breaking news
CPM Government
-
శబరిమల వివాదం : కేరళ సర్కార్ యూటర్న్
తిరువనంతపురం : శబరిమల వివాదంపై కేరళలో పాలక వామపక్ష ప్రభుత్వం స్వరం మారింది. లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీకి ఓట్ల శాతం పెరగడంతో సీపీఎం నేతృత్వంలోని ప్రభుత్వం శబరిమల ఆలయ వివాదంపై మెతక వైఖరి తీసుకున్నట్టు వెల్లడవుతోంది. శబరిమల ఆలయ సంప్రదాయాలను పరిరక్షించేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని కేరళ దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్ కోరారు. పది నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలు, బాలికలకు శబరిమల ఆలయంలోకి అనుమతించరాదన్నది ఆలయ సంప్రదాయంగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలనూ అనుమతించాలన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కేరళ వామపక్ష ప్రభుత్వం వ్యవహరించింది. మరోవైపు సుప్రీం ఉత్తర్వులు ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని బీజేపీ, ఆరెస్సెస్ సహా హిందూ సంస్ధలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగాయి. ఈ ఆందోళనల ఊతంతో బీజేపీ వామపక్ష ప్రాబల్య కేరళలో ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో గణనీయంగా ఓట్లను కొల్లగొట్టడం మారిన ప్రభుత్వ వైఖరికి అద్దంపడుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, కేంద్రం శబరిమల ఆలయ సంప్రదాయాలను కాపాడుతూ చట్టం చేసేందుకు కొంత సమయం పడితే ఈ లోగా ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని కేరళ దేవాదాయ మంత్రి కోరారు. -
‘ప్రభుత్వానికి పోయేకాలం దగ్గర పడింది’
ఉరవకొండ: ప్రజా సవుస్యలను గాలికొదిలి పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వుధు అన్నారు. స్థానిక క్లాక్‌టవర్ వద్ద రెండు రోజులు నిర్వహించే సీసీఎం జిల్లా ప్లీనరీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అంతకుముందు ఆర్టీసీ డిపో నుంచి పార్టీ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ మండల కార్యదర్శి రంగారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సవూవేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వుధు, కేంద్ర కమిటీ సభ్యురాలు పుణ్యవతి మాట్లాడారు. జిల్లాకు ప్రధానమైన హంద్రీ నీవా ప్రాజెక్టును పూర్తి చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. కేవలం ప్రధాన కాలువ పనులు పూర్తి చేసి నీటిని కుప్పంకు తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నాడన్నారు. కాలువ డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి అరుుతే ఉరవకొండ నియోజకవర్గంలోనే 80 వేల ఎకరాలకు, జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఇలాంటి ప్రాజెక్టుకు బడ్జెట్లో అరకొరగా నిధులు కేటాయించడం దారుణమన్నారు. జిల్లా కార్యదర్శి రాంభూపాల్ వూట్లాడుతూ టీడీపీ అధికారం చేపట్టిన రెండేళ్లలో 165 వుంది రైతులు, 42 వుంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఈ పాపం చంద్రబాబుదేనన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సీపీఎం రాయులసీమ కార్యదర్శి ఓబులు వూట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో దౌర్జన్యకాండ అధికమైందన్నారు. సవూవేశాల్లో వూజీ ఎమ్మెల్యే గఫూర్, జిల్లా నాయుకులు నల్లప్ప, కొండారెడ్డి, పోలా రావూంజినేయుులు, ప్రసన్న పాల్గొన్నారు.