breaking news
crane collapses
-
ఆలయ ఉత్సవాల్లో విషాదం.. క్రేన్ కుప్పకూలి నలుగురి మృతి
సాక్షి, చెన్నై: తమిళనాడులో విషాదం జరిగింది. అరక్కోణం సమీపంలో నిర్వహించిన ఓ ఆలయ ఉత్సవాల్లో భక్తులపై క్రేన్ కూలడంతో నలుగురు మత్యువాత పడ్డారు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. రాణిపేట జిల్లా నెమిలిలోని కిలివీడి గ్రామంలో ఆదివారం రాత్రి 8.15 గంటలకు ఈ ఘటన వెలుగు చూసింది. వివరాలు.. మాండియమ్మన్ దేవాలయంలో గత రాత్రి ద్రౌపది అమ్మన్ ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి 1500 మందికి పైగా భక్తులు తరలివచ్చారు. నెమిలికి చెందిన 50 మంది పోలీసులు మోహరించారు. సాధారణంగా సంక్రాంతి(పొంగల్) తరువాత ఈ పండుగను జరుపుకుంటారు. ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన మైలేరు ఉత్సవాల్లో భాగంగా స్థానిక గ్రామానికి చెందిన వారు క్రేన్‌పై దేవతా విగ్రహాలను ఊరేగించారు. భక్తులు అందిస్తున్న పూలమాలలను అమ్మవారికి అలంకరించేందుకు 25 అడుగుల ఎత్తైన క్రేన్‌పై ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు. అయితే క్రేన్‌పై బరువు ఎక్కువవడటంతో ముందు భాగం ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. దీంతో భక్తులపై క్రేన్ పడిపోయింది. క్రేన్‌పై నున్న ముగ్గురు వ్యక్తులు కిందపడి అక్కడిక్కడే మరణించారు. అనూహ్య ఘటనతో ప్రజలు భయాందోళనలతో పరుగలు తీయడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఓ బాలికతో సహా తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అరక్కోణంలోని ప్రభుత్వ తాలూకా ఆసుపత్రికి, పొన్నైలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. మరోవైపు గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించిన భయంకర దృశ్యాలు అక్కడ ఓ వ్యక్తి తీసిన ఫోన్లో రికార్డయ్యాయి. ఇందులో క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రమాదంలో మరణించిన బాధితులను కే ముత్తుకుమార్(39), ఎస్ భూపాలన్(4), బి జ్యోతి బాబుఉ(17)గా గుర్తించారు. ఇక ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. క్రేన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. #TamilNadu | 4 people died & 9 others were injured after a #cranecollapsed during a temple festival event in #Keelveethi in #Arakkonam. #BREAKING #craneaccident #arakkonam #Accident #Temple #Death #India | #Crane | #Accident | #Dead | #Injury | #TN | #TempleFestival | pic.twitter.com/iKCjaw7OFV — Harish Deshmukh (@DeshmukhHarish9) January 23, 2023 -
చిగురుటాకులా వణికిన భారీ క్రేన్
కెనడా: ధోరియా తుపాను కెనడాలో భారీ విధ్వంసాన్ని సృష్టించింది. శనివారం అట్లాంటిక్ సముద్ర తీరంలో ప్రవేశించిన ఈ తుపాను విజృంభించి అతలాకుతలం చేసింది. పెనుగాలులు వీయడంతో చెట్లు విరిగిపోగా, విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు చీకట్లోనే బిక్కుబిక్కుమంటు గడిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్ర గాలుల ధాటికి తట్టుకోలేక కుప్పకూలిన క్రేన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్థు భవనంపై భారీ క్రేన్ కుప్పకూలిపోయింది. దీంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తుపాను సృష్టించిన బీభత్సం వల్ల భారీ క్రేన్ కూలిపోవటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ భయోత్పాత వీడియోను ఇప్పటివరకు లక్షల మందికి పైగా వీక్షించగా పలువురు వారి అభిప్రాయలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. క్రేన్.. గాలికి చిగురుటాకులా వణికిపోయేందేంటని కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. క్రేన్ పడిపోలేదని భవనాన్ని రక్షిస్తోందని మరికొందరు కామెంట్ చేశారు. #HurricaneDorian makes landfall in the east of #Canada of a crane fell on a building under construction in the city of Halifax. pic.twitter.com/Q8D2cxoGMn — Joint Cyclone Center (@JointCyclone) September 7, 2019 -
బిహార్ లో క్రేన్ కూలి ఏడుగురి దుర్మరణం
అరా-చాప్రా: అరా, చాప్రా జిల్లాలను అనుసంధానం చేస్తూ బిహార్‌లో గంగా నది పై నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. బ్రిడ్జ్ పనులకు ఉపయోగిస్తున్న క్రేన్ సోమవారం కుప్ప కూలింది. ఈ దుర్ఘటనలో అక్కడ పని చేస్తున్న ఏడుగురు మృతి చెందగా, మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.