ధర్మవరంలో తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం
అనంతపురం: తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యాలకు అంతులేకుండా పోతోంది. బుధవారం అనంతపురం జిల్లాలోని ధర్మవరం రైల్వేస్టేషన్లో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. రైల్వే విశ్రాంతి గదుల నిర్మాణ పనులను తెలుగు తమ్ముళ్లు అడ్డుకున్నారు.
అంతేకాకుండా కాంట్రాక్టర్ రామ్‌పై దాడి చేశారు. స్కార్పియో వాహనం అద్దాలను ధ్వంసం చేశారు. గదుల నిర్మాణ పనులను తమకే అప్పగించి వెళ్లిపోవాలని కాంట్రాక్టర్‌ను టీడీపీ కార్యకర్తలు హెచ్చరించినట్టు సమాచారం.