బిహార్ లో క్రేన్ కూలి ఏడుగురి దుర్మరణం | 7 dead, many feared trapped after a crane collapses in Bihar | Sakshi
Sakshi News home page

బిహార్ లో క్రేన్ కూలి ఏడుగురి దుర్మరణం

Sep 14 2015 3:18 PM | Updated on Sep 3 2017 9:24 AM

అరా, చాప్రా జిల్లాలను అనుసంధానం చేస్తూ బిహార్లో గంగా నది పై నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది.

అరా-చాప్రా: అరా, చాప్రా జిల్లాలను అనుసంధానం చేస్తూ బిహార్లో గంగా నది పై నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. బ్రిడ్జ్ పనులకు ఉపయోగిస్తున్న క్రేన్ సోమవారం కుప్ప కూలింది. ఈ దుర్ఘటనలో అక్కడ పని చేస్తున్న ఏడుగురు మృతి చెందగా, మరికొంత మందికి  తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement