breaking news
Coromandel train
-
వందేభారత్ పరుగులు.. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లోకోపైలట్ల నుంచి వాంగ్మూలం
భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ స్టేషన్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన మార్గంలో ప్రభావితమైన రైలు రవాణా సేవలు పునః ప్రారంభించారు. ఈ ప్రక్రియలో అనుబంధ యంత్రాంగాలు అవిశ్రాంతంగా కృషి చేసి స్వల్ప వ్యవధిలో సహాయక, పునరుద్ధరణ చర్యలు పూర్తి చేయడం సర్వత్రా అభినందనలు అందుకుంటున్నాయి. ఈ ప్రమాదం పట్ల నిష్పక్షపాత విచారణకు రైల్వేశాఖ నిర్ణయించింది. మరోవైపు నిబంధనల మేరకు ఆగ్నేయ సర్కిల్ రైల్వే భద్రత కమిషనర్(సీఆర్ఎస్) బహనాగా ప్రమాద ప్రాంతాన్ని సోమవారం సందర్శించారు. మూడు రోజుల తర్వాత రైల్వే భద్రత కమిషనర్ శైలేష్‌కుమార్ పాఠక్ కారణాన్ని తెలుసుకోవడానికి స్వతంత్ర దర్యాప్తులో భాగంగా పరిశీలించారు. రైల్వేస్టేషన్ సిగ్నల్, కంట్రోల్ రూమ్‌ను సందర్శించి, అక్కడి ఉన్నతాధికారులతో మాట్లాడారు. స్వతంత్ర విచారణ నివేదిక ఆధారంగా చట్టబద్ధమైన దర్యాప్తు ఫలితాలు అందుబాటులోకి వస్తాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే ఘటనపై రైల్వేశాఖ సీబీఐ విచారణ కోరిన నేపథ్యంలో స్పష్టమైన మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ఉచిత బస్సు ప్రయాణం.. బహనాగా రైలు ప్రమాదం కారణంగా రైలు సేవలకు అంతరాయం ఏర్పడిన దృష్ట్యా కోల్‌కతాకు వెళ్లాలనుకునే ప్రజలకు ఒడిశా ఉచిత బస్సు సేవలను అందిస్తోంది. పూరీ నుంచి 20 బస్సులు, భువనేశ్వర్ నుంచి 23, కటక్ నుంచి 16 బస్సులు ఆదివారం రాత్రి 11.30 గంటలకు కోల్‌కతాకు బయలుదేరాయి. భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఆరోగ్యశాఖ మృతదేహంతో బంధువులను రవాణా చేయడానికి ఏర్పాట్లు చేసింది. ఈ సన్నాహాల కోసం 58 అంబులెన్స్, డీబీసీ వాహనాలను మొహరించారు. అలాగే బహనాగా రైలు దుర్ఘటన ప్రభావంతో పూరీ, భువనేశ్వర్, కటక్ నుంచి కోల్‌కతాకు ప్రయాణించే ప్రజలకు అత్యవసర సహాయాన్ని అందించేందుకు ఒడిశా స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(ఓఎస్ఆర్టీసీ) కొన్ని మార్గాల్లో బస్సు సేవలను రద్దు చేసింది. రైల్వేమంత్రి ఉత్సాహం.. ప్రమాదంతో బహనాగా బజార్ స్టేషన్లో చెల్లాచెదురుగా పడి ఉన్న రైలు కోచ్‌లను పూర్తిగా తొలగించి, పట్టాలను పునర్నిర్మించారు. రైళ్ల రవాణాకు పటిష్టత నిర్థారించిన మేరకు రాకపోకలకు అనుమతించారు. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించడం విశేషం. రైలు ప్రమాదం జరిగిన 51గంటల అనంతరం ప్రభావిత మార్గంలో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఘోరమైన దుర్ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన మంత్రి.. అమాంతంగా రంగంలోకి దిగారు. పట్టాల పునర్నిర్మాణం, పటిష్టతతో తొలుత నడిచిన గూడ్స్ రైలు సిబ్బందికి చేయి ఊపుతూ, సురక్షితమైన ప్రయాణం కోసం ఘటనా స్థలంలో ప్రార్థించారు. వైజాగ్ ఓడరేవు నుంచి రూర్కెలా స్టీల్‌ప్లాంట్‌కు బొగ్గుతో కూడిన గూడ్స్‌రైలు ఆదివారం రాత్రి 10.40 గంటలకు తొలుత పట్టాలెక్కి పరుగులు తీసింది. ఆచూకీ తెలియని మృతదేహాల తరలింపు అగమ్య గోచరంగా పరిణమిస్తోంది. ఈ విపత్కర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు యంత్రాంగం ఆచితూచి అడుగులు వేస్తోంది. శక్తివంతమైన సాంకేతిక కంటైనర్లను అందుబాటులోకి తెచ్చేందుకు యోచిస్తోంది. ఈ మేరకు పారాదీప్ పోర్టు వర్గాలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. స్థానిక ఎయిమ్స్ వంటి ప్రముఖ ఆరోగ్యసేవా కేంద్రాల్లో కూడ మృతదేహాలు దీర్ఘకాలం తాజాగా ఉంచే సౌకర్యాలు అందుబాటులో లేనందున ఈ పరిస్థితి తలెత్తింది. పారాదీప్ నుంచి 5శక్తివంతమైన కంటైనర్లను తీసుకు వచ్చి, స్థానిక ఎయిమ్స్ ప్రాంగణంలో తాత్కాలికంగా అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక్కో కంటైనర్‌లో 40 నుంచి 50 వరకు మృతదేహాలను భద్ర పరిచేందుకు వీలఅవుతుంది. వీటిలో 2నెలల వరకు మృతదేహాలు తాజాగా ఉంటాయని భావిస్తున్నారు. 2 దశాబ్దాల విపత్తు నిర్వహణ అనుభవంతో రాష్ట్రప్రభుత్వం మరో మైలురాయిని ఆవిష్కరించే దిశలో అడుగులు వేయడం ప్రధానంగా చెప్పవచ్చు. రాత్రికి రాత్రి స్థానికులు గాడాంధకార చీకటిలో సెల్ఫోన్ల కాంతిలో బాధితులను హుటాహుటిన రక్షించేందుకు ప్రత్యక్షంగా రంగంలోకి దిగిన తొలి సహాయక బృందంగా నిలవడం దీనికి తార్కాణం. సత్వర చికిత్స కోసం రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా యువత ముందుకు రావడం మానవీయతకు అద్దం పట్టింది. వీరి సత్వర సహాయక చర్యలే సమారు 1,200మంది గాయపడిన ప్రయాణికుల ప్రాణాలను రక్షించగలదని పరిశ్రమల శాఖ కార్యదర్శి హేమంత్ శర్మ ప్రశంసించారు. గుర్తింపే పెను సవాల్..! కోరమండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన తదనంతర కార్యాచరణ పెను సవాల్‌గా మారింది. పునరుద్ధరణ, పునర్నిర్మాణ పనులు 1, 2 రోజల్లో పూర్తిస్థాయిలో పూర్తికావడం ఖాయం. అయితే సహాయక చర్యలు పూర్తయినట్లు రైల్వేవర్గాలు చేస్తున్న ప్రకటనలు వాస్తవ దూరంగా ఉన్నాయి. బాధితులు, మృతుల సంఖ్య ఖరారు చేయడంలో అటు రైల్వే, ఇటు రాష్ట్రప్రభుత్వం అనుక్షణం మార్పుచేర్పులు చేస్తునే ఉంది. గుట్టలుగా పడి ఉన్న మృతదేహాల్లో సజీవంగా ఉన్న బాధిత యువకుడిని అతని తండ్రి గుర్తించాడనే వార్త దీనికి తార్కాణంగా చెప్పవచ్చు. మరోవైపు మృతులను గుర్తించడంలో బంధువర్గాలు తల్లడిల్లుతున్నారు. ఒకే మృతదేహానికి ఇద్దరు, ముగ్గురు బంధువులు తమదిగా పేర్కొంటూ ముందుకు వస్తున్న విచారకర పరిస్థితులు తలెత్తుతున్నట్లు సమాచారం. ఇటువంటి సందిగ్ధత తలెత్తిన పరిస్థితుల్లో ఆచూకీ లభించని మృతదేహాలుగా పరిగణించి యంత్రాంగం ఊగిసలాడిస్తోంది. మృతదేహాలను అయిన వారికి అప్పగించడంలో అత్యంత జాగరూకత ప్రదర్శిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడం అనివార్యమయ్యే అవకాశం ఉంటుందని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ విజయ్‌అమృత కులంగా తెలిపారు. ఇప్పటి వరకు 170 మృతదేహాలను గుర్తించగా, దాదాపు 50కి పైగా ఆచూకీ తేలనవిగా ఉన్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్ జెనా స్పష్టం చేశారు. నిర్ణీత ప్రక్రియ అనంతరం గమ్యస్థానానికి రవాణా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రప్రభుత్వ ఖర్చులతో పలు ప్రాంతాల్లో గమ్యస్థానం వరకు బంధువర్గాలతో మృతదేహాలను వాహనాలు ఇతరేతర అనుకూల రవాణా మాధ్యమాల్లో ఉచితంగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాలను వివిధ రాష్ట్రాలకు తరలించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరణ ధ్రువీకరణ పత్రాలు త్వరలో కుటుంబాలకు ఎలక్ట్రానిక్ లేదా పోస్ట్ ద్వారా పంపించనున్నట్లు వివరించారు. వందేభారత్ పరుగులు.. గూడ్సు రైలు రవాణాతో పునరుద్ధరణ పటిష్టత ఖరారు కావడంతో ప్రయాణికుల రైళ్ల రవాణాకు అనుమతించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులతో కూడిన పూరీ ఎక్స్‌ప్రెస్(12837)ను తొలుత నడిపించారు. పునరుద్ధరించిన ట్రాక్‌లపై సోమవారం ఉదయం 9.30 గంటలకు హౌరా–పూరీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ బహనాగా బజార్ స్టేషన్‌ను సురక్షితంగా దాటింది. ఘటనా స్థలంలో మొదటి సెమీ హైస్పీడ్ రైలు ప్రయాణిస్తున్నప్పుడు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రత్యక్షంగా హాజరై, చేతులుపుతూ లోకోపైలట్లను ఉత్సాహ పరిచారని అధికారులు తెలిపారు. అలాగే ఈ మార్గంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు రవాణా పునరుద్ధరించారు. 28 రైళ్లు ఇప్పటికే అప్ అండ్ డౌన్ లైన్లను దాటాయి. నియంత్రిత వేగంతో ఈ మార్గంలో ప్రయాణికుల రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వేవర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు సోమవారం 2 ప్రయాణికుల రైలుసేవలను రద్దు చేసినట్లు ప్రకటించారు. వీటిలో పూరీ–పాట్నా(18449) బైద్యనాథం ఎక్స్‌ప్రెస్, ఖుర్దారోడ్–ఖరగ్‌పూర్(18022) ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. -
పట్టాలెక్కిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్
సాక్షి, చైన్నె: చైన్నె నుంచి షాలిమర్ వైపుగా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రెండురోజుల అనంతరం పట్టాలెక్కింది. ఈ రైలు మంగళవారం షాలిమర్‌కు చేరుకోనుంది. వివరాలు.. ఒడిశా బాలసోర్ వద్ద శుక్రవారం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు, హౌరా ఎక్స్‌ప్రెస్‌లు ఢీకొన్న దుర్గటనతో చైన్నె నుంచి అనేక రైళ్ల సేవలు రద్దు చేశారు. ఈ ప్రమాదంలో తమిళులు పెద్దసంఖ్యలో చిక్కుకున్నట్టుగా వచ్చిన సమాచారంతో సహాయక చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో తమిళులు ఎవరూ మరణించలేదు. స్వల్పగాయాలతో బయట పడ్డ వాళ్లే అధికం. అందరూ సురక్షితంగా రాష్ట్రానికి వచ్చేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఒడిశాలో ప్రమాదం జరిగిన ప్రదేశంలో రైల్వే ట్రాక్‌ను పునరుద్ధరించడంతో మళ్లీ రైళ్ల సేవలపై అధికారులు దృష్టి పెట్టారు. దీంతో చైన్నె నుంచి ఉత్తరాది రాష్ట్రాల వైపుగా వెళ్లే పలు రైళ్లు సేవలను సోమవారం పునరుద్ధరించారు. అలాగే రెండురోజులుగా పూర్తిగా నిలుపుదల చేసిన చైన్నె – షాలిమర్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ను మళ్లీ ప్రారంభించారు. ముందుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు రైలు బయలు దేరే సమాచారాన్ని మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా పంపించారు. దీంతో ఈ రైలు సోమవారం ఉదయం చైన్నె ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి 10.45 గంటలకు బయలు దేరింది. ఈ రైలు విజయవాడ, రాజమండ్రి, విశాఖ పట్నం మీదుగా బాలాసోర్ వైపుగా కోలకతాలోని షాలిమర్‌కు మంగళవారం ఉదయం చేరుకోనుంది. -
హాల్ట్ ఇచ్చినట్టే ఇచ్చి...
