చిగురుటాకులా వణికిన భారీ క్రేన్‌ | Huge Crane Collapses By Dorian Hurricane In Canada | Sakshi
Sakshi News home page

కెనడాలో తుపాను బీభత్సం.. కుప్పకూలిన క్రేన్‌

Sep 9 2019 3:05 PM | Updated on Sep 9 2019 3:44 PM

Huge Crane Collapses By Dorian Hurricane In Canada - Sakshi

కెనడా: ధోరియా తుపాను కెనడాలో భారీ విధ్వంసాన్ని సృష్టించింది. శనివారం అట్లాంటిక్‌ సముద్ర తీరంలో ప్రవేశించిన ఈ తుపాను విజృంభించి అతలాకుతలం చేసింది. పెనుగాలులు వీయడంతో చెట్లు విరిగిపోగా, విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు చీకట్లోనే బిక్కుబిక్కుమంటు గడిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్ర గాలుల ధాటికి తట్టుకోలేక కుప్పకూలిన క్రేన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్థు భవనంపై భారీ క్రేన్‌ కుప్పకూలిపోయింది. దీంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

తుపాను సృష్టించిన బీభత్సం వల్ల భారీ క్రేన్‌ కూలిపోవటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ భయోత్పాత వీడియోను ఇప్పటివరకు లక్షల మందికి పైగా వీక్షించగా పలువురు వారి అభిప్రాయలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. క్రేన్‌.. గాలికి చిగురుటాకులా వణికిపోయేందేంటని కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. క్రేన్‌ పడిపోలేదని భవనాన్ని రక్షిస్తోందని మరికొందరు కామెంట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement