇసుక, మట్టి, నీరు- చెట్టు, సీసీ రోడ్ల నిర్మాణాల్లో చాలా అక్రమాలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో రూ.ఐదు లక్షల కోట్లు దోచుకునేందుకు చంద్రబాబు ప్రణాళికలు వేశారని ఆరోపించారు. నయవంచన దీక్ష రెండేళ్లలో ఎంతో ప్రగ తి సాధించామని చెప్పుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నవనిర్మాణ దీక్ష.. నయవంచన దీక్ష అని ఎద్దేవా చేశారు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ నయ వంచనకు పాల్పడుతున్నారానని దుయ్యబట్టారు. చంద్రబాబు రెండేళ్లగా చేస్తున్న మోసాలపై ఈ నెల 8న అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు చంద్రబాబుపై 420 కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులు చేయనున్నట్లు తెలిపారు. రైతు భరోసా యాత్రకు విశేష స్పందన అనంతపురంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్రకు విశేష స్పందన వచ్చిందని ప్రసాదరెడ్డి చెప్పారు. అన్ని వర్గాల ప్రజల నీరాజనం పట్టారన్నారు. విలేకరుల సమావేశంలో జెడ్పీ ఫ్లోర్ లీడర్ చిక్కాల రామారావు, మండల పార్టీ అధ్యక్షుడు ధనిశెట్టి బాబురావు, పార్టీ నాయకులు ఆడారి ప్రసాద్, బి.వి.రమణ తదితరులు పాల్గొన్నారు. -
ఇన్ని కోట్ల రుణాలు ఇస్తారా?.. నాకు తెల్వదే!
ఎమ్మెల్యే బాబూమోహన్ జోగిపేట: వామ్మో రూ.29 కోట్లు మాఫీ అయ్యాయా.. నా నియోజకవర్గంలో రూ.79 కోట్లు రుణాలిచ్చారా? అంటూ మెదక్ జిల్లా అందోలు ఎమ్మెల్యే బాబూమోహన్ ఆశ్చర్యా న్ని వ్యక్తం చేశారు. శుక్రవారం జోగిపేటలో జరిగిన రుణమాఫీపత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గం లోని 8సొసైటీల పరిధిలో రుణమాఫీ, రుణాల మంజూరు వివరాలను డీసీసీబీ సీఈవో శివకోటేశ్వరరావు వివరించగా ఎమ్మె ల్యే పైవిధంగా స్పందించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు అక్కడు న్నవారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.