‘గూడెం’లో కోరమాండల్, స్వర్ణజయంతి హాల్ట్ రద్దుకు నిర్ణయం తాడేపల్లిగూడెంలో కోరమాండల్, స్వర్ణజయంతిరైళ్ల హాల్ట్ రద్దుకు నిర్ణయం హాల్ట్ రద్దు జాబితాలో గరీబ్థ్,్ర ఇతర రైళ్లు ఆదరణ, ఆదాయం లేకపోవడం వల్లేనని అధికారుల వెల్లడి తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్లో ఇటీవల ఇచ్చిన పలు సూపర్‌ఫాస్ట్ రైళ్ల హాల్ట్లను రైల్వే అధికారులు రద్దు చేయనున్నారు. ఈ నెల 25 నుంచి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ హాల్టు రద్దు కానుండగా జూన్ 8 నుంచి స్వర్ణజయం తి హాల్టు రద్దు జాబితాలో చేర్చారు. ప్రయోగాత్మకంగా ట్రయల్ బేసిస్‌తో నడిపిన ఈ రైళ్లకు తగినంతగా ఆదా యం లేకపోవడం, ప్రయాణికులు ఎక్కకపోవడం కారణంగా రద్దు చేస్తున్నట్టు ఇప్పటికే రైల్వే ఉన్నతాధికారుల నుంచి స్థానిక అధికారులకు సమాచారం అం దింది. ఈ రెండు రైళ్లు కాకుండా ఇటీవల హాల్టులు ఇచ్చిన మరో రెండు రైళ్లను కూడా రద్దు చేయనున్నట్టు సమాచారం. హాల్ట్ కోసం ఉద్యమించిన పట్టణ ప్రజలు సూపర్‌ఫాస్ట్ రైళ్లను తాడేపల్లిగూడెం స్టేషన్లో హాల్ట్ ఇవ్వాలని పట్టణ ప్రజలు కొన్నేళ్లుగా ఉద్యమం సాగించారు. ప్రజల ఉద్యమానికి తలొగ్గిన ప్రజాప్రతినిధులు ఎట్టకేలకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు సాగించి గూడెంలో పలు రైళ్లకు హాల్ట్ సౌకర్యం కల్పించారు. కోరమాండల్ రైలు ప్రవేశపెట్టిన తర్వాత 35 సంవత్సరాల అనంతరం తొలి అదనపు హాల్టును తాడేపల్లిగూడెంలో ఇచ్చారు. ఈ రైలుకు ఇక్కడ హాల్టు ఇచ్చినప్పటికీ 500 కిలోమీటర్ల పైబడి ప్రయాణానికి మాత్రమే టికెట్లు ఇచ్చేవారు. ఈ దూరం లోపు ప్రయాణించే వారికి టికెట్లు ఇచ్చే వీలు లేదు. ఈ నిబంధన ప్రయాణికులకు ఇబ్బందిగా మారడంతో కోరమాండల్ రైలుకు గూడెంలో ఆదరణ కరువవడంతో రైల్వేకు ఆశించినంతగా ఆదాయం రాలేదు. దీంతో ఈ నెల 25 నుంచి హాల్ట్‌ను రద్దు చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్‌కు కూడా ఆదరణ పెద్దగా లేకపోవడం, ఆదాయం రాకపోవడంతో రద్దు కానుంది. గరీబ్థ్ ్రరైలు కూడా రద్దయ్యే అవకాశాలున్నట్టు సమాచారం. ఈ రైలుకు విశాఖ రూట్లో మాత్రమే ఆదాయం రావడం, సికింద్రాబాద్ రూట్లో ఆదాయం లేకపోవడంతో రద్దు జాబితాలో ఈ రైలునూ చేర్చారు. అమరావతి, సంత్రాగచ్చి, యశ్వంత్‌పూర్, లోకమాన్య తిలక్ సూపర్ ఫాస్ట్ రైళ్లలో మరోదానికి కూడా హాల్ట్ రద్దు కానుందని తెలిసింది. రద్దు జాబితాలో చేరిన రైళ్లను పరిరక్షించుకుని ఇక్కడ ఆగేలా చేసుకోవాలంటే ప్రజలు మరోసారి ఉద్యమించాల్సి ఉంది. మరో ఆరునెలల కాలం ఈ రైళ్ల హాల్టులను పొడిగించేలా ఒప్పించాల్సి ఉంటుంది